కేసీయార్ అహానికి ఎందుకింత పెద్ద దెబ్బ తగిలింది..? ఈటల గొప్పతనమో, బీజేపీ కార్యశూరత్వమో, కాంగ్రెస్ నిస్సహాయ స్థితో, వికటించిన వ్యూహాలో కాదు… అంతకుమించిన స్వయంకృతాలు… తను, చంద్రబాబు ఒకే స్కూల్ నుంచి వచ్చారు గానీ, కేసీయార్ ఒక్క విషయానికి స్టికాన్ కావడంలో ఫెయిలయ్యాడు… ఒక నియోజకవర్గంలో ఒకడే రాజుగా ఉండకూడదు… ఉంచకూడదు… అది టీఆర్ఎస్ కాదు, ఎంత బలమైన పార్టీ అయినా సరే నష్టదాయకం… ఒక దశలో లీడర్ ఏమీ చేయలేని దుస్థితిలో పడిపోతాడు… ఇప్పుడూ అదే జరిగింది… కాంగ్రెస్ గానీ, ఇతర పార్టీల హైకమాండ్స్ గానీ ఒక నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణిని ఎప్పుడూ టచ్‌లో ఉంచుకుంటాయి… ఏదోరకంగా ఎంకరేజ్ చేస్తాయి… అక్కడి ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ, ఇతర ముఖ్యులు గానీ తోకజాడిస్తే వెంటనే ఈ ద్వితీయశ్రేణిని పైకి లేపుతారు… కానీ టీఆర్ఎస్‌లో పూర్తిగా భిన్నం…
ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తున్నా సరే… కేసీయార్‌కు తన ఎమ్మెల్యేలంటే మహా ప్రీతి, నమ్మకం, ప్రేమ… వాళ్లు చెప్పినవాళ్లకే పోస్టింగులు, బదిలీలు, చివరకు పోలీసులు కూడా వాళ్లు చెప్పినవాళ్లే పనిచేయాలి… కంట్రాక్టులు, పథకాలు… వాట్ నాట్..? ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి… దాంతో ఏం జరిగింది..? వాళ్లు కూడా పొలిటిషియన్సే కదా… నిజాయితీ, సమగ్రత, ఉద్యమస్పూర్తి వంటివి వదిలేయండి… అవి రాజకీయాల్లో పనికిరావు… కానీ బలంగా పాతుకుపోయారు… ద్వితీయ శ్రేణి లీడర్లు లేకుండా పోయారు… ఇదే ఉదాహరణ తీసుకుందాం… హుజూరాబాద్‌లో ఈటల… తను టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు తను చెప్పిందే శాసనం అక్కడ… సెకండ్ లేయర్‌లో ఎవరున్నారు..? ఎవరూ లేరు…
Ads
ఈటలను వదిలేసినప్పుడు వెంటనే ఒక ద్వితీయ శ్రేణి లీడర్‌ను తెరపైకి తీసుకొద్దామని అనుకున్నా సరే, కేసీయార్‌కు ఎవరూ కనిపించని దుస్థితి… ఈటలకు దీటుగా కాకపోయినా సరే, కనీసం పోటీ ఇచ్చేవాళ్లయినా ఉండాలి కదా… ఎవరెవరినో పోటీ కోసం ఆలోచించారు… చివరకు బీసీ వర్సెస్ బీసీ అనే సమీకరణం ఆలోచించి గెల్లు శ్రీనివాస్‌ను నిలిపారు… వ్యక్తిగతంగా గెల్లు వోకే… కానీ తను ఈటలతో పోటీకి ఆనుతాడా..? ఎంతగా పార్టీ తపస్సు చేసినా సరే, అభ్యర్థి ఎవరనేది కూడా ముఖ్యమేకదా… ఈటల ఫుల్లుగా అక్కడ స్టాండైపోయాడు కదా… నిజానికి గత ఎన్నికల్లో కూడా కేసీయార్ ఇదే ఆలోచించినట్టున్నాడు… సిట్టింగుల మీద జనంలో వ్యతిరేకత ఎంతున్నా సరే, వదిలేస్తే, కొత్తవాళ్లు ఎవరున్నారు..? అందుకే సిట్టింగులందరికీ సీట్లు అన్నాడు… ఏదో కష్టపడి గెలిపించుకున్నాడు… వాళ్లంతా ఇప్పుడు మరింత పాతుకుపోయారు… మేం తప్పితే పార్టీకి వేరే దిక్కులేదు అనే సిట్యుయేషన్… హుజూరాబాద్‌లో పలు పార్టీల నుంచి ఎవరెవరినో పిలిచి కండువాలు కప్పారు… పెద్ద నాయకులు, ఉద్దరిస్తారనే హైప్… కానీ ఒక్కరూ సోదిలో లేకుండా పోయారు… ఒక్కసారి తాపీగా… కేసీయార్ గనుక ఏయే నియోజకవర్గాల్లో పార్టీకి ద్వితీయ శ్రేణిలో కాస్త చెప్పుకోదగిన లీడర్లున్నారు..? అనే ప్రశ్న వేసుకుంటే… సమీక్షించుకుంటే తనకే తెలుస్తుంది… అబ్బే, ఎవరో ఒకరు, నేను గెలిపించుకుంటాను అనుకుంటే… ఏమో… చాలా హుజూరాబాద్‌లు…!!
Share this Article