Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

50 కోట్ల వాట్సప్ ఫోన్‌నంబర్ డేటా అమ్మకానికి కలదు… సంప్రదించగలరు…

November 27, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి ……….. వాట్స్అప్ డాటా అమ్మకానికి కలదు! 50 కోట్ల వాట్స్అప్ నంబర్స్ అమ్మకానికి పెట్టారు ! దాదాపుగా 500 మిలియన్ వాట్స్అప్ ఫోన్ నంబర్స్ ని ఆల్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. 84 దేశాల వాట్స్అప్ వినియోగదారుల ఫోన్ నంబర్స్ ని అమ్మకానికి పెట్టారు. డాటా బ్రీచ్ జరిగింది !

సైబర్ న్యూస్ [Cybernews] కథనం ప్రకారం ఒక హాకర్ 500 మిలియన్ వాట్స్అప్ ఫోన్ నంబర్స్ ని అదే హాకర్స్ కమ్యూనిటీ ఫోరంలో అమ్మకానికి పెట్టాడు. అయితే దీనిని ఒక ప్రకటన రూపంలో డబ్బులు ఇచ్చి మరీ పెట్టాడు, అమెరికా, బ్రిటన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఇటలీ, భారత దేశపు వాట్స్అప్ వినియోగదారుల ఫోన్ నంబర్స్ కలిగిన డాటా తన దగ్గర ఉందని సదరు అడ్వర్టైజ్మెంట్ లో పేర్కొన్నాడు. 2022 అక్టోబర్ నెల వరకు అప్ డేటెడ్ డాటా ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు హాకర్.

వాట్స్అప్ లో ఫిషింగ్ అటాక్ ద్వారా హ్యాకర్ ఈ డాటా సేకరించినట్లు తెలుస్తున్నది. మీకు తెలియని నంబర్స్ నుండి ఏదో ఒక ఆశపెట్టే ఆఫర్ రూపంలో మెసేజ్ వస్తుంది. ఒకసారి దానిలో ఏముందో చూడాలని ప్రయత్నిస్తూ సదరు మెసేజ్ మీద క్లిక్ చేస్తే చాలు వెంటనే మీ ఫోన్ వాట్స్అప్ లో ఉన్న అన్ని నంబర్స్ కూడా హ్యాకర్ చేతిలోకి వెళ్లిపోతాయి. కొంతమంది అనుకోవచ్చు, నేను ఎలాంటి తెలియని నంబర్స్ నుండి మెసేజెస్ ని చూడలేదు కానీ నా నంబర్ ఎలా హ్యాకర్ దగ్గరికి వెళ్ళిపోయింది అని. ఆఫ్కోర్స్ మీరు చూడక్కరలేదు మీ వాట్స్అప్ నంబర్ ఉన్న మీ స్నేహితుల జాబితాలో ఉన్నవాళ్ళలో ఎవరయినా ఒక్కరు ఫిషింగ్ మెసేజెస్ మీద క్లిక్ చేసి ఉండవచ్చు మరియు అతను లేదా ఆమె ఫోన్ లో ఉన్న నంబర్స్ అన్నీ హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇందులో మీ ప్రమేయం ఉండదు.

Ads

మీకు తెలియని లేదా మీ ఫోన్ లో లేని నంబర్స్ నుండి వాట్స్అప్ కాల్ వస్తే, దానిని స్వీకరించి మీరు హలో అన్నా సరే, మీ డాటా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అంచేత మీకు తెలియని నంబర్ నుండి వాట్స్అప్ కాల్ వస్తే ఎవరూ చూద్దాము అంటూ కాల్ అటెండ్ అవ్వకండి. అలా అని అన్నీ హ్యాకర్స్ నుండి వస్తాయని కాదు కానీ ఎవరు ఎవరో తెలియదు కదా ? మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకునే వారు వాళ్ళ పేరు చెప్తూ ఫోన్ చేయడానికి కారణం ఏమిటో కూడా చెప్తూ వాట్స్అప్ లో కాకుండా ఫోన్ మెసేజ్ లో తెలియపరిస్తే అప్పుడు దానిని అటెండ్ అవ్వండి.

సైబర్ న్యూస్ కథనం ప్రకారం హ్యాకర్ డాటా ఎలా పొందాడో చెప్పలేదు. కానీ ఒక్కో దేశానికి సంబంధించి ఎన్ని నంబర్లు ఉన్నాయో ఒక లిస్ట్ పెట్టాడు.

1. అమెరికాకి సంబంధించి 32 మిలియన్ యూజర్స్ డాటా ఉంది. కావాలనుకునే వారు $7,000 (approx. ₹5,71,690) చెల్లించి డాటా కొనవచ్చు.

2. బ్రిటన్ కి సంబంధించి డాటా కావాలి అంటే $2,500 (approx. ₹2,04,175) చెల్లించి కొనవచ్చు.

3. జర్మనీకి సంబంధించి డాటా కావాలి అంటే $2,000 (approx. ₹1,63,340) చెల్లించి కొనవచ్చు.

4. డాటాకి సంబంధించి రష్యా, ఉక్రెయిన్ ల ఫోన్ నంబర్స్ కూడా దాదాపుగా 21 మిలియన్లు ఉన్నట్లుగా పేర్కొన్నాడు.

ఇదే సైబర్ స్పేస్ న్యూస్ అనే వెబ్ మాగజైన్ పోయిన సంవత్సరంలో ఫేస్బుక్ కి సంబంధించి ఖాతాదారుల ఫోన్ నంబర్స్, e మెయిల్స్ తో పాటు ఖాతాదారుల వివరాలతో కూడిన డాటా మొత్తం 500 మిలియన్ మందివి అమ్మకానికి పెట్టినట్లు తెలిపింది. మెటా [ఫేస్బుక్, వాట్స్అప్, ఇంస్టాగ్రామ్ ] కి సంబంధించి తరుచూ డాటా చోరీకి గురి అవుతున్నది. ఆఫ్కోర్స్ ఎంత కట్టుదిట్టంగా సెక్యూరిటీ పెట్టినా దొంగ పని దొంగతనం చేయడమే కాబట్టి నిరంతరం లూప్ హోల్స్ కోసం వెతుకుతూనే ఉంటారు కాబట్టి ఎక్కడో అక్కడ ఒక చిన్న లూప్ హోల్ దొరికినా మొత్తం పట్టేస్తూ ఉంటారు.

ఒక చిన్న విన్నపం, అది కూడా కొంచెం వ్యంగ్యంగా చేస్తున్నాను !

మీ పుట్టిన రోజుని మీ కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవడంలో తప్పులేదు అది మీ ఇష్టం ! కానీ ఈ రోజు మా అమ్మాయి పుట్టిన రోజు లేదా అబ్బాయి పుట్టిన రోజు ఆశీర్వదించండి అంటూ పోస్ట్ లు పెట్టడం ఎందుకు ? అలాగే మీ పుట్టిన రోజుని కూడా బహిరంగంగా ఫేస్బుక్ లో చెప్పడం దేనికి ? అంటే మీకు సంబంధించిన డాటా చోరీకి గురి అయిన తరువాత మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ సమాచారం హ్యాకర్ చేతిలోకి వెళితే పిన్ నంబర్ మార్పు కోసం ఆయా బ్యాంకులకి రిక్వెస్ట్ పెడతాడు. అప్పుడు వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. మీ ఫేస్బుక్ లో మీ పుట్టిన రోజు తేదీని హ్యాకర్ ఇస్తాడు ఒకవేళ నిజమే అయితే వెంటనే వాడి ఫోన్ నంబర్ కి OTP వస్తుంది. వాడు మీ పిన్ నంబర్ మార్చుకొని, మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ నుండి ఎంత దొరికితే అంత వాడుకుంటాడు అదీ విదేశాల నుండి. అవసరమా ? ఆలోచించండి.

ఫేస్బుక్ లో ఇచ్చిన పుట్టినరోజు తేదీ అలాగే మీ బాంక్ లో ఇచ్చిన పుట్టినతేదీ వివరాలు వేరే వేరేగా ఉంటే సమస్య లేదు. మీరు సేఫ్ ! కానీ ఫేస్బుక్, బాంక్ రికార్డులలో ఒకే పుట్టినరోజు తేదీ ఉంటె అది ప్రమాదకరం ! అదేంటీ రక్షణ లేదా అని అడగవచ్చు కానీ ఒక్కో మనిషికి ఒక్కో పోలీసుని ఏ దేశం కానీ సంస్థ కానీ ఇవ్వలేదని గుర్తు పెట్టుకోండి !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions