సహజం… మన రాష్ట్రం కాబట్టి… పదేళ్లు అధికారంలో ఉన్న కేసీయార్ దిగిపోతున్నాడు కాబట్టి… రాష్ట్రవ్యాప్తంగా కేసీయార్ వ్యతిరేక గాలులు ఉధృతంగా వీచాయి కాబట్టి అందరి దృష్టీ… పోనీ, మనందరి దృష్టీ తెలంగాణ ఫలితాల మీదే కాన్సంట్రేట్ అయ్యింది పొద్దున్నుంచీ…! కానీ బీజేపీకి కీలకమైన మరో మూడు రాష్ట్రాల్లో ఫలితాలు మరింత ఆసక్తికరంగా ఉన్నయ్…
విపక్షాలన్నీ కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాక మేజర్ ఎలక్షన్స్ ఇవి… అఫ్‌కోర్స్, అప్పుడే ఆ కూటమిలో లుకలుకలు పెరిగాయి, అది వేరే సంగతి… తెలంగాణాలో సీపీఎం- కాంగ్రెస్ నడుమ సయోధ్యే కుదరలేదు… సో, వచ్చే జనరల్ ఎలక్షన్స్ నాటికి ఈ కూటమిలో మరింత గందరగోళం ఉండటం ఖాయం…
తెలంగాణ ఫలితాల్ని కాసేపు వదిలేద్దాం… ఇది కాంగ్రెస్ విజయం అనడంకన్నా… కేసీయార్ ఓటమి అనడం కరెక్టు… కేసీయార్ ఎన్నిరకాలుగా బజారుకు లాగినా సరే, రేపటి ఆకాంక్షల కోసం, అవకాశాల కోసం కేసీయార్‌తో రహస్యంగా అంటకాగిన బీజేపీ పరాభవం అనడం కరెక్టు… మిగతా మూడు రాష్ట్రాల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ తెలంగాణలో ఆశించిన సీట్లను గెలవలేకపోవడం తన స్వయంకృతమే… ప్రధానమైంది కేసీయార్‌తో ప్రచ్ఛన్న స్నేహం…
Ads
కేసీయార్ మీద ప్రజల వ్యతిరేకత బీజేపీ మీద కూడా పడింది… లేకపోతే బీజేపీకి ఇంకా మంచి ఫలితాలు వచ్చేవి… దశాబ్దాలుగా టీడీపీకి తోకపార్టీగా చేసి బీజేపీని దెబ్బతీశారు… ఇక సొంతంగా పెరగొచ్చు అని కేడర్ ఆశపడితే ఈసారి బీఆర్ఎస్‌కు తోకను చేసి దెబ్బతీశారు… ఎస్సీ వర్గీకరణ, బీసీ సీఎం వంటి కీలక నిర్ణయాలను ముందే ప్రకటించి, బీఆర్ఎస్‌పై ఔట్ రైట్ పోరాడితే బీజేపీ పొజిషన్ ఇంకా బెటర్‌గా ఉండేది… సరే, మరి మిగతా మూడు రాష్ట్రాలు..?
అన్ని ఎగ్జిట్ పోల్స్ చత్తీస్‌గఢ్, రాజస్థాన్ బీజేపీ చేజారినట్టేనని అంచనా వేశాయి… మధ్యప్రదేశ్ కూడా తక్కువ ఎడ్జ్‌తో బయటపడొచ్చునని అనుకున్నాయి… చత్తీస్‌గఢ్ సహా ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మంచి విజయాలే సాధించింది… ఈ మూడు ఓడిపోతే, రాబోయే జనరల్ ఎలక్షన్స్‌లో ఎదురుగాలులు వీస్తాయేమోనని భయపడింది బీజేపీ… అందుకే ఎందుకైనా మంచిదని బీఆర్ఎస్‌కు ప్రచ్ఛన్న సాయం చేసింది..,. ఎప్పుడైనా, ఏ స్థితి ఎదురైనా సరే, సొంత బలం మీదే ఆధారపడాలనే స్పూర్తిని వదిలేసింది…
ఒకప్పుడు 2 సీట్లకు పరిమితమైన పార్టీ… రెండు టరమ్స్ సొంత మెజారిటీతో అధికారం చలాయించడాన్ని మరిచిపోతే ఎలా..? ఇక ఆ మూడు రాష్ట్రాల్లో ఎవరెవరిని ముఖ్యమంత్రులను చేస్తుందనేది పక్కన పెడదాం… కొత్త వాళ్లతో ప్రయోగాలు చేస్తుందని భావిస్తున్నారు… మంచిదే… ఇక ఈ ఊపు కంటిన్యూ చేయడానికి ఒకటీరెండు నెలల ముందుగానే జనరల్ ఎలక్షన్స్‌కు వెళ్లాలనీ ఆలోచిస్తున్నారట…
వాళ్లు భయపడుతున్నంత బలంగా ‘ఇండి కూటమి’ ఏమీ లేదు… పైగా రాష్ట్రాల ఎన్నికలు వేరు, జాతీయ స్థాయి జనరల్ ఎలక్షన్స్ వేరు… ఆ ఎన్నికల్లో మోడీ పాపులారిటీ బీజేపీకి ఉపయోగపడుతుంది… తరువాత తనే ప్రధానిగా ఉంటాడా..? ఇంకెవరికైనా ప్రధాని కుర్చీ ఇచ్చి తను దిగంతాల వైపు వెళ్లి సన్యసిస్తాడా అనేది వేరే సంగతి… కానీ మరోసారి గెలుపు బాధ్యతను తనే మోయక తప్పదు…!!
Share this Article