.
బాబు గారూ .. రెడీ , కెమెరాలన్నీ క్లోజప్పులో ఉంటాయి .. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగా పండాలి. ఒక కంట్లో ఆవేశం, ఒక కంట్లో ఆవేదన కనపడాలి.. దుఃఖం పొంగుకొస్తున్నట్టు ఉండాలి.. అదిమి పెడుతున్నట్టు తెలియాలి.. కన్నీరు అక్కర్లేదు.. లైవ్ లో కష్టం.. అది మన మ్యాచో ఇమేజ్ కి కూడా సూట్ అవదు..
డైలాగులన్నీ as per script వెళ్లిపోదాం.. ఆ విషయం ముందే చెప్పేయండి. నెపం కోర్ట్ మీద నెట్టేయండి.. పక్కనే లాయర్ని పెడతాం. అతన్ని చూపించండి.. లేకపోతే ఈ ప్రెస్సోళ్లు ఏదో ఒకటి అడిగితే మీరు దొరికిపోతారు..
ఎంత మన సినిమా “కవరేజ్” రిపోర్టర్లైనా ఇలాంటి సందర్భాల్లో రెచ్చిపోతారు.. ఆ యూట్యూబ్ గొట్టాలతో మరీ కష్టం . స్క్రిప్ట్ లో చిరంజీవి , పవన్ కళ్యాణ్ పేర్లు మర్చిపోకండి.. ఇపుడు జరుగుతున్న రచ్చకి అది కూడా కారణమే. రేవంత్ రెడ్డి పేరు ఎంతగా గుర్తొస్తున్నా సరే, పొరపాటున కూడా అనేయకండి..
Ads
మన స్క్రిప్ట్ లోనే కొన్ని లోపాలున్నాయి.. ఆ దుర్ఘటన గురించి మరుసటి రోజే తెలిసిందంటున్నాం.. కానీ ఆ మరుసటి రోజూ మనం దాని గురించి మాట్లాడకుండా సక్సెస్మీట్ పెట్టుకున్నాం.. పరవాలేదు , where logic ends.. drama begins , కాబట్టి మీరు డ్రామా సంగతి చూసుకోండి .. లాజిక్ రాకుండా మన pr team మేనేజ్ చేస్తుంది ..
ఇందులో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక చిన్న పిల్లాడున్నాడు కాబట్టి మనం కూడా మన పిల్లల్ని స్క్రిప్ట్ లో పెట్టాం.. చైల్డ్ సెంటిమెంట్ డీల్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ .. మాక్సిమం ఎక్స్ప్రెషన్ అక్కడే రావాలి . గుర్తు చేయడానికి పక్కనే నాన్నగారు ఉంటారనుకోండి ..
ముందు తెలుగు తరువాత ఇంగ్లీష్ .. అనుకుంటున్నాం.. పర్లేదు జల్సాలో డైలాగ్ గుర్తుంది కదా .. ఆవేశానికి ఆవేదనకి భాషతో పని లేదు . తెలుగు ఇంగ్లీష్ కలిపికొట్టేయండి.. ఎమోషన్ ముఖ్యం..
అన్నట్టు మన డబ్బు మీదే అందరి ఏడుపు కాబట్టి ఆ కుటుంబానికి కూడా బాగా డబ్బిస్తాం అన్న హింట్ ఇద్దాం.. ఎంత అనేది ఇపుడే కమిట్ అవ్వొద్దు.. పదిహేను వందల కోట్లు కలెక్షన్స్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి దాని ముందు మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది .. ఈ గొడవ అంతా చల్లబడ్డాక చూసుకుందాం..
మాక్సిమం ఈ ప్రెస్మీట్ తో పబ్లిక్ మన వైపు వచ్చేయాలి.. అది దృష్టిలో పెట్టుకోండి.. మీరెంతగా సీన్ పండిస్తే రేపటి నుంచి సోషల్ మీడియాలో మనోళ్లు అంత పిండుతారు.. మొత్తానికి చనిపోయిన ఆమె కంటే, బతకడానికి పోరాడుతున్న ఆ అబ్బాయి కంటే.. మీ సినిమా సరిగా చూడలేకపోయిన మీరే పెద్ద విక్టిమ్ అనిపించాలి.. అల్ ది బెస్ట్ బాబు .. రెడీ, టేక్ .. (మిత్రుడు శివప్రసాద్ వాల్ నుంచి సంగ్రహణ)
Share this Article