Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు సమస్యేమిటి..? ఆడవాళ్లు ఆల్కహాల్‌ బ్రాండ్లను ప్రమోట్ చేయడమా..?

April 12, 2022 by M S R

అవునా..? నిజంగానా..? ప్రజ్ఞా జైస్వాల్ క్షమించరాని తప్పు చేసిందా..? ఒక ఆడ లేడీ ఆల్కహాల్‌ను ప్రమోట్ చేస్తే అంత నేరమా..? కాస్త వివరాల్లోకి వెళ్దాం… అఖండలో ఫాఫం, బోయపాటి ఆమెతో నాకుడు భాష మాట్లాడింపజేసి, అంతటి బాలయ్యకే పచ్చడి నాకుడు, కల్లు తాగుడు నేర్పించాడు ఆమెతో… అఖండ తరువాత కాస్త మళ్లీ వెలుగులోకి వచ్చింది… అంతకుముందు పెద్దగా అవకాశాల్లేక డీలాపడి ఉండేది… ఓ వాణిజ్య ప్రకటన చేసింది ఈమధ్య…

బోర్ బన్ బ్రాండ్ డ్రింక్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది ఆమె… ‘‘వరల్డ్ నంబర్ వన్ డ్రింక్… కానీ బాధ్యతాయుతంగా తాగండి… 25 ఏళ్ల వయస్సు దాటిన వారికి మాత్రమే..’’ అని కూడా రాసి, ఓ ఫోజు ఇచ్చింది… ఇంకేముంది..? ఆమె మీద ట్రోలింగ్ మొదలైంది… ట్రోలర్లు అంటేనే అది కదా… ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని చూడటం, పైనబడి రక్కేయడం…

pragya

Ads

గతంలో సమంత, ఇలియానా, కాజల్ కూడా ఆల్కహాల్ ప్రమోషన్స్ చేసి, ఇలాగే ట్రోలింగుకు గురైనట్టు గుర్తు… ఇప్పుడు కూడా ప్రజ్ఞాను తిట్టేస్తున్నారు… ‘‘ఆన్‌లైన్ తాగుబోతుదానా..? ఏం మెసేజ్ ఇస్తున్నావు సమాజానికి..? ఛిపో, నిన్ను అన్ ఫాలో చేసేస్తున్నా… డబ్బుల కోసం ఏమైనా చేస్తారు ఇలాంటోళ్లు…’’ ఇలా రెచ్చిపోతున్నారు… ఇప్పుడు చెప్పండి, ప్రజ్ఞా చేసింది అంత నేరమా..? పాపమా..?

సినిమాల్లో మందు తాగి రెచ్చిపోయి ఐటం సాంగ్స్ అందుకుంటే వీళ్లే చప్పట్లు కొట్టేది… అసలు ఇక్కడ సమస్య ఆడదై ఉండీ ఆల్కహాల్ ప్రమోట్ చేయడమా..? మగస్టార్లు చేస్తే తప్పులేదా..? మహేశ్ బాబు వంటి పెద్ద స్టార్లే కూల్ డ్రింక్స్, గుట్కాలకు పరోక్ష ప్రకటనలు (సరోగేట్ యాడ్స్), ప్రత్యక్ష ప్రకటనలు, బ్రాండ్ ప్రమోషన్లు చేసి పెడుతున్నారు కదా… అంతటి అమితాబ్ బచ్చన్ కూడా ఓ గుట్కా ఇన్‌డైరెక్ట్ యాడ్ చేసి, వాపస్ తీసుకున్న సంగతి తెలుసు కదా…

సో వాట్..? ప్రపంచంలో ప్రతి సరుకుకూ ప్రచారం కల్పించడానికి యాడ్స్ చేసేది ఆడవాళ్లే కదా… ఆల్కహాల్‌కు మాత్రం మినహాయింపు దేనికి..? అసలు ఇవన్నీ కాదు… మద్యం బ్రాండ్లకు ప్రమోషన్ యాడ్స్ ఎవరూ చేయకూడదు… నిషేధం… మరి సోషల్ మీడియాలో ఈ యాడ్స్ ఎలా వస్తున్నయ్..? సోషల్ మీడియా ‘‘కమ్యూనికేషన్ పద్దతుల’’ జాబితా కిందకు రాదా..? హోర్డింగ్స్, పోస్టర్లు, సినిమాలు, టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్ మాత్రమే ఈ నిషేధం జాబితాలోకి వస్తాయా..?

(Advertising alcoholic beverages has been banned in India as per the Cable Television Network (Regulation) Amendment Bill, which came into effect on 8 September 2000) the Advertising Standards Council of India (ASCI) కోడ్ ప్రకారం డైరెక్ట్, సరోగేట్ యాడ్స్ చట్టరీత్యా నేరం…

అసలు ఈరోజుల్లో ప్రచారం అంటేనే ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాం ఎట్సెట్రా కదా… వాటిల్లో ఈ యాడ్స్ వస్తే తప్పు లేదా..? నైతికంగా తప్పు లేదా..? చట్టపరంగా తప్పులేదా..? అది కదా డిబేట్‌కు రావల్సింది… ఆ తొక్కలో లిక్కర్ బ్రాండ్ యాడ్ ప్రజ్ఞా చేస్తే ఏమిటి..? ఏ రష్మికో, ఏ కృతీశెట్టో చేస్తే ఏమిటి..? అనేక బార్లలో, పబ్బుల్లో ఆడవాళ్లు కాక్ టెయిల్స్ కలుపుతారు, సర్వ్ చేస్తారు… ఓ దశ దాటాక డ్రింకర్స్‌కు ఆడవాళ్లకూ ఆల్కహాల్‌కూ నడుమ తేడా తెలియదు… అలాంటిది ఆడవాళ్లు ఆల్కహాల్‌ను ప్రమోట్ చేయవద్దంటే ఎలా బ్రదరూ..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions