టైమ్ వాళ్లు ఏటా ఓ వందమంది ప్రపంచ ప్రముఖులను ఎంపిక చేసి పబ్లిష్ చేస్తుంటారు… ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నవారన్నమాట… అఫ్‌కోర్స్, ఆస్కార్‌లాగే దీనికీ లాబీయింగ్, ఖర్చులు ఎట్సెట్రా ఉంటాయేమో… మన దగ్గర స్కోచ్ అవార్డులు అని ఇస్తుంటారు కదా… అలాగే వీటినీ ‘రకరకాల మార్గాల్లో’ సొంతం చేసుకోవచ్చునేమో… లేకపోతే ఏమిటండీ…
నాటునాటు పాటతో ప్రపంచ భ్రమణాన్నే ప్రభావితం చేసిన రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్, వారిని మించి చంద్రబోస్, కీరవాణి పేర్లు ఈ జాబితాలో లేనేలేవు… ప్రపంచంలోకెల్లా ప్రముఖ లీడర్‌గా ఎప్పుడూ ఏవేవో సర్వేల్లో, ట్విట్టర్ సంఖ్యాధనంలో కూడా కనిపించే ది గ్రేట్ మోడీ బాభాయ్ కూడా లిస్టులో కనిపించలేదు… అరె, చంద్రబాబు, కేసీయార్, జగన్ లేని ఆ లిస్టు ఉండటం దేనికి..? దానికి ఉన్న క్రెడిబులిటీ ఎంత..?
సరే, చంద్రబాబు పని అయిపోయింది, జగన్ చేజేతులా తన పేరు చెడగొట్టుకున్నాడు అనుకుందాం… దేశ్‌కీనేతా కేసీయార్ పేరు ఉండాలి కదా… తెలంగాణ దాటలేని కేసీయార్ వచ్చే ఎన్నికల తరువాత ఏకంగా ప్రధాని కాబోతున్నాడు… ఏమో, ప్రపంచ రాజకీయాలనే ప్రభావితం చేస్తాడేమో… ఏదీ ఆ పేరు..? రోజురోజుకూ అందరినీ ప్రశ్నిస్తూ, అందరి తాటలూ హోల్‌సేల్‌గా తీస్తున్న పవన్ కల్యాణ్ జాడేది..? అబ్బే, టైమ్ వాడి విచక్షణ మీద, నిర్వహించిన పోల్ మీద భలే డౌట్లొస్తున్నయ్…
Ads
జెలెన్‌స్కీ ఉన్నాడు, జో బైడన్ ఉన్నాడు… వేరీజ్ మోడీ, వేరీజ్ పుతిన్… అసలు మా జిన్‌పింగ్ ఏడి..? కనీసం రుషి సునాక్ పేరయినా ఉండాలి కదా ఫాఫం… ఆర్టిస్టుల్లో ఒక్కడంటే ఒక్క ఇండియన్ లేడు, తెలుగువాడు లేడు… ఐకన్స్ జాబితాలో షారూక్ ఖాన్ పేరుంది… తను ఏం ప్రభావితం చేస్తాడో టైమ్ వాడికే తెలియాలి… అన్నీ విప్పేసుకుని వెకిలి స్టెప్పులేసే బోల్డ్ దీపిక పడుకోన్‌ను ఎంపిక చేసినా ఓ మర్యాద ఉండేది… మరీ షారూక్ ఈ జాబితాలోకి ఎలా వచ్చాడబ్బా..? ఆ దిక్కుమాలిన పఠాన్ సినిమా తీసినందుకా..? మొత్తం 12 లక్షల వోట్లలో 4 శాతం వోట్లు వచ్చాయట… నమ్మొచ్చా..?!
జాబితాలో సల్మాన్ రష్డీ, పద్మా లక్ష్మి పేర్లున్నయ్… వాళ్లు మనకు పెద్దగా పరిచయం లేదు… గనుక కాసేపు వదిలేద్దాం… పయనీర్స్ జాబితాలో విచిత్రం రాజమౌళి పేరు కనిపించింది… ప్చ్, ఆస్కార్ రాకపోతేనేం, టైమ్ వాడి పురస్కారం దక్కింది కదా, రాజమౌళి ఖుషీగా ఉండొచ్చు… అవునూ, తను ప్రపంచాన్ని ప్రభావితం చేసేందేమిటో… ఆ టైమ్ వాడు ఓ సీతయ్య టైపు… జాబితా మన మొహాన పడేస్తాడు… ఎంపిక ప్రామాణికాలు ఏమిటో, ఆ పోల్ వాస్తవ రిజల్ట్ ఏమిటో ప్రపంచంలోనే ఎవరికీ అర్థం కాని ఓ వింత, గుప్త ప్రక్రియ…
రెండుమూడొందల మంది పేర్లున్న ఈ జాబితాలో కాస్త వార్తాపరిచయం ఉన్న మరో పేరు ఎలన్ మస్క్… ప్రపంచంలో రకరకాల పురస్కారాల ఎంపికలు సాగుతుంటయ్… వాటిల్లో చాలావరకు కొనుక్కునేవే… టైమ్ జాబితా కూడా అంతేనా..? మరో ఆస్కార్, మరో స్కోచ్ అన్నమాటేనా..?
Share this Article