.
‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం నాడు గాంధీభవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఏకరువు పెట్టారు. అవన్నీ వింటున్నప్పుడు నిజంగా ఇన్ని నిర్ణయాలు తీసుకున్నారా అని ఆశ్చర్యం వేసింది. అయినా, అనుభవం లేనందున ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమవుతున్నారన్న ప్రచారమే పెరిగింది. ఈ ప్రచారమే అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి కీడు చేస్తుంది…’’
…. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి కొత్త పలుకులోని ఓ పేరా… ఫాఫం ఇన్నాళ్లూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చంద్రబాబును మోయడమే తెలుసు… ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డిని కూడా మోయాల్సి వస్తున్నట్టుంది పాపం… చంద్రబాబు మనిషి కాబట్టి మోద్దాం అనుకోవడమా..? ఇంకేదైనా కారణం ఉందా తెలియదు… కానీ..?
Ads
రేవంత్ రెడ్డి తీసుకున్న అంతటి ప్రజోపయోగ, అద్భుతమైన నిర్ణయాలు, పథకాలు రాధాకృష్ణను అంతగా అబ్బురపరిచినవి ఏమున్నాయో తెలంగాణ జనానికి మాత్రం తెలియడం లేదు… జస్ట్, ఒకే ఒక్క ఉదాహరణ… ఎల్ఆర్ఎస్ మీద గతంలో రేవంత్ ఏమన్నాడు..? ఇప్పుడేమంటున్నాడు..?
ఓఆర్ఆర్ నిర్వహణను అడ్డగోలు తక్కువ రేట్లకు బీఆర్ఎస్ అమ్ముకుంది… రేవంతే చెప్పాడు… ఈరోజుకూ దానిపై దృష్టి లేదు… మేడిగడ్డ, పవర్ ప్లాంట్లు, పవర్ కొనుగోళ్లు, ఫార్ములా రేస్, ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి అనేకానేక బీఆర్ఎస్ అక్రమాలపై ఈరోజుకూ ఎవరినీ ఫిక్స్ చేసింది లేదు…
పోనీ, ఎస్ఎల్‌బీసీ కూలితే ఆ సొరంగం దగ్గరకు కనీసం వెళ్లి వచ్చాడా ఇన్నిరోజులూ… లేదు… అదొక ప్రమాదం, ఎవరూ చేయగలిగేది ఏమీ లేదు… కానీ కొండగట్టు 62 మంది బస్సు ప్రమాద మృతులకు సంబంధించి కేసీయార్ కనబరిచిన అమానవీయ ధోరణికీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ధోరణికీ తేడా ఏముంది..? ఇప్పుడు వెళ్లి వచ్చినట్టున్నాడు… అంతా అయిపోయాక…
వేరీజ్ రేవంత్ పాజిటివ్ మార్క్..? ఫాఫం, రాధాకృష్ణ అబ్బురపడే రీతిలో ఏం చేశాడో అస్సలు అర్థం కాలేదు తెలంగాణ సమాజానికి… ఒక్కసారి పల్లెల్లోకి వెళ్తే ఈ పాలన మీద ఫీడ్ బ్యాక్ తెలుస్తుంది… మంత్రుల మధ్య సమన్వయం లేదు… కొన్ని మంత్రిత్వ శాఖల్లో అసలు సీఎం జోక్యమే చేసుకోవద్దట… రాధాకృష్ణ రాసిందే ఇది… మరిక ముఖ్యమంత్రి దేనికట..?
నేను కిషన్ రెడ్డిని తిడతా… కేటీయార్‌ను తిడతా… మోడీని తిడతా… ఇలా కాదు కదా రేవంత్ వ్యవహారశైలి ఉండాల్సింది… ఒక అవకాశం వచ్చింది, ఓ డైనమిక్ సీఎంగా ప్రూవ్ చేసుకోవాలి కదా ఇప్పుడు..! అంతెందుకు..? ఫార్ములా కేసులో కేటీయార్ అరెస్టుకు ఎందుకు భయపడుతున్నట్టు..? జనం అన్నీ గమనిస్తారు కదా పాలకా..? కేవలం రాధాకృష్ణ సర్టిఫికెట్ సరిపోతుందా..?
బీఆర్ఎస్ ముప్పేట దాడిని కౌంటర్ చేయలేకపోవడం వేరు, అది రాజకీయ అసమర్థత… పీఆర్ విభాగాల ఫెయిల్యూర్… కానీ పాలనలో ముద్ర ఏది..? ఒక్కటి, ఒక్క నిర్ణయం మీద… హబ్బ, రేవంత్ భలే చేశాడబ్బా అని జనం అనుకోవాలి…
సారీ, రేవంత్ సార్… ఏడాదిలోనే… నన్ను పనిచేయనివ్వడం లేదు, నాకు స్వేచ్ఛ లేదు అనుకునే పరిస్థితి ఎందుకొచ్చింది…? చెడు చెవిలో చెప్పండి, మంచి మైకులో చెప్పండి అని పార్టీ సమావేశంలో మొరపెట్టుకునే పరిస్థితి దేనికి..? తన వ్యాసంలో రాధాకృష్ణ ఓచోట రాశాడు… కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్స అవసరమని… ఇంత త్వరగానా..?!
Share this Article