.
అల్లు అర్జున్ తప్పేమీ లేదు… అని పదే పదే చెబుతూ… తన ఇంటికి ఓదార్పు యాత్రగా వెళ్లి, క్యూలు కట్టి, బన్నీయే బాధితుడు, పోలీసులు నేరస్థులు అన్నట్టుగా మరీ మరీ పరామర్శించిన సినీ ప్రముఖులందరూ ఒక ట్వీట్ కాస్త తాపీగా చూడాలి…
తనను సమర్థిస్తూ… ఇదే అదునుగా ప్రభుత్వం మీద విమర్శలకు దిగిన రాజకీయ పార్టీల నాయకులు మరింత సీరియస్‌గా ఈ రుజువులు చూడాలి ఓసారి… అవసరమైతే ఈ రుజువులు జనం మొత్తం చూసేలా రేవంత్ రెడ్డి టీమ్ ఇంకేదైనా ప్రయత్నం చేయాలి…
Ads
నిన్న ప్రెస్‌మీట్‌లో బన్నీ చెప్పిన ప్రతి మాటా అబద్ధం… పైగా తను తెలుగు ఖ్యాతిని పెంచడానికి శ్రమపడుతున్నాడట… తండ్రి అల్లు అరవిందుడైతే మరీ జోక్… తొక్కిసలాట విషయం తెలిశాక రోజూ ఇంట్లోని గార్డెన్‌లో ఓమూల ఒంటరిగా కూర్చుని బన్నీ చింతిస్తున్నాడట… మహా నటులు…
ఇదుగో ఇదీ ఆ ట్వీట్…
https://x.com/dasari_srini/status/1870518324410622431?s=46&t=LIVC4TC20GjC2kte8f5GLg
దాసరి శ్రీనివాస్ ఈ ట్వీటర్… పాయింట్ టు పాయింట్ సంధ్య థియేటర్ తొక్కిసలాట దగ్గర నిజంగా ఏం జరిగిందో, అల్లు అర్జున్ ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించాడో కళ్లకుకట్టింది 9 నిమిషాల వీడియో…
పదే పదే కొందరు చెబుతున్న మాట… అల్లు అర్జున్ ఒక్కడే ప్రత్యక్ష కారణం కాదు అని… రాంగోపాలవర్మ వంటి ధూర్తుల మాట వదిలేయండి, ఇతర సినిమా పెద్దలూ అలాగే మాట్లాడుతున్నారు… కానీ ప్రత్యక్ష కారణం మాత్రమే కాదు, ప్రధాన కారణం కూడా తనే అని ఈ వీడియో నిరూపిస్తోంది… ఈసారి బన్నీ బెయిల్, నేరనిరూపణ సందర్భంగా కోర్టులో ప్రజెంట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందేమో బహుశా,..
ఈ మొత్తం వీడియోలో నన్ను కదిలించింది… ఆ పిల్లాడికి సీపీఆర్ చేస్తూ, బతికించడానికి అక్కడే చేసిన ప్రయత్నాలు… ఆ సమయంలోనూ ఆ మానవీయ ధోరణిని కనబరిచిన ఆ పోలీసులకు అభినందనలు…
ఇంతకీ ఆ ట్వీట్‌లో మిత్రుడు ఏమంటాడంటే..?
‘‘1. పోలీసులు అనుమతించకపోయినా వచ్చాడు… వచ్చే విషయమూ పోలీసులకు తెలియదు…
2. ఇద్దరు పిల్లలతోసహా… మూడు కార్లు వచ్చాయి… అన్నిసార్లు గేట్లు తెరవడంతో క్రౌడ్ లోపలకు వచ్చేసింది తోసుకుంటూ… తరువాత తన ప్రైవేటు సెక్యూరిటీ మొత్తం బాల్కనీ, దానికి వెళ్లే దారుల్ని తమ గుప్పిట్లోకి తెచ్చేసుకుంది…
3. మెట్రో నుంచి థియేటర్ వరకు రోడ్ షో సాగింది… సమీప థియేటర్లు, మెట్రో స్టేషన్లు, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, స్టీల్ బ్రిడ్జి మొత్తం రద్దీ, క్రౌడ్… దానికి ఎవరు అనుమతి ఇచ్చారు..? ట్రాఫిక్‌పరంగా అత్యంత సున్నితమైన ఆ జంక్షన్‌లో ఈ రోడ్ షో దేనికి..?
4. తను థియేటర్‌లోకి వెళ్లి, 40, 50 మంది ప్రైవేటు సెక్యూరిటీతో అప్పర్ బాల్కనీకి వెళ్లే మార్గం మూసేశాక… గ్రిల్ గేటుపై ఒత్తిడి పెరిగింది… ఇక తొక్కిసలాట స్టార్ట్…
5. అప్పర్ బాల్కనీకి వెళ్తున్నప్పుడు తన ప్రైవేటు సెక్యూరిటీదే ఆజమాయిషీ అక్కడ… బాల్కనీ గేల్లు మూసేయాలని చెప్పిందీ వాళ్లే…
6. థియేటర్ లోపల ఆ సెక్యూరిటీయే ఆదేశాలిస్తోంది… లోయర్ బాల్కనీ నుంచి కూడా పైకి ఎక్కడానికి ప్రయత్నించారు ఫ్యాన్స్…
7. రేవతి, తన కొడుకు కింద పడిపోయి… స్పృహతప్పిపోయిన స్థితిలో… పోలీసులు కాపాడటానికి చాలా ప్రయత్నించారు… ఆ సమయంలో కూడా బన్నీ లోపల షో చూస్తున్నాడు…
8. ఈ తొక్కిసలాట గురించి తనకు పోలీసులు చెప్పినా సరే, షో అయిపోయేవరకూ వెళ్లబోనన్నాడు…
9. చివరకు థియేటర్ మేనేజర్‌ను పిలిచి పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చాక గానీ బన్నీ బయటకు కదల్లేదు… ఐనా సరే, వెళ్లేటప్పుడు కూడా సన్ రూఫ్ ఓపెన్ చేసి చేతులూపుతూ షో చేశాడు…
10. ఏం జరిగినా తనలో వీసమెత్తు విచారం లేదు…
Share this Article