Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆర్మీ చీఫ్ దేశంలోనే ఉన్నాడా..? పాకిస్థాన్ సైన్యానికి ఏం ఖర్మ పట్టింది..!!

April 28, 2025 by M S R

.

Pardha Saradhi Potluri ……. పాకిస్థాన్ చీఫ్ అఫ్ ఆర్మీ విదేశాలకి పారిపోయాడు! పాకిస్థాన్ చీఫ్ అఫ్ ఆర్మీ ఆశీమ్ మునీర్ భారత్ దాడి చేస్తుందనే భయంతో దేశం వదలి పారిపోయాడనే పాకిస్తాన్ సోషల్ మీడియా వార్త వైరల్ అయ్యింది నిన్న!

అటు తిరిగి ఇటు తిరిగి ఆ వార్త చాలా దేశాలకి పాకింది! నిజానికి ఆశీమ్ మునీర్ తన కుటుంబ సభ్యులని అమెరికా పంపాడు యుద్ధం భయంతోనే! కానీ పాకిస్థాన్ సోషల్ మీడియా మునీర్ ని ట్రోల్ చేసింది… సామాన్య ప్రజలు కష్టాలు పడాలి కానీ రాజకీయ నాయకుల, ఆర్మీ అధికారుల కుటుంబ సభ్యులు మాత్రం దుబాయ్, అమెరికా, లండన్ లలో సురక్షితంగా ఉండాలా అనే ఉద్దేశ్యంతో ట్రోల్ చేశారు.

Ads

కానీ చాలా మంది అది ట్రోలింగ్ అని తెలుసుకోకుండా నిజమైన వార్తగానే వైరల్ చేశారు. ఆశిమ్ మునీర్ తన కుటుంబ సభ్యులని విమానంలో అమెరికా పంపిన వార్త నిజమే కాబట్టి మునీర్ కూడా ఒక రోజు ఆలస్యంగా వెళ్ళిపోయి ఉంటాడు అనే భావించారు!

ఏం ఖర్మ పట్టింది!
చివరికి పాకిస్థాన్ ప్రభుత్వం తమ ఆర్మీ చీఫ్ దేశంలోనే ఉన్నాడు అంటూ అబొట్టాబాద్ లోని పాకిస్థాన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న వారితో కలిసి దిగిన గ్రూపు ఫోటోని విడుదల చేసింది ప్రభుత్వం!
పాకిస్తాన్ ప్రధాని అధికారిక X హాండిల్ లో ఫోటోని పెట్టాల్సివచ్చింది స్వంత ప్రజల ట్రోలింగ్ తో పాటు విదేశాలలో ఉన్న జర్నలిస్టులకి నమ్మకం కలగడానికి.
ఏప్రిల్ 26, 2025 తేదీ ఉంది ఫొటోలో!

అయితే భారత్ లోని ఇంటెలిజెన్స్ అధికారులకి తెలుసు భారత్ వైపు నుండి దాడి మొదలవగానే ఎంత మంది పాకిస్థాన్ సైనిక జెనరల్స్ పాకిస్థాన్ వదిలి విదేశాలకి పారిపోతారో! ఆల్రెడీ కొందరు సైనికులు రాజీనామాలు చేశారనే వార్త కూడా సర్క్యులేట్ అవుతోంది.

అఫ్కోర్స్! పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ సయ్యద్ ఆశిమ్ మునీర్ దేశం వదిలి పారిపోవడం మాత్రం తధ్యం!
ఎందుకు?

సరిగ్గా పహాల్గామ్ దాడి జరగడానికి రెండు రోజుల ముందు ఆశిమ్ మునీర్ కాశ్మీర్ మాకు జీవనాడి లాంటిది కాబట్టి మేము కాశ్మీర్ ని వదులుకునే ప్రసక్తి లేదని మాట్లాడాడు. రెండో రోజే దాడి జరిగింది.
పాకిస్తాన్ ISI మాకు డబ్బులు, గన్స్, ప్లాన్ ఇచ్చింది అని పహాల్గామ్ లో పట్టుబడ్డ ఒక వ్యక్తి కెమెరా ముందు చెప్పాడు.

భారత ఇంటెలిజెన్స్ కి కూడా సమాచారం ఉంది మునీర్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని.
So! యుద్ధం అంటూ మొదలైతే ఆసిమ్ మునీర్ ని ప్రాణాలతో పట్టుకుంటుంది ఇండియన్ ఆర్మీ!
అసలు పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్న అధికారులతో భారత్ లో ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారో భారత సైన్యానికి తేలిసిపోతుంది ఒక వేళ ప్రాణాలతో పట్టుబడితే.

పాకిస్థాన్ సైన్యంలో కింది స్థాయి అధికారులకి పెద్దగా సమాచారం ఉండదు తమ సైన్యం శక్తి, సామర్ధ్యాలు ఎలాంటివో… కానీ పైస్థాయి అధికారులకి తెలుసు, తమ సైన్యం ఒక రోజు లేదా రెండు రోజులకంటే ఎక్కువ భారత సైన్యంతో పోరాడలేదు అని. అందుకే పారిపోతారు!

ఈ వార్త మాత్రం నిజం….
పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ సయ్యద్ ఆశిమ్ మునీర్ రావల్ పిండి లోని ఒక అండర్ గ్రౌండ్ బంకర్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు!
అత్యవసరం అయితేనే బంకర్ నుండి బయటికి వచ్చి పని అయిపోగానే తిరిగి అండర్ గ్రౌండ్ బంకర్ లోకి వెళ్ళిపోతున్నాడు!
మరి అత్యంత రహస్యంగా ఉంచాల్సిన విషయం బయటికి ఎలా వచ్చింది?

చాలా సింపుల్! ఒక 500 డాలర్లు ఇస్తే రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో పనిచేసే వాళ్లు మొత్తం చెప్పేస్తారు! ప్రస్తుతం పాకిస్థాన్ లో అక్కడి కరెన్సీకి ఉన్న విలువ కంటే డాలర్ కి ఎక్కువగా ఉంది! ఇరాన్ లో కూడా డాలర్ కి ఉన్న డిమాండ్ అక్కడి కరెన్సీకి లేదు కాబట్టే ప్రతీ విషయం మోస్సాద్ కి తెలుస్తున్నది!

ఈ విషయం ఆర్మీలో పనిచేస్తున్న జెనరల్స్ కి కూడా తెలుసు! అంతెందుకు, యుద్ధం మొదలైన తరువాత కీలక సమాచారం ఇస్తే నిన్నూ నీ ఫామిలిని దేశం దాటించి, విదేశాలలో హాయిగా బ్రతకడానికి కావాల్సినంత డాలర్లు ఇస్తామంటే దానికి ఒప్పుకొని సమాచారం ఇచ్చే సైనిక అధికారులు చాలామందే ఉన్నారు పాకిస్తాన్ సైన్యంలో!

సైన్యంలోనే ఉన్నారా? ISI లో లేరా?
ISI మోస్ట్ కరప్టెడ్ ఆఫీసర్లతో నిండి ఉంది కాబట్టే, డాలర్లు తీసుకొని సమాచారం ఇవ్వడం వల్లే, ISI రక్షణలో ఉన్న వాళ్ళని గుర్తు తెలియని వ్యక్తులు సులభంగా చంపగలుగుతున్నారు!
అసలు ఏ దేశమైనా తమ దేశ సైన్యాధ్యక్షుడు మా దేశంలోనే ఉన్నాడు, పారిపోలేదు అని అధికారికంగా ప్రకటించిందా ఇంతవరకు?
పాకిస్థాన్ ఆ పని చేసింది!

అందుకే నేను పదే పదే చెప్తూ వస్తున్నాను……
మోడీ, అమిత్ షా, జైశంకర్ , అజిత్ దోవల్  లది అత్యుత్తమ కలయిక భారతదేశ చరిత్రలో!
ఇలాంటి కలయిక భవిష్యత్ లో మనం చూడబోము!
మరో విషయం ఏమిటంటే శుక్రవారం జైపూర్ ఎయిర్ బేస్ లో అమెరికన్ కార్గో విమానం, రెండు ఇజ్రాయేల్ ట్రాన్స్పోర్ట్ విమానాలు ల్యాండ్ అయినప్పటినుండి ఆశిమ్ మునీర్ అండర్ గ్రౌండ్ బంకర్ లో ఉంటున్నాడు!
మోస్సాద్, RAW జాయింట్ ఆపరేషన్ ఎలా ఉంటుందో మనకంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కే ఎక్కువగా తెలుస్తుంది!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions