.
రేవంత్ రెడ్డి మాటల్లో తప్పేముంది..? ఏమీ లేదు… నిష్ఠురంగా ఉన్నా నిజమే అది… కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్టు… ప్రజెంట్ జర్నలిజం అలాగే తగలడింది కదా…
ఆ మాటలు అన్నది రేవంత్ రెడ్డి కాబట్టి… బీఆర్ఎస్, బీజేపీ పెద్దలు జర్నలిజానికి అవమానం అంటూ గొంతులు చించుకుంటున్నారు గానీ… రేవంత్ రెడ్డి మాటల్లో తప్పేమీ లేదు…
Ads
నిజం… ఓనమాలు రానివాళ్లు కూడా జర్నలిస్టులు ఈరోజు… ప్రింట్ మీడియా, టీవీ మీడియా కాసేపు పక్కన పెట్టండి… యూట్యూబ్ జర్నలిజం, థంబ్ నెయిల్స్, వాట్సప్ జర్నలిజం, పెయిడ్ క్యాంపెయిన్ జర్నలిస్టులు, ఫేక్ క్లిప్పింగ్స్, ఆల్టర్డ్ వీడియోలు, మార్ఫ్‌డ్ ఫోటోలు, ఇంటెన్షనల్ ఫోస్ట్స్ విత్ మోలిఫైడ్ పొలిటికల్ ఇంట్రస్ట్స్…
ఎన్ని చూడడం లేదు..? కోట్లకుకోట్లు ఖర్చు చేస్తూ… ఎవరిని పడితే వారిని తిట్టిస్తూ, వీడియోలు చేసి, జర్నలిజం పేరిట సోషల్ మీడియాలోకి పుష్ చేస్తూ… దాన్నే జర్నలిజం అని చెబుతూ, కేవలం మోలిఫైడ్ పొలిటికల్ ఇంట్రస్టుల కోసం నడిచే క్యాంపెయిన్‌ను జర్నలిజం అందామా..?
ఈ జర్నలిస్టులతో నిజమైన జర్నలిజం కదా అవమానపడుతోంది… ఫీల్డులో బ్లాక్ మెయిలింగ్, పోలీస్ కేసులు, బెదిరింపులు, వసూళ్ల కథ వేరు… అది మరీ దరిద్రం…
ఒక్కసారి గమనించండి, ఫీల్డులో పరిస్థితిని…! వోకే, కొందరు, చాలా కొద్దిమంది మాత్రమే యూట్యూబ్ జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కిస్తూ, ధైర్యంగా పరిశోధనాత్మక జర్నలిజానికి కొత్త దశ, దిశ చూపిస్తున్నారు, వారు ఈ విమర్శలకు మినహాయింపు… ఆ కొద్దిమందికి అభినందనలు…
ఐతే రేవంత్ రెడ్డి అంటున్నట్టు… ఎవరు పడితే వాళ్లు ప్రెస్ మీట్లలో కూర్చుని, జర్నలిస్టులుగా చలామణీ అవుతున్నారు సరే, కానీ అక్కడిదాకా రానిస్తుంది ఎవరు..? అక్రెడిటేషన్లకు ప్రామాణికత ఏమిటి..? అది కదా మారాల్సింది..? మరిక ఐఅండ్‌పీఆర్ చేసే పని ఏమున్నట్టు..? అసలు సీఎం ప్రెస్‌మీట్‌కు ఎవరుపడితే వాళ్లు ఎలా వస్తున్నారు అనేది కూడా అసలు ప్రశ్న…
చివరగా…… జర్నలిస్టులకు ప్రత్యేక హక్కులు గానీ, స్వేచ్ఛ గానీ ఏమీ ఉండదు.,. పత్రికా స్వేచ్ఛ అనే పదమే ఓ భ్రమపదార్థం, బ్రహ్మపదార్థం… రాజ్యాంగంలో ఉన్న భావప్రకటన స్వేచ్ఛే వీటికి ఆధారం… కానీ దానికీ పరిమితులున్నాయి… అవి దాటినప్పుడు జర్నలిస్టులైనా ఒకటే, సగటు మనుషులైనా ఒకటే… ఎవరూ చట్టాలకు అతీతులు కారు…
కాకపోతే రేవంత్ రెడ్డికి పాలిష్డ్ లాంగ్వేజీ తెలియదు.,. కడుపులో ఉన్నది అలాగే కక్కేస్తాడు… అక్కడే వస్తుంది తేడా… నకిలీ, ప్రాపగాండా జర్నలిస్టులను మీరే దూరం పెట్టాలి అనే తన పిలుపు వర్కవుట్ కాదు… ప్రభుత్వం తన డ్యూటీ తను చేయాలి…
గతంలో శశిధరూర్ కమిటీ కేంద్రానికి ఓ నివేదిక ఇచ్చింది… ప్రెస్ కౌన్సిల్ తరహాలోనే ఓ మీడియా కమిషన్ ఉండాలి అని… దాని పరిధిలోకి డిజిటల్, ప్రింట్, టీవీ, యూట్యూబ్, వెబ్ మీడియాలన్నీ వస్తాయి… అదెందుకు ఆలోచించకూడదు..!!
Share this Article