1908… జూన్… ఒక భారీ గ్రహశకలం భూమిని దాదాపు ఢీకొట్టినంత పనిచేసింది… సెర్బియా ఉపరితలం మీద బద్ధలైతే దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ అడవి తగలబడిపోయింది… గ్రహశకలాలతో ఇదీ ముప్పు… రాబోయే 2029లో మరో భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అంటున్నాడు…
నిజమే… గ్రహశకలాలు భూమికి దగ్గరగా రావడం, చిన్నవైతే మన కక్ష్యలోకి రాగానే మండిపోవడం చూస్తున్నదే… పెద్ద శకలాలైతే భూమిని ఢీకొనాల్సిందే… మరీ మన అదుపులోకి రాని గ్రహశకలం ఢీకొంటే మాత్రం అరుదైన జీవజాతులు అంతరించే ప్రమాదం ఉందని అంటున్నాడాయన…
కొంతవరకూ కరెక్టే… నిజానికి గతం వేరు… ఇప్పుడు వేరు… భూమికి ప్రమాదకరంగా దూసుకొచ్చే గ్రహశకలాలను వేరే వ్యోమనౌకలతో ఢీకొట్టి గానీ, దానిపై మిసైల్స్ ప్రయోగించి గానీ వాటిని దారి మళ్లించి, భూమికి దూరంగా తరిమేయడం మరో పద్ధతి… గతంలో ఈ ప్రయోగాలు సక్సెసయ్యాయి కూడా…
Ads
ఏదో సందర్భంగా సోమనాథ్ మీడియాతో మాట్లాడుతూ… ‘‘మన జీవితకాలం 70 – 80 ఏళ్లే… కాబట్టి మనం ఇలాంటి విపత్తులను చూడకపోవచ్చు… దీంతో, గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేస్తాం… కానీ చరిత్రలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి… తరచూ భూమిని గ్రహశకలాలు ఢీకొడుతుంటాయి… గురుగ్రహాన్ని ఓ గ్రహశకలం ఢీకొట్టడాన్ని నేను చూశాను… అలాంటిదే భూమ్మీద జరిగితే మనందరం అంతరించిపోతాం… ఇవన్నీ కచ్చితంగా జరుగుతాయి… కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి…
పుడమి తల్లిని ఇలాంటి విపత్తు నుంచి రక్షించాలి… భూమి వైపు దూసుకొచ్చే గ్రహశకలాలను దారి మళ్లించే మార్గం ఉంది… భూమికి సమీపంగా ఉన్న గ్రహశకలాలను ముందుగా గుర్తించి ప్రమాదం నివారించొచ్చు… అయితే, ఒక్కోసారి ఇలా చేయడం సాధ్యపడకపోవచ్చు… కాబట్టి, ఇందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలి… భారీ వ్యోమనౌకలతో ఢీకొట్టించి గ్రహశకలాలను భూమ్మీద పడకుండా దారి మళ్లించాలి… ఇందు కోసం ప్రపంచదేశాలు ఉమ్మడిగా వివిధ విధానాలు రూపొందించాలి’’ అని అన్నాడు…
అవసరమైతే ఇస్రో అన్ని దేశాల అంతరిక్ష విభాగాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుందన్నారు… గుడ్… తన భవిష్యత్ దర్శనం కరెక్టు… ఇలాంటి విపత్తులపై ఏం చేయాలో ఈరోజుకూ అన్ని దేశాలకూ ఓ ఉమ్మడి ప్రణాళిక, ఓ ఆలోచన, ఓ కార్యాచరణ లేదు… తప్పకుండా అవసరమే…
2036లో కూడా ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొనే ప్రమాదం ఉందని గుర్తించారు… ఎప్పటికప్పుడు ఇలా వచ్చే శకలాలను అంతరిక్షంలోనే పేల్చేయడం, దారిమళ్లించడానికి ఓ సంయుక్త కార్యాచరణ తప్పనిసరి… గతంలో డైనోసార్లు అంతరించి పోవడానికి కూడా ఇలా ఓ భారీ గ్రహశకలం ఢీకొనడమే కారణమనే వాదన కూడా ఉంది… ఇంట్రస్టింగు…
Share this Article