అదుగదుగో అన్‌స్టాపబుల్ తదుపరి ఎపిసోడ్‌లో అనుష్క… ఇక ఆహా ఓటీటీ దద్దరిల్లిపోవాల్సిందే అని వీరభక్తితో రాస్తూపోయాడు ఓ యూట్యూబర్… కానీ ఏది..? ఎక్కడ.? ప్రోమో ఏది..? అసలు ఆమె చాన్నాళ్లుగా ఏ ఇంటర్వ్యూలకూ రావడం లేదు… నో, నో, రోజాతో మూడో ఎపిసోడ్ రాబోతోంది… ఇక చూస్కో నా రాజా అని మరో వీరభక్తుడు థంబ్ నెయిల్ వెలిగించి మరీ వీడియో పెట్టేశాడు…
అసలే జగన్ దగ్గర ఫుల్ మైనస్ మార్కుల్లో ఉంది ఆమె… సొంత నియోజకవర్గంలో ప్రత్యర్థులు పెంట పెట్టేస్తున్నారు… ఆమెను పక్కకు నెట్టేస్తున్నారు… పైగా ఈటీవీ జబర్దస్త్ టీంతో రాసుకుని పూసుకుని ఆ కార్యక్రమాల్లో తిరుగుతూ, మెచ్చుకుంటూ, మంత్రి దాకా తన ఎదుగుదలకు ఈటీవే కారణం అని చెబుతుంటే… స్థితప్రజ్ఞుడైన జగన్‌కు ఏమో గానీ వైసీపీ నేతలకు మాత్రం ఒళ్లంతా కారం పూసుకున్నట్టు మండుతోంది… ఈ స్థితిలో ఇక ఏకంగా బాలయ్య షోకు అటెండ్ అయితే అది సూసైడలే అవుతుంది…
బాలయ్యతో ఆమె గతంలో కలిసి నటించి ఉండవచ్చుగాక… కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఒకే సీమ ఏరియాలో ప్రత్యర్థి ఎమ్మెల్యేలు… ఆమె మంత్రి… ప్రస్తుతం పొలిటికల్ అంశాల్ని పక్కకు నెట్టేసి, పాత సినిమా ముచ్చట్లు మాత్రమే మాట్లాడితే అది డొల్ల అన్‌స్టాపబుల్ అవుతుంది… ఇంకెవడో రాశాడు… రజినీకాంత్ రాబోతున్నాడు అని… ఖర్చేమీ లేదు కదా… రాసిపారేశాడు… నోటికి వచ్చిందే రాత, కూసిందే కూత… పవన్ కల్యాణ్‌తో అన్‌స్టాపబుల్ అనే వీడియోలు కూడా ఒకటీరెండు కనిపించినట్టు గుర్తు…
Ads
నిజానికి అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ స్టార్టయ్యాక ఒకటో ఎపిసోడ్ చంద్రబాబు, లోకేష్… వెయ్యి శాతం హిపోక్రసీతో బాబు వీలైనంతగా ఆ షో కేరక్టర్‌ను దెబ్బతీశాడు… తరువాత ఎలాగోలా టిల్లూ జొన్నలగడ్డ సిద్ధూ, విష్వక్సేన్‌లను పట్టుకొచ్చి రెండో ఎపిసోడ్ షూట్ చేయించారు… ఏదో అలా నడిచిపోయింది… ఎక్కడి చంద్రబాబు..? వెంటనే ఎక్కడి సిద్ధూ, విష్వక్సేన్‌లు… కాస్త రేంజ్ చూసుకోవాలి కదా… తరువాత అన్‌స్టాపబుల్ స్టాప్… మూడో ఎపిసోడ్‌కు సంబంధించిన ఏ ముచ్చటా లేదు…
నిజానికి రమ్యకృష్ణ, రాశీఖన్నాలతో కలిసి ఎపిసోడ్ చేస్తారని వినిపించింది… మళ్లీ ఏమైందో ఏమో గానీ, ఇప్పుడు అదీ వినిపించడం లేదు… షూట్ కూడా జరిగినట్టు లేదు… డాన్స్ ఐకన్ షో జడ్జిగా ఆహా స్టూడియో పరిసరాల్లోనే తచ్చాడుతోంది రమ్యకృష్ణ, ఐనాసరే, ఆమెకు ఎందుకు ఇంట్రస్టు లేదనే ప్రశ్నకు జవాబు లేదు… ప్రస్తుతానికి అసలు మూడో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు ఏమీ కనిపించడం లేదు… గెస్టులు కావలెను అని ఎంత ప్రయత్నించినా ఓ రేంజ్ ఉన్నవాళ్లు పెద్దగా ఇంట్రస్టు చూపించడం లేదట…
అడవి శేషు, శర్వానంద్‌లను ఒప్పించారన్నారు… ఇప్పుడదీ వినిపించడం లేదు… సో, అదేమీ అన్‌స్టాపబుల్ కాదు… ప్రస్తుతానికి ఎందుకో స్టాప్… సిద్ధూ, విష్వక్ ఎపిసోడ్ ప్రోమోలు 11 రోజుల క్రితం స్టార్ట్ చేశారు… 21న స్ట్రీమింగ్… అంటే దాదాపు వారం గడిచిపోయింది… మరి మూడో ఎపిసోడ్ ఏది బాలయ్య బాబూ… ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ…!!
Share this Article