ఏపీ మంత్రుల మొహాలు మాడిపోయాయి, వాడిపోయాయి, కళాకాంతుల్లేవు, మూడీగా ఉండిపోయారు… అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దాదాపు సేమ్ కథనాల్ని ప్రచురించాయి… రెండూ ఒకే జన్యుసంతతి పత్రికలు కాబట్టి, ఒకే వేవ్‌లెంగ్త్, ఒకే తరహా ప్రయోజనాల కోసం పనిచేస్తాయి కాబట్టి సేమ్ కథనాలు రావడం పెద్ద విశేషం కాదు గానీ… మంత్రిపదవులు ఊడబీకబడిన నాయకుల మొహాలు వాడిపోయి గాకుండా… హుర్రే నా మంత్రి పదవి ఊడిపోయిందోచ్ అని గంతులేస్తారా..? కొత్త వెలుగులతో మొహాలు తళుక్కుమంటాయా..? రెండున్నరేళ్ల తరువాత అందరినీ మార్చేస్తానని జగన్ ఎప్పుడో ప్రకటించి ఉన్నాడు కదా… మరీ యెల్లో మార్క్ ప్యూర్ మారీచకథనాలు…
అవును, నిజంగా చాలామందిలో డౌటుంది… అఫ్‌కోర్స్, దానికి సమాధానాలు ఇచ్చే ఒక్క గొంతూ ఏపీలో కనిపించదు, వినిపించదు… అందర్నీ ఒకేసారి పీకేసి, కొత్తవాళ్లను పెట్టుకోవడం వల్ల జగన్‌కు వచ్చే పొలిటికల్ ఫాయిదా ఏమిటి..? ఇదీ ప్రశ్న… బయటికి చెప్పే కారణాలు అబ్సర్డ్… ఊడబీకబడిన వాళ్లు పార్టీ వర్క్ మీద కాన్సంట్రేట్ చేయాలట, వాళ్లకు ప్రాంతీయ పార్టీ సమన్వయకర్తలుగా చాన్స్ ఇస్తారట… అదేమిటి..? మంత్రులుగా ఉండి పార్టీ వర్క్ చేయలేరా..? జగన్ సీఎంగా ఉండి, పార్టీ అధ్యక్షుడిగా వర్క్ చేయడం లేదా..? నిజానికి మంత్రి హోదాలో ఉంటేనే పార్టీ వర్క్ మీద గ్రిప్ ఉంటుంది…
పార్టీని గెలిపిస్తే మళ్లీ మీరే మంత్రులు అవుతారు అని జగన్ హామీ ఇచ్చాడట… పీకేయడం దేనికి..? పార్టీ మళ్లీ గెలిస్తే మళ్లీ మంత్రి పదవులు ఇస్తానులే అనే మాటేమిటి..? ఈ 24 మంది మంత్రులే పార్టీని గెలిపిస్తారా..? గెలిపించాలా..? అగౌరవంగా భావించకుండా జిల్లా అభివృద్ధి బోర్డుల చైర్మన్లుగా అవకాశం ఇస్తారట… ఈ మంత్రి పదవులు పీకేయడం దేనికి..? అధికారాలేమీ ఉండని ఆ జిల్లా అభివృద్ధి బోర్డుల చైర్మన్ల పదవులు దేనికి..? కళ్లు తుడవడానికా..?
Ads
అందరినీ ఒకేసారి తీసేయడం… అనే ఆలోచన వెనుక దాగిన మర్మం, పరమార్థం ఏమిటో ఎవరికీ తెలియదు… జగన్ తన ఆలోచనల్ని ఎవరితోనూ పంచుకోడు… పార్టీ మీద తన గ్రిప్ చూపించుకోవడం కోసం చేశాడు అనుకుందాం… అసలు పార్టీలో అసమ్మతి ధ్వనులు వినిపించేంత సీన్ ఉంటుందా..? పార్టీలో ఒకటి నుంచి 100 స్థానాల వరకూ జగనే ఉంటాడు… పొలిటికల్‌గా కూడా టీడీపీ ఏమీ పుంజుకోవడం లేదు… మరో ఆల్టర్నేట్ పార్టీ లేదు… మంత్రులుగా తీసేసినా సరే, ఇక జగన్ పార్టీలో కొనసాగడమే తప్ప వీళ్లకు రాజకీయంగా వేరే దిక్కులేదు… ఇక గ్రిప్ కొత్తగా ప్రదర్శించుకోవడానికి ఏముంటుంది..?
పోనీ, తాము మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు మాత్రం ఏం చేశారని..? ఏం చేయనిచ్చారని..? ఒక్కరైనా తమదైన ముద్ర వేయగలిగారా..? పాలసీ నిర్ణయాలన్నీ జగన్ ఆఫీసు నుంచే వెలువడతాయి… మంత్రులతో డిస్కషన్స్ గట్రా ఏమీ ఉండవు… నిజానికి అన్ని శాఖలకూ మంత్రి సజ్జల మాత్రమే… ఇప్పుడు కరెంటు కష్టాలతో ఏపీ విలవిలాడుతోంది కదా… ఇన్నాళ్లుగా కరెంటు మంత్రి ఎవరో ఎవరికైనా తెలుసా అసలు..? కరెంటు సమస్యల మీద ఎప్పుడైనా సమీక్షలు, సమావేశాలు జరిగాయా..?
పంచుడు పథకాలకు డబ్బుల సర్దుబాటు అంశంలో మాత్రం బుగ్గన అలుపెరగకుండా ప్రయాసపడుతున్నాడు… కాస్తకూస్తో మొన్నమొన్నటిదాకా గౌతంరెడ్డి పెట్టుబడుల కోసం ఏవో ప్రయత్నాలు చేశాడు… వ్యవసాయ మంత్రిగా కన్నబాబు… మిగిలినవాళ్లలో ఎంతమందికి తమ శాఖల మీద సబ్జెక్టుపరమైన పట్టు ఉండేది..? ఇష్యూస్ తెలుసా..?
పోనీ, అందరినీ తీసేయాలి అనే సూత్రానికి కట్టుబడి ఉంటాడా జగన్..? లేదు… అయిదారుగురికి కొనసాగింపు ఉంటుందట… మరి మూకుమ్మడి మార్పు అనే ఆలోచన అమలయ్యేదెక్కడ..? ఆల్‌రెడీ, రకరకాల ఈక్వేషన్లు ఆలోచించే మంత్రివర్గ కూర్పు జరిగింది… ఇప్పుడు కొత్తగా మళ్లీ ఈక్వేషన్లు, కొత్తవారు ముహూర్తాలు చూసుకుని, పదవుల్లో చేరి, ఆనందాల్ని పంచుకుని, అమాత్యగిరి అదనపు ప్రయోజనాలేమిటో అర్థం చేసుకునేసరికి ఎన్నికలు ఎదుట నిలుస్తాయి..? సో, మొత్తానికి ఈ ‘‘స్థూల మార్పిడి’’ పథకం వల్ల జగన్‌కు ఒనగూరే ఫాయిదా ఏమిటి..? ఎవరైనా చెప్పగలరా..?!
Share this Article