మంత్రి కొడాలి నాని పలు సందర్భాల్లో వాడే భాష, సంయమనం కోల్పోయి చేసే వ్యాఖ్యలపై అభ్యంతరాలు ఉంటయ్, ఉండాలి… కానీ తను చాలాసార్లు ఎక్స్టెంపర్గా నిజాలే చెబుతాడు… కడుపులో ఉన్న భావాన్ని కక్కేస్తాడు… ఎమోషన్ కంట్రోల్ అనేది ఉండదు… అది తన తత్వం… నిజానికి పేకాట కేసులకు సంబంధించి తను నిన్న చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ ఉన్నట్టు అనిపించడం లేదు… తన వ్యాఖ్యలను పీకీ గీకీ ఏదో పెంట చేయాలని ప్రయత్నించడమే తప్ప విపక్షాలకు అందులో గిట్టుబాటు అయ్యేదేమీ లేదు… ఎందుకంటే..?
తను ఏమన్నాడు..? ‘‘పేకాడితే ఏమవుతుంది..? చట్టం ఉంది, పోలీసులు వెళ్తారు, రైడ్ చేస్తారు, కేసులు పెడతారు, జరిమానాలు కడతారు, మళ్లీ వచ్చి మళ్లీ ఆడతారు… ఇదంతా రొటీన్‌గా జరిగే యవ్వారమే కదా…’’ ఇక్కడే తన వ్యాఖ్యల్ని చదవడం ఆపేస్తే అవి తలబిరుసు మాటల్లా ఉంటయ్… కానీ తను ఇంకా ఏమంటాడంటే..? ‘‘నిజంగానే నేనే ఆడిస్తుంటే, పేకాట క్యాంపులు నిర్వహిస్తుంటే, మా పోలీసులే కేసులు పెడతారా..?’’ ఇదీ తన కామెంట్… అంటే… ‘‘నాకేమీ లింకు లేదురా తండ్రీ, ఎవడో ఆడతాడు, ఎవరో కేసులు పెడతారు, మధ్యలో నన్నెందుకు లాగుతారు..? పట్టుబడిన వాళ్లలో నా కార్యకర్తలుంటే ఇక నేనే ఆడిస్తున్నట్టా..?’’ అని అర్థం…
Ads
దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి… తను చెప్పిందాంట్లో ఓ సత్యం ఉంది… పోలీసు కేసులతో పేకాట ఆగదు… ఇదే కాదు, వ్యభిచారం, డ్రగ్స్, కోళ్లపందేలు, జాతరల్లో రికార్డింగ్ డాన్సులు, మద్యపానం ఎట్సెట్రా కూడా…! అవన్నీ ‘‘హాం ఫట్’’ అని మాయం చేయడం సాధ్యం కాదు… చట్టాలు, కేసులతో అన్నీ ఆపేస్తాం, నియంత్రిస్తాం అనుకుంటే అది అజ్ఞానమే… పేక మరిగిన చేతులు పులిజూదం, అష్టాచెమ్మా, వామనగుంటలు ఆడుతాయా..? సర్కారు ఆపుతుందా.,.?
వ్యభిచారుల పట్టివేత, పేకాట క్యాంపులపై పోలీసుల దాడులు… ఇలాంటి వార్తల్ని చదివి జనం నవ్వుకుంటారు… అవి రాసిన రిపోర్టర్లు, పత్రికలు, ఆ కేసులు పెట్టే పోలీసులు కాలర్లు ఎగరేయవచ్చుగాక… కానీ ఆ వార్తలకు విలువ లేదు… రాత్రంతా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేసిన పోలీసులు తెల్లవారుజామున మందుకొట్టి తామే డ్రైవ్ చేస్తూ ఇళ్లకు వెళ్లిపోయినట్టు…! లీడర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, లాయర్లు, జర్నలిస్టులు… ఎందరు పత్తిత్తులు..? పోనీ, నిజంగానే నాని తనే పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నాడూ అనుకుందాం… మంత్రి కనుసన్నల్లో సాగే దందాకు పోలీసులు ఎందుకు అడ్డువెళ్తారు..? కామన్ సెన్స్ ప్రశ్న…! ఒకవేళ అదే నిజమై పోలీసులు కావాలనే కేసులు పెడితే మాత్రం… జగన్‌కూ, నానికీ నడుమ అగాధం ఏర్పడినట్టు లెక్క… ప్రస్తుతానికి ఆ సూచనలు కూడా లేవు… సో, ఆడుకొండి బ్రదర్స్… చెరువు గట్టు మీద క్యాంపు పెట్టేయండి… ఇది కాకపోతే అది, రాష్ట్రంలో చెరువులే దొరకవా..? బైఠాయించి, ముక్కలు పరవడానికి..!!
Share this Article