Murali Buddha……… అది 1999… ఎన్నికల సమయం… చంద్రబాబు నివాసంలో బీజేపీ పొత్తుపై పార్టీ ముఖ్యులతో సమావేశం జరుగుతోంది… పొత్తు ఉండాలా వద్దా అని అభిప్రాయ సేకరణ… (నిజానికి చంద్రబాబు ఏ అంశంపైనైనా నిర్ణయం తీసుకున్నాకే అభిప్రాయం అడిగే తంతు జరుపుతారు …. ముఖ్యమైన పరిణామం కావడంతో తెలుగు మీడియాతో పాటు పెద్ద ఎత్తున అక్కడ జాతీయ మీడియా తిష్ట ….)
అప్పుడు బీజేపీలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు బీజేపీ పంపితేనే మాట్లాడేందుకు చంద్రబాబు ఇంటికి వచ్చారు … మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది… చంద్రబాబు పిలుపు కోసం దగ్గుబాటి హాలులో కూర్చుంటే, ఎంతకూ లోనికి పిలుపు లేదు . ఓ నేత వచ్చి చంద్రబాబు మిమ్ములను కలవడానికి ఇష్టపడటం లేదు, మీరు వెళ్లి పోవచ్చు అని చెప్పి పంపించేశారు .! దగ్గుబాటి అవమానంతో బాధగా వెళ్లి పోయారు…
నిజానికి తోడల్లుడు, దగ్గుబాటి వర్గం mla ల మద్దతుతోనే చంద్రబాబు సీఎం అయ్యారు కదా, మరి తనను అంత నిర్దయగా పంపించేయాలా ? అంత అవమానించాలా..? సరే, పొత్తు చర్చలు జరపక పోయినా సరే, ఓ బంధువుగా లోనికి పిలిచి, మాట్లాడి పంపవచ్చు కదా అని అందరికీ అనిపించింది …. ఆ బీట్ చూస్తున్న రిపోర్టర్లకు మరీ…
Ads
చంద్రబాబు అంటే అంతే… తను కరడు గట్టిన రాజకీయ నాయకుడు, తన రాజకీయం అలానే ఉంటుంది… తనను అర్థం చేసుకున్నవారికే తెలుస్తుంది… అవమానపడ్డవాళ్లకు ఇంకాస్త బాగా తెలుస్తుంది… ఇదంతా ఎందుకు గుర్తుకు వచ్చింది అంటే.. ? ఆంధ్రలో ఎన్నికలు ఇంకా రెండేళ్ల తరువాత వస్తాయి … కేఏ పాల్ లాంటి కామెడీ పీస్ కూడా మేమే గెలుస్తాం అంటాడు …
ఏమాత్రం రాజకీయం తెలిసి ఉన్నా సరే, పవన్ కల్యాణ్ తామే అధికారంలోకి వస్తున్నట్టుగా ఉండాలి… చంద్రబాబు తెలివిగా వచ్చి కలిసే ప్రయత్నం చేసినా సరే, తెర వెనుక ఏమున్నా సరే, రాజకీయం తెలిసి ఉంటే పవన్ చంద్రబాబును కలిసి ఉండేవాడు కాదు… పవన్ చంద్రబాబును కలవడంతో… పవన్ నా కోసమే పని చేస్తున్నాడు అన్నట్టుగా బాబు సంకేతాలు పంపాడు… బలహీనంగా ఉన్న బాబుకు అదే కావాలి …
మరి పవన్ ఏం సాధించినట్టు …? ఇద్దరం ఒకటే అనే సంకేతాల ద్వారా పవన్ సీట్లను బేరమాడే శక్తి కూడా కోల్పోయాడు … అదీ చంద్రబాబు అంటే… ఎన్నికలకు రెండేళ్ల కాలం ఉంది రెండేళ్లలో ఏమైనా జరగవచ్చు… తను రాజకీయ తెలిసిన నాయకుడు అయి ఉంటే, రెండు పార్టీలను విమర్శించి, వాటిని బలహీనపరచి, తాను మొదటి స్థానంలోకి వస్తాను అనే అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నించేవాడు… నాయకుడు కాదు కాబట్టే చంద్రబాబు పట్టుకొచ్చిన పూలబొకేకు పడిపోయాడు… పవన్‌కు రాజకీయం తెలియదు సరే, కానీ స్పీకర్‌గా కూడా పనిచేసిన, నాదెండ్ల మనోహర్‌కు తెలియవా ఇవన్నీ… ఏమోలెండి…
Share this Article