Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాడు కేసీయార్ చేసిందే నవీన్ పట్నాయక్ చేసి ఉంటే… మళ్లీ సీఎం..!!

June 17, 2024 by M S R

‘‘BJD with vote share of 40.22% got 51 seats zero MP seats.

BJP with less vote share of 40.07% got 78 MLA seats and 20 MP.!!

Congress with 13.26% vote share won 14 MLA seats and one 1 MP seat.

Ads

How this magic of zero MP seats for BJD possible?’’

… తెలుగులో రఫ్‌గా చెప్పాలంటే… ఒడిశాలో బీజేడీకి (నవీన్ పట్నాయక్ పార్టీ) 40.22 శాతం వోట్లు… కానీ ఎంపీ సీట్లు జీరో… బీజేపీ వోట్లు 40.07 శాతం… కానీ 78 ఎమ్మెల్యే సీట్లు, 20 ఎంపీ సీట్లు… కాంగ్రెస్ 13.26 శాతం వోట్లతో 14 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు… ఇదేం మ్యాజిక్..? ఈమాత్రం అత్యంత స్వల్ప తేడాతో బీజేడీకి ఏమిటింతటి పరాజయం..?

ఇదీ సదరు పోస్టుల సారాంశం… హఠాత్తుగా ఈవీఎంల మీద మళ్లీ చర్చ ప్రారంభమైంది కదా… ఆంధ్రాలో, ఒడిశాలో ఏదో మాయ జరిగిందనే నమ్మకం, ప్రచారం పెరిగిపోతున్నాయి… ఒక్కసారి ఒడిశా వాస్తవ ఫలితాలను చూద్దాం…


Seats before 23 112 9
Seats won 78 51 14
Seat change Increase 55 Decrease 61 Increase 5
Popular vote 10,064,827 10,102,454 3,331,319
Percentage 40.07% 40.22% 13.26%
Swing Increase 7.58% Decrease 4.49% Decrease2.86%

అది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్… నిజమే… బీజేపీకి బీజేడీకి నడుమ వోట్ల శాతం తేడా జస్ట్ 0.15 శాతం… అంతే… వంద రూపాయల్లో 15 పైసల తేడా… ఈ మాత్రం తేడాకు బీజేడీ 61 సీట్లు కోల్పోయింది, బీజేపీ 55 సీట్లు అదనంగా పొందింది… గెలుపు అటూఇటూ మారిపోయింది… మొత్తం ఒడిశా రాజకీయ, అధికార ముఖచిత్రమే మారిపోయింది… కానీ…


Seats won 20 1 0
Seat change Increase 12 Steady Decrease 12
Popular vote 11,335,549 3,264,769 9,382,711
Percentage 45.34% 13.06% 37.53%
Swing Increase 6.94% Decrease 0.34% Decrease 5.27%

ఇది పార్లమెంటు నియోజకవర్గాల రిజల్ట్… బీజేపీకి ఏకంగా 6.94 శాతం స్వింగ్ ఉంది… బీజేడీ 5.27 శాతం తగ్గిపోయింది… రెండు పార్టీల నడుమ తేడా కూడా 7.81 శాతం… అదుగో అదే నవీన్ పట్నాయక్‌కు ఒక్క ఎంపీ సీటు కూడా రాకుండా చేసింది… ఇవన్నీ ఎన్నికల సంఘం రికార్డులే… రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేడీల నుంచి బీజేపీ వోట్లు లాక్కుంది… అసెంబ్లీ వోట్ల శాతానికీ, ఎంపీ సీట్ల వోట్ల శాతానికీ నడుమ చాలా తేడా ఉంది ఎందుకు..?

గతంలో కూడా అసెంబ్లీ అయితే నవీన్ పట్నాయక్ నాయకత్వానికి, పార్లమెంటు అయితే మోడీకి పాజిటివ్ ధోరణి కనిపించింది… ఇదే నిష్పత్తిలో ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు పంచుకుందామని నవీన్ పట్నాయక్ పార్టీ బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తే కుదరలేదు… నిజానికి జమిలి ఎన్నికలు బీజేపీ కోరుకునే కారణం ఇదే… సరే, అది వేరే చర్చ…

మోడీ పాపులారిటీ బలంగా ఉన్నప్పుడు… పార్లమెంటులో తన నాయకత్వానికే జనం జై కొడుతున్నప్పుడు… అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలు ఒకేసారి జరిగితే ప్రాంతీయ పార్టీ నష్టపోతుంది… ఎస్, గతంలో కేసీయార్ ఇది గ్రహించే… అసెంబ్లీని ముందే రద్దు చేసి, అసెంబ్లీ ఎన్నికలకు విడిగా వెళ్లాడు… తద్వారా ఎన్నిక పూర్తిగా రాష్ట్ర స్థాయి నాయకత్వం మీదే కాన్సంట్రేటై జనం కేసీయార్‌కు వోట్లేసి గెలిపించారు… సరే, మొన్నటి ఎన్నికల ఫలితాలు వేరు…

నిజంగా నవీన్ పట్నాయక్ గనుక… ఎలాగూ బీజేపీతో పొత్తు పొసగదు అనుకుని ఉంటే… తను కూడా అసెంబ్లీని ముందే రద్దు చేసి, విడిగా ఎన్నికలకు వెళ్లి ఉంటే… ఈ 0.15 శాతం వోట్ల తేడాతో నిండా మునిగిపోయేవాడు కాదు… ఖచ్చితంగా గెలిచేవాడు… మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవాడు… పాండ్యన్ మీద వ్యతిరేకత, నవీన్ కావాలనే బీజేపీని గెలిపించాడు వంటి శుష్క, అర్థరహిత వాదనలు కూడా వచ్చేవి కావు…!! (photo courtesy :: indiatoday) అవునూ, ఆ 0.15 వోట్లు అటు గాకుండా ఇటు పడి ఉంటే…?!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions