.
బీఆర్ఎస్‌లో కవిత తిరుగుబాటు వ్యవహారం శృతి మించి, రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచుతోంది… ఇదంతా కేసీయారే స్వయంగా ఆడిస్తున్న డ్రామా అని బయటికి కొన్ని సెక్షన్లు ప్రచారం చేస్తున్నా సరే.., ఏవో సీరియస్ డెవలప్‌మెంట్స్ చకచకా సాగిపోతూనే ఉన్నాయి…
గతంలో ఆమె నాయకత్వం వహించిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి పోటీగా సింగరేణి జాగృతిని ప్రకటించి పదకొండు ఏరియాలకు కన్వీనర్లను కూడా పెట్టేసింది… తనతో సంప్రదింపులకు వచ్చిన కేసీయార్ ముఖ్య అనుచరులతో కూడా ఆమె తన నిర్ణయాన్ని తెగేసి చెప్పినట్టు సమాచారం…
Ads
పార్టీలో తన పొజిషన్ ఏమిటో క్లారిటీ వస్తే తప్ప పునరాలోచన లేదని చెప్పిందట… కేటీయార్‌కు సర్వంసహా వారసత్వాన్ని ఇవ్వాలనే స్థిర నిర్ణయంతో ఉన్న కేసీయార్ కవిత కోరికలు, ప్రతిపాదనలకు లొంగడం లేదట… సరే, వాట్ నెక్స్ట్..? సొంతంగా కెరీర్ ఎంచుకోవడం వరకూ వోకే గానీ ఏం సాధించగలదు, ఎటువైపు ప్రయాణం అనేవి చర్చనీయాంశాలు ఇప్పుడు…
‘‘జూన్ మొదటి వారంలో బహుజన సామాజిక న్యాయం ఎజెండాగా సొంత పార్టీ ప్రకటించేసి… (తెలంగాణ జాగృతి..? టీబీఆర్ఎస్..?) పాదయాత్ర ప్లాన్ చేస్తుంది… వెంటనే కాంగ్రెస్ ఆమెను చేర్చుకోదు కాబట్టి, కొన్నాళ్లు స్వతంత్రంగా వర్క్ చేసుకోవాల్సిందే… ఎలాగూ బీజేపీలోకి వెళ్లదు, తరువాత కాంగ్రెస్‌లో షర్మిలలాగే తన పార్టీని విలీనం చేస్తుంది… ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉంది….’ ఇదీ ఓ సీనియర్ జర్నలిస్ట్ తేలికగా కొట్టిపడేశాడు ఓచోట పిచ్చాపాటీ చర్చలో…
సరే, రిజల్ట్ ఏమిటో కాలం చెబుతుంది… కానీ ఇదంతా బీఆర్ఎస్‌కు నష్టం చేకూర్చదా అనడిగితే… తన విశ్లేషణ భిన్నంగా వినిపించింది… నిజానికి ఆమె బయటికి వెళ్లిపోవడం కేసీయార్‌కు, పార్టీకి లాభదాయకం అని తేల్చేశాడు… ఎందుకంటే..?
‘‘ఇప్పటిదాకా కేసీయార్ మీద ఉన్న విమర్శ ఏమిటి..? అంతా కుటుంబ పార్టీ, కుటుంబ పాలన అనేదే కదా… ఆమె వెళ్లిపోతే… పార్టీ కోసం అవసరమైతే తన సొంత బిడ్డను కూడా సహించలేదు, వెళ్లిపోతే వారించలేదు అనే వాదన కొత్తగా కేసీయార్‌కు ప్లస్ అవుతుంది… తన మీద ఉన్న ప్రధాన విమర్శకు బలం తగ్గిపోతుంది… పైగా ఆమె మీద అవినీతి ముద్ర కూడా ఉంది…’’
ఆయన కూడా కాలేశ్వరం విచారణ కమిషన్ ఎదుట దోషిగా నిలబడబోతున్నాడు కదాని వేరే మిత్రుడు అడిగితే… ‘‘తప్పు, దోషిగా కాదు, దోషి అని ఇప్పటికి ఏ కమీషనూ తేల్చలేదు కదా… పీవీ వంటి మాజీ ప్రధానే కోర్టుకు హాజరయ్యాడు, చంద్రబాబు కూడా ఏదో కమిషన్ ఎదుట హాజరయ్యాడు… దీంతో నష్టమూ లేదు, పార్టీకి పెద్ద సమస్యా కాదు’’ అన్నాడు…
కాదు, ఏ కమిషనైనా ఆయన తప్పుల్ని ఆధారాలతో సహా నివేదిస్తే అది తనకు పెద్ద మైనస్… తనకు శిక్షలు ఏం వేస్తారని కాదు, అవి ఏవో అర్జెంటుగా తేలతాయని కూడా కాదు.., రేవంత్ రెడ్డి వంటి నాయకుడు కాలేశ్వరం, పవర్ ఇష్యూస్, ఫోన్ ట్యాపింగు వంటి అంశాల్లో కేసీయార్ తప్పుల్ని జనంలోకి ఎలా తీసుకుపోతాడు, అది బీఆర్ఎస్‌కు ఎంత నష్టమనేది ముఖ్యం కదా … ఒకవేళ రాబోయే రోజుల్లో బీజేపీతో కేసీయార్ అవగాహన కుదుర్చుకుంటే అప్పుడిక కాంగ్రెస్‌తో ముఖాముఖీ ఫైటే కదా … ఇది మరో మిత్రుడి ప్రశ్న…
ఆయన కాసేపు నిశ్శబ్దం… అవును, అసలే ఒడిదొడుకుల్లో ఉన్న పార్టీకి ఖచ్చితంగా అది మైనసే కదా… తను హఠాత్తుగా మాట మార్చి ‘‘ఆమెకు ఈరోజుకూ పార్టీ వర్గాల నుంచి పాజిటివ్ స్పందన కనిపించడం లేదు, ఆమెకు మద్దతుగా ఎవరూ లేరు, అందుకే మరో షర్మిల అవుతుందని అంటున్నారు… ఆమె తదుపరి ప్రయాణం ఏమిటో, ఏ సమీకరణాలు ఏమిటో కాలం చెబుతుంది’’ అని క్లోజ్ చేశాడు…
ఏమో, కేటీయార్ వారసత్వం నచ్చని మరో ముఖ్యమైన నాయకుడు ఆమె తిరుగుబాటలో తనూ కలిసి నడిస్తే..,? అప్పుడేమిటి సిట్యుయేషన్ అనడిగిన తదుపరి ప్రశ్నకు సమాధానం లేదు… నిజమే, బీఆర్ఎస్ క్యాంపు కూడా సైలెంటుగా ఉంది… ఏం స్పందించాలో తెలియక, ఏం జరుగుతున్నదో అర్థం గాక..!!
ఆ లేఖ ఫేక్ ఫేక్, రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామా అన్నారు కొందరు బీఆర్ఎస్ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు… కానీ ఆమే తనే లేఖ రాసినట్టు స్వయంగా చెప్పడంతో షాక్… అందుకే ఏం మాట్లాడితే ఏం సమస్యో తెలియక ప్రస్తుతానికి మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు..!!
Share this Article