ప్చ్.., ఆంధ్రజ్యోతి స్పై మైక్రోఫోన్లు, ఈనాడు స్పై బగ్స్ పనిచేయలేదు… అమిత్ షాను జగన్ ఎందుకు కలిశాడో ఎవరూ రాయలేదు… సాక్షికి తెలియదు, తెలిసినా రాయదు… ఏం తెలిసినా ఆ ఆర్కే సారుకు మాత్రమే ఏమైనా తెలిసి ఉండాలి… కానీ రాయలేదు… అధికారగణం మొక్కుబడిగా జనం కోసం జారీచేసిన 16 డిమాండ్ల పత్రం అబద్ధమని తెలిసి దాని జోలికి కూడా పెద్దగా పోలేదు… జగన్ అన్ని మంత్రిత్వ శాఖల అంశాలనూ అమిత్ షాకు మొరపెట్టుకున్నాడు అంటే ఎవరూ నమ్మరు, నమ్మరని తెలిసీ జగన్ టీం దాన్నే మీడియాకు పంపించక మానదు… నమ్మరు అని తెలిసే, సజ్జల తనే స్వయంగా… ‘అబ్బే, జగన్, షా భేటీకి రాజకీయ ప్రాముఖ్యత ఏమీ లేదు తెలుసా..?’ అని అమాయకంగా వెల్లడించాడు… జగన్ ఆర్థిక, రాజకీయ, అధికార, న్యాయ, సాంకేతిక ముఖ్యులంతా తన వెంటే ఉన్నారు… అన్నింటికీ మించి అడ్వొకేట్ జనరల్, ఏఏజీ కూడా ఉన్నారు… జగన్ కోసమే వర్క్ చేస్తున్న జస్టిస్ జాస్తి గారూ మూడునాలుగు రోజులుగా ఢిల్లీలోనే తిష్ఠ వేశారు… మరిక ఈ భేటికి ప్రాముఖ్యత లేదంటే నమ్మేదెవరు..?
మరి ఏమై ఉంటుంది..? రాత్రి పదిగంటల వేళ ఇద్దరూ కలిసి ‘డిన్నర్’ చేయడం కోసం కాదు కలిసింది… కనీసం ఇద్దరూ చీర్స్ బ్యాచ్ కాదు… పోలవరం, రెవిన్యూలోటు, మూడు రాజధానులు, నిమ్మగడ్డ ఇష్యూ, సంగమేశ్వరం లిఫ్టు, విశాఖలో కృష్ణా బోర్డు, రామతీర్థం, బాబు రథయాత్ర, తిరుపతి ఉపఎన్నిక, గుళ్లపై దాడులు, బెయిల్ రద్దు, ప్రత్యేకహోదా తదితర అంశాలపై చర్చ అనేది మరిచిపొండి… మరి..? ప్రాబబులిటీస్ ఆలోచించడమే…
Ads
- జగన్ కారణంగా ఒకాయన బదిలీ అయ్యాడు… కానీ రొటీన్ బదిలీల్లాగే కనిపించేలా జాగ్రత్తపడ్డారు… ఒకాయన రిటైర్ అయిపోయాడు… ఆల్రెడీ మరో పెద్దాయనపై జగన్ ఫిర్యాదు చేశాడు… ఇంకొందరి భూకొనుగోళ్ల వివరాలూ సేకరించారు… మరి ఇప్పుడు జగన్ ఏం అడుగుతున్నాడు..? ఇది ఒక ప్రశ్న… మాజీ జస్టిస్ గారు ఏమైనా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా అనేది తెలియదు…
- కేబినెట్లో చేరాలని గతంలోనే బీజేపీ జగన్ను అడిగింది… లేదా డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చింది… తద్వారా చంద్రబాబుకు గేట్లు పూర్తిగా మూసేసినట్టే అని అందరూ అంచనాలు వేసేశారు… ఎలాగూ శివసేన, అకాలీదళ్ నిష్క్రమణతో కాస్త బలహీనపడినట్టుగా కనిపించిన ఎన్డీఏకు జగన్ చేరిక ఉపయోగకరం అనుకున్నారు… కానీ జగన్ పెద్దగా సుముఖత చూపించలేదు… ఇప్పుడు ఇదే అంశం ప్రధానంగా ఈ భేటీలో చర్చకు వచ్చిందనేది ఓ లీక్డ్ సమాచారం… (అదే జరిగితే పవన్ కల్యాణ్ ఏమైపోతాడు అనేది ఇక్కడ అప్రస్తుతం…)
- కొంత డబ్బు సర్దుబాట్ల అంశం కూడా ఉండవచ్చునని అంచనా… ఆర్థికంగా బీజేపీ బాగా సాలిడ్ పార్టీ… బెంగాల్ అవసరాలు గానీ, ఇంకేమైనా గానీ… వాళ్లకు జగన్ పెద్దగా సర్దుబాటు చేయగలిగేది ఏముంది, అవసరం ఏముంది అనేది మరో ప్రశ్న… త్వరలో జగన్ మళ్లీ మోడీని కలవబోతున్నాడు, ఆ భేటీలోనే కొన్ని కీలకనిర్ణయాలు ఫైనల్ అవుతాయని మరో సమాచారం… హెబ్బే, అంతా బోగస్… ఫేక్… జగన్ కేవలం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమైన అవసరాలు, డిమాండ్ల విషయంలో మాత్రమే అమిత్ షాను కలిశాడు అంటారా..? సరే, మీ ఇష్టం… అలాగే కానివ్వండి…!!
Share this Article