దేశంలోనే టాప్ టెన్‌లో ఒకటి అని జబ్బలు చరుచుకుంటారు గానీ, ఎప్పుడైనా ఈనాడుకు ఇలాంటి వార్త ఒక్కటైనా రాసుకోవడం చేతనైందా..? దమ్మున్న నిప్పు పత్రిక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏనాడైనా ఒక్కటంటే ఒక్క వార్త ఇలాంటిది రాసుకోగలిగాడా..? ఈనాడుకు పోటీ, దీటు, పోటు, తోపు అని చెప్పుకుని నీలిగే సాక్షికి ఈ దమ్ముందా..? తెలుగులో సరే పోనీ.., డీసీ, హిందూ, ఎక్స్‌ప్రెస్ ఎట్సెట్రా పత్రికలు జాతీయ మీడియా అని ఫోజులు కొట్టడమే తప్ప ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేయగలిగాయా..?
నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా… ఆంధ్రప్రభ ఓ మెగాసెసే ఐటమ్ ఫైల్ చేయగలిగింది… ఇదీ తన నిబద్ధతకు నిదర్శనంగా రాసుకుని చూపించింది… (ఇక్కడ మెగాసెసే అనగా, మెగా ఫ్యామిలీ, మెగా పార్టీలో ఉండటం వల్ల లభించే అవార్డు కాదు లెండి…) ఇంతకూ వార్త ఏమిటంటే..? హైదరాబాదులోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలంగాణ విప్ కూడా..! ఆయన్ని ఆంధ్రప్రభ టీం వెళ్లి కలిసింది… అందులో సర్క్యులేషన్ ముఖ్యులు కూడా ఉన్నారట…
సో వాట్..? రిపోర్టర్లు ప్రజాప్రతినిధులను కలవడం కామనే కదా… పైగా ఇప్పుడు యాడ్స్ కోసం, వార్షిక చందాల కోసం కూడా తరచూ వెళ్లి కలవాల్సి వస్తోంది… మరి ఇందులో న్యూస్ ఏముంది అంటారా..? అవును అదే కదా విశేషం… అదే వార్తగా మారిపోయింది… రెండు ఫోటోలు… అయిదు కాలాలు…
Ads
వీళ్లంతా కట్టకట్టుకుని ఎమ్మెల్యే దగ్గరకు పోవడం ఏమిటో… జాతికి, వ్యక్తిగతంగా తనకు ఆంధ్రప్రభ చేస్తున్న నిరుపమాన సేవల్ని ఆయన ప్రస్తుతించడం ఏమిటో… పనిలోపనిగా ఓ పొలిటికల్ ప్రసంగం చేసేయడం ఏమిటో… అది ఐదు కాలాల వార్తగా తెల్లారే ప్రత్యక్షం కావడం ఏమిటో… ఈ జర్నలిజాన్ని ఏమనాలో… ఏ పేరుతో పిలవాలో… ఈ ఫీల్డులో తలలు బాగా తెల్లపండిన పెద్దలు ఓసారి ఆలోచించాలి… రాబోయే జర్నలిజం పాఠ్యపుస్తకాల్లో అదే పేరుతో ఓ అధ్యాయం రాయడానికి వీలుగా..!!
Share this Article