Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వంశీ, శ్రీలక్ష్మి, ఆంజనేయులు… వాళ్ల అనుభవాలు చెప్పే పాఠమేంటనగా…

May 16, 2025 by M S R

.
అధికారులైనా.. రాజకీయ నాయకులైనా గుర్తు పెట్టుకోవాల్సిన లైఫ్ లెసన్స్ వల్లభనేని వంశీ అండ్ IAS శ్రీలక్ష్మి.. IPS పి ఎస్ ఆర్ ఆంజనేయుల అనుభవాలు

అధికారం శాశ్వతం కాదన్న రాజకీయ నాయకుల మాటలు డైరీలో రాసిపెట్టుకోవాలి… అధికారం చేతిలో ఉంది కదా అని ప్రతి నాయకుడ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషిస్తే రెడ్ బుక్ లో పేర్లు నమోదు అవుతాయి అన్న విషయం తెలుసుకోవాలి

రాజకీయాలు గతంలోలా లేవు
ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి
దాని పర్యవసానాలు కూడా తీవ్రంగా ఉంటాయ్
ఇందాక టీవీ వార్తల్లో చూసా

Ads

గడిచిన రెండు నెలలుగా జైల్లోనే మగ్గుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనారోగ్యంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు
చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అంటే ఏంటో ప్రాక్టికల్ గా ఆయనకు తెలిసి వచ్చి ఉంటుంది
ఎంత డబ్బున్నా
ఎంత మంది లాయర్లు ఉన్నా
నాయకుడు తోడున్నా
ఎవరూ ఆయన్ని బయటికి తీసుకురాలేకపోతున్నారు

బెయిల్ రావడం ఆలస్యం అవుతుంది
అతడి మీద పెట్టిన సెక్షన్లు అటువంటివి
ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది
లేటెస్ట్ గా నూజివీడు లో వంశీ మీద ఇంకో కేసు ఫైల్ అయ్యింది

రాజకీయాల్లో వంశీ ఒక్కడే రౌడీయిజం చేశాడా?
ఇంకా చాలామంది ఉన్నారు కదా?
ఆ మాటకొస్తే మన ఎమ్మెల్యేలలో చాలామందిపైనా కేసులున్నాయి కదా?
మరి ఎందుకు వంశీ ఒక్కడే ఇంత టార్గెట్ అయ్యాడు?

Beyond the politics
రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజం
ఇవి లేకుండా రాజకీయాలు లేవు
అయితే వంశీ ఈ లైన్ క్రాస్ చేశాడు
విమర్శల స్తానంలో బూతులు రంగ ప్రవేశం చేశాయి

అధికారం చేతిలో ఉంది కదా అని ప్రతి నాయకుడ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని బూతులు గుప్పించాడు
రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసిన చంద్రబాబు సైతం చిన్న పిల్లాడిలా భోరున ఏడ్చాడు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు

***
ఏపీలో అధికారాలు మారాయి
వంశీ గన్నవరంలో ఓడిపోయాడు
రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు
చంద్రబాబు అయినా వంశీని మర్చిపోయారేమో కానీ లోకేష్ మర్చిపోలేదు
రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటున్నా
అధికారంలోకి వస్తే ముందు వాళ్ళే నా టార్గెట్ అవుతారు అని ఓపెన్గా చెప్పి మరీ టార్గెట్ చేశాడు లోకేష్
అనుకున్నట్టుగానే వంశీ ని టార్గెట్ చేశాడు

ఫలితం నాన్ బెయిలబుల్ సెక్షన్లతో ఎస్సి ఎస్టి యాక్ట్ కింద కేసు నమోదు
వంశీ మీద పెట్టిన కేసులు రాజకీయ కక్ష సాధింపులో భాగమా? కాదా?
వంశీ మీద పెట్టిన కేసులు నిలబడతాయా? లేదా? అన్నది సెకండరీ
ప్రస్తుతం జైలు జీవితంతో అనారోగ్యాల పాలయ్యి ఇబ్బందులు పడుతున్నాడన్నది నిజం

అప్పట్లో వంశీతో పాటు చంద్రబాబును విమర్శించిన కొంతమంది నాయకులు ఇప్పుడు కూడా విమర్శిస్తున్నారు
అయితే అవన్నీ రాజకీయాల్లో భాగం
కాబట్టి ఏ పార్టీలో ఉన్న నాయకులు అయినా తెలుసుకోవాల్సిన సత్యాలు రెండు
అధికారం శాశ్వతం కాదు
రాజకీయాల్లో విమర్శలకే స్థానం ఉంటుంది
వ్యక్తిగత దూషణలకు ఉండదు

***
అలాగే అధికారంలో ఉన్న నాయకులు చెప్పారని ఇష్టారాజ్యంగా ఫైళ్ళ మీద అధికారులు సంతకాలు పెడితే IAS శ్రీలక్ష్మిలా.. IPS ఆంజనేయులు లాగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని గుర్తు పెట్టుకోవాలి
ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని తిరిగి విచారించాలని తాజాగా సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది
నటి జిత్వానీ కేసులో అధికార పార్టీ నాయకుల మాట విని అధికార దుర్వినియోగం చేసిన కేసులో ప్రస్తుతం ఆంజనేయులు జైళ్లో ఉన్నారు

***
ఉపసంహారం: ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కదా అని టీడీపీ నాయకులు beyond the line వెళ్తే భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ఇదే చరిత్ర పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అలాగే ప్రభుత్వ పెద్దలు చెప్పారు కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా అధికారులు
కూడా ఆలోచించుకోవాలి !……… పరేష్ తుర్లపాటి 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రియా హరి..! తనే నిర్మాత, తనే హీరోయిన్… ఓ కృత్రిమ ప్రేమకథ…
  • వంశీ, శ్రీలక్ష్మి, ఆంజనేయులు… వాళ్ల అనుభవాలు చెప్పే పాఠమేంటనగా…
  • రవితేజ సినిమా అయితేనేం… సూపర్ ఫ్లాప్, చివరకు టీవీల్లో కూడా…
  • రియల్ కల్‌ప్రిట్ పాకిస్థాన్ కాదు… దాని వెనుక అమెరికా ట్రంపు…
  • ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?
  • Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!
  • *రెండు జెళ్ల’తో అర్జెంటుగా కుర్రాళ్ల మనసుల్ని పిచ్చెక్కించేసింది…!!
  • ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!
  • బిగ్‌బాస్… బిగ్‌లాస్… కళ్లు నెత్తికి ఎక్కడం తప్ప వేరే ఫాయిదా లేదు..!!
  • ట్రంపు చెప్పాడని ఐఫోన్ గుడ్డిగా వినదు… అది పక్కా వ్యాపారం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions