Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గట్టిగా ఏడవకండి… మిమ్మల్ని మతోన్మాదులుగా ముద్రవేసే ప్రమాదముంది…

January 22, 2022 by M S R

సోషల్ మీడియాలో చాలా పోస్టులు కనిపించినయ్… Srini Journalist రాసిన ఈ పోస్ట్ ఆలోచనాత్మకంగా ఉంది… సోకాల్డ్, మన కుహనా మేధావుల్లోని పక్షపాతాన్ని, వెన్నులేనితనాన్ని బజారులో నిలబెడుతున్నట్టుగా ఉంది… ఉద్దేశపూర్వక మౌనాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది… ఈ వాదనతో అందరూ ఏకీభవించకపోవచ్చుగాక… కానీ మెజారిటీ మతమే కొన్నిసార్లు బాధిత మతంగా, మైనారిటీ మతాలే ఆధిపత్య మతాలుగా చెలామణీ అయ్యే ఏకైక దేశం బహుశా ఇండియాయేనేమో అనిపిస్తుంటుంది… ఈ పోస్టు ఓసారి చదవండి… (మీకు మెయిన్ స్ట్రీమ్‌లో అసలు వార్తే కనిపించకపోవచ్చు కూడా…)



లావణ్య కోసం ఒక కన్నీటి చుక్క…
.
ఈ వార్త చదివి గట్టిగా నినదించకండి. ఎందుకంటే మిమ్మల్ని హిందూ మతోన్మాద శక్తి గా లెక్క గడతారు… మరీ ఎక్కువ బాధ పడకండి. ఎందుకంటే మీలో దాగి ఉన్న మనువాదం మీతో అలా పలికించేలా చేసింది అంటూ మిమ్మల్ని మాటలతో వెంటాడి వేటాడి చంపేయగలరు… లావణ్య మృతికి కారణం అయిన వారిని ఉరి తీయమని అసలు డిమాండ్ చేయొద్దు. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన సెక్యూలర్ ఫాబ్రిక్ ఫర్రున చిరిగి పోగలదు…. దేశ హితం కోరే వారు అయితే జస్ట్ కుమిలి కుమిలి ఏడ్చుకోండి… లావణ్య కోసం ఒక కన్నీటి చుక్క విడవండి…. ఆ అమాయకపు అమ్మాయి శరీరాన్ని పెస్టిసైడ్ ముక్కలుగా నరికిన ఆ బాధా క్షణాలను గుర్తుకు చేసుకుని, ఇంకో లావణ్య ఇలా తనువు చాలించొద్దని, ‘నీ’ దేవుడిని కాకుండా ‘ వేరే’ దేవుడిని ప్రార్థించండి.
.
జర్నలిస్టులైన మేము ఇలాంటి వార్తలకు ప్రాముఖ్యం ఇస్తే ఒక వర్గానికి కొమ్ము కాసే వారం అవుతాం. అంతే కాదు ఈ వార్త గురించి ఎక్కువ రాస్తే, ప్రగతి నిరోధక శక్తిగా, మూఢ భక్తితో తూగుతున్న వ్యక్తిగా బ్రాండ్ వేస్తారు. లావణ్య (ఆత్మ) హత్యను విశ్లేషణగా రాస్తే మాలాంటి జర్నలిస్టులు హేతువాదానికి, ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కి వ్యతిరేకం అవుతాం కదా… మేము జర్నలిస్టులం ఏమి చేస్తామంటే, ఒక మూల మామూలు క్రైమ్ వార్తలాగా రాస్తాం… ‘ఇంకో’ రకమైన వార్త దొరికింది అంటే అది ఉత్తర్ ప్రదేశో, బీహారో ఎక్కడ జరిగినా సరే… హిందూ… బ్రహ్మణికల్… కుల.. ఉన్మాద శక్తులు .. సంస్థలు అంటూ కసి తీరా తిడుతూ …. అపర ‘మేధావులను’ సెల్ఫ్ మేడ్ ‘సైంటిస్టులు’, ప్రొఫెసర్లను పెట్టి ఒక వారం రోజులు కుమ్మితే కానీ మాలోని అభ్యుదయవాదం తనివి తీరదు…

.

ఇంతకీ ఎవరీ లావణ్య?

.

Ads

పేదింట పెరిగిన లావణ్య తమిళనాడు తంజావూరులో సాక్రెడ్ హార్ట్ అనే కాలేజీలో ఇంటర్ చదువుతోంది. లావణ్య తండ్రి ఒక పేద రైతు. అదే ఊరిలో, కాలేజీకి దాదాపుగా అనుబంధంగా ఉండే St. Michael బోర్డింగ్ హాస్టల్ వార్డెన్ లావణ్య ఇంటికి వెళ్లి చెప్పింది… హిందూ మతం నుంచి క్రిస్టియానిటీకి మారండి, పిల్ల చదువు ఖర్చు అంతా తమదే అని…. ఇది జరిగి రెండు ఏళ్ళు అయ్యింది. ఎందుకో కానీ వారు మతం మారలేదు. లావణ్యపై కూడా విపరీతమైన వత్తిడి… లొంగలేదు… వెంటనే ఎక్కడో మండింది వార్డెన్ కు… ప్రతి రోజు టాయిలెట్స్ శుభ్రం చేయించడం దగ్గర నుంచి అన్ని పనులు చేపించేవారు… హింసించే వారు… ఇక తనవల్ల కాదు అనుకుంది. క్రిమిసంహారక మందు తాగి తనువు చాలించింది…

చెప్పాను కదా… దీనిపై ఇంతకంటే ఏం మాట్లాడుతాం. స్కూల్ లో, గుడి దగ్గరో, ఏదైనా ఊరిలోనే ఇలాంటి మాత మార్పిడి అంశంపై ఆందోళన చేస్తే కొన్ని సందర్భాల్లో ఉల్టా ఆందోళనకారులపైనే కేసులు… ఏమంటే శాంతి భద్రతలకు విఘాతంగా RSS VHP ముసుగులో సంఘవిద్రోహ శక్తులు పనిచేస్తున్నాయని దబాయింపు… అందుకే అనాలి అనిపించింది… ఎక్కువ మాట్లాడకండి… కేవలం ఒక కన్నీటి చుక్క విడవండి ఆ అమ్మాయిని గుర్తు చేసుకొని…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions