‘‘షర్మిల కాన్వాయ్‌లోని వాహనాలపై దాడి చేయడం, షర్మిల కూర్చున్న వాహనాన్ని టోయింగ్ చేసుకుంటూ పోలీసులు తీసుకువెళ్లడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఒక సమావేశం సందర్భంగా ‘మీ సోదరిని అలా లాక్కుంటూ వెళ్లినా మీకు బాధ కలగలేదా?’ అని జగన్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించడాన్ని ఆషామాషీగా తీసుకోలేం. రాజకీయ ప్రయోజనం లేకపోతే ప్రధానమంత్రి ఈ అంశాన్ని అంత ముఖ్యమైన సమావేశం వద్ద ప్రస్తావిస్తారా?
కేంద్రాన్ని ధిక్కరిస్తే తమకు కలిగే నొప్పి ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు కనుక తన సోదరిని బీజేపీ పెద్దలు రాజకీయంగా ఎలా ఉపయోగించుకున్నా జగన్ నోరెత్తలేరు. ప్రస్తుతానికి జగన్‌కు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న కేంద్ర పెద్దలు రానున్న ఎన్నికల వరకు అదే వైఖరితో ఉంటారని చెప్పలేము…’’
…… ఇదీ రాధాకృష్ణ ఆవేదన, విశ్లేషణ… నిజమే, షర్మిల పట్ల కేసీయార్ ప్రభుత్వం నీచంగానే వ్యవహరిస్తోంది… రాష్ట్ర గవర్నర్ తమిళిసై నే అవమానించకుండా విడిచిపెట్టని సర్కారు ఇది, ఆఫ్టరాల్ షర్మిల… ప్రధాని మోడీని, కేంద్రం హోం మంత్రి షాను బూతులు తిట్టే పార్టీ అది… షర్మిల అనగానెంత..? బీఆర్ఎస్ ధోరణే అది… కానీ మోడీ బాధపడిపోతే, రాధాకృష్ణ చింతాక్రాంతుడైపోతే తక్షణం జగన్ ఏం చేయాలి..?
Ads
ఏయ్, కేసీయార్, మా చెల్లెలి పట్ల ఈ దుర్మార్గ వైఖరి ఏమిటి అని గర్జించాలా..? ఇదిలాగే కొనసాగితే మర్యాద దక్కదు అని హెచ్చరించాలా..? ఏం చేసి ఉండాల్సిందని ఆర్కే అభిప్రాయం..? చుట్టుపక్కల ఉండే ఏపీఎస్పీ బెటాలియన్లను అలర్ట్ చేసి, తెలంగాణ మీదకు దూసుకు రావాలా..? హహహ… ఏపీ నేతలు హైదరాబాద్‌లో ఉంటారు, ఇక్కడే తిరుగుతారు, తెలంగాణ నేతలకు ఏపీలో పనేమీ లేదు… ఏవో చిన్నాచితకా కేసులు పెట్టి సతాయించడానికి..! పైగా కేసీయార్‌కు కోపమొస్తే ఎలా ఉంటుందో వాళ్లకు బాగానే తెలుసు…
తెర వెనుక జగన్, షర్మిల ఒకటే… బీజేపీ కోసమే షర్మిల జగన్ ద్వారా వదలబడిన బాణమే… పేరుకు పైపైన ఇద్దరికీ ఆస్తి గొడవలున్నట్టు, అందుకని ఆమె తెలంగాణ పార్టీ పెట్టుకుని తిరుగుతున్నట్టు కలరింగు… ఏపీ ప్రభుత్వం మీద, జగన్ మీద కోపముంటే తెలంగాణలో పార్టీ ఎందుకు..? అది ఎవరూ నమ్మరు, నమ్మడం లేదు, వేల కిలోమీటర్లు తిరిగినా ఆమెకు మైలేజీ ఏమాత్రం రాలేదు… అనవసరంగా బీఆర్ఎస్ తమ సహజమైన రీతిలో అతిగా స్పందించి ఆమెకు కవరేజీ రావడానికి సహకరిస్తోంది… ఇన్ని మాట్లాడుతున్న కేసీయార్ ఆమె మీద దాడికి పెట్రోల్ పాకెట్లు, రాళ్లు, కట్టెలను తీసుకుపోయిన తీరు మీద స్పందించడు దేనికి..?
ఏమయ్యా జగన్., నీ చెల్లెలి పట్ల ఈ దమన వైఖరి పట్ల నీ స్పందన ఏమిటి అని మోడీ అడిగాడుట… కేసీయార్ ఒకవైపు బీజేపీ ముఖ్యనేతల బట్టలు విప్పేసి, బజారులో నిలబెడుతుంటేనే, కేసుల పెట్టి తోముతుంటేనే మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర స్పందన లేదు… దిక్కుతోచడం లేదు… ఐనా ఆర్కే భాషలో జగన్ వేరు, షర్మిల వేరు కదా… ఇద్దరికీ పడదు కదా… మరి షర్మిల పట్ల కేసీయార్ అనుచిత వైఖరికి జగన్ ఎందుకు స్పందించాలి..? పొలిటికల్‌గా ఆమే పోరాడుతుంది…
పైగా కేసీయార్ అంటే జగన్‌కు, జగన్ అంటే కేసీయార్‌కు మస్తు ప్రేమ అంటుంటాడు ఆర్కే… అలాంటప్పుడు షర్మిల విషయంలో కేసీయార్‌ను ఎందుకు ఆక్షేపిస్తాడు జగన్..? నిజానికి షర్మిల తెలంగాణ పార్టీ ఓ మిస్టరీ… హఠాత్తుగా కేసీయార్ ఆమె మీద దూకుడు ప్రదర్శించడం ఓ మిస్టరీ… నిజంగా జగన్‌ను మోడీ నిలదీశాడా..? తను షర్మిలకు ఫోన్ చేశాడా..? అదీ మిస్టరీయే… ఆమె మీద సానుభూతి పెరిగితే బీజేపీకి ఏం ఫాయిదా..? తెలంగాణ వేదికగా చోటుచేసుకుంటున్న మిస్టరీ రాజకీయాల గుట్టు ఏమిటో ఎవరు చెప్పాలి..?!
Share this Article