ఉక్రెయిన్లోని ఖారఖీవ్ నుండి తన సైన్యాన్ని వెనక్కి తీసుకున్న రష్యా ! దాదాపుగా 6 నెలలకి పైగా కొనసాగుతున్న రష్యన్ స్పెషల్ ఆపరేషన్ ఇన్ ఉక్రెయిన్ తుది దశకి చేరుకుంటున్నది! చేయాల్సిన యుద్ధం ఆయుధాలతో కాదని ఆర్ధికంతో అని పుతిన్‌కి తెలిసి వచ్చినట్లుంది !
***************
8 ఏళ్ల క్రితం క్రిమియాని ఎలాంటి ప్రతిఘటన లేకుండా స్వాధీనం చేసుకున్న పుతిన్ గత ఫిబ్రవరిలో కూడా అదే రీతిలో డోన్బాస్ [Donetsk and Luhansk] ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో మిలటరీ ఆపరేషన్ ప్రారంభించాడు. మొదట్లో మూడు వైపుల నుండి దాడి మొదలుపెట్టి పైచేయి సాధించినా, రాను రాను ఉక్రెయిన్ ప్రతిఘటన ఎక్కువ అవడంతో మెల్లగా ఒక్కో ప్రాంతాన్ని ఖాళీ చేయడం మొదలు పెట్టాడు పుతిన్.
Ads
^*************
పుతిన్ యుద్ధ వ్యూహం !
2022 ఫిబ్రవరి 23 న పుతిన్ స్పెషల్ ఆపరేషన్ మొదలు పెట్టే నాటికి కనీసం వారం రోజుల్లో ఉక్రెయిన్ లోని కీలక ప్రాంతాలతో పాటు రాజధాని కీవ్‌ని కూడా తన అధీనంలోకి తీసుకోవచ్చు అనే ప్రణాళికతో మొదలుపెట్టాడు. ఆపరేషన్ మొదలయిన వారం రోజులలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగర అవుటర్ రింగ్ రోడ్ వరకు రష్యన్ దళాలు చేరుకున్నా, అక్కడ తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చిన సంగతి తెలిసిందే !
************
గత మార్చి నెల నుండి ఇప్పటి వరకు కీవ్‌కి దగ్గరలోని ఇజియం [Izium] అనే ప్రాంతంలో రష్యన్ దళాలు తమ ఆయుధాలకి సంబంధించి కీలకమయిన స్టాక్స్ ఉంచుకోవడానికి పెద్ద డిపో నిర్మించుకున్నారు. అయితే నిన్న ఉక్రెయిన్ దళాలు మెరుపు దాడి చేసి రష్యన్ దళాల ఫైరింగ్ పోస్ట్‌లని స్వాధీనం చేసుకోవడంతో, ఏ క్షణంలో అయినా ఆయుధ డిపోకి నిప్పు పెట్టే అవకాశాలు ఉండడంతో, మాస్కో నుండి వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెనక్కి రావాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. దాంతో ఆయుధ డిపోని ఎలా ఉన్నదో అలానే వదిలేసి రష్యన్ దళాలు వెళ్లిపోయాయి. ఇది ఇప్పటి వరకు ఉక్రెయిన్ సైన్యానికి లభించిన అతి పెద్ద విజయం అని నిపుణులు భావిస్తున్నారు.
ఇజియంలో ఉన్న ఆయుధ డిపోకి రక్షణగా ఉన్న సైనికులతో పాటు ఆ ప్రాంతంలో పోరాడుతున్న రష్యన్ ఫ్రంట్ లైన్ ఫోర్స్ మీద ఉక్రెయిన్ సైన్యం మెరుపు దాడి చేసి, వందలాది రష్యన్ సైనికులని చంపడంతో ఫ్రంట్ లైన్ ఫోర్స్ నిర్వీర్యం అయిపోయింది. ఎప్పుడయితే ముందు ఉండి పోరాడాల్సిన సైనికులు పెద్ద సంఖ్యలో మరణించారో [సంఖ్య ఎంత అన్నది ఇంకా తెలియరాలేదు ] రష్యన్ ఫీల్డ్ కమాండర్‌లకి విషయం అర్ధం అయిపోయింది. దాంతో మాస్కోకి సమాచారం ఇస్తూ, అదనపు దళాలు కావాలని అడిగారు… కానీ మాస్కో ఇజియంలో ఉన్న ఫీల్డ్ కమాండర్‌ల అభ్యర్ధనని తిరస్కరించడమే కాకుండా…. ఎక్కడ ఉన్నవి అక్కడే వదిలేసి వెనక్కి రమ్మని ఆదేశాలు ఇచ్చింది.
**********
గత మూడు నెలలుగా ఉక్రెయిన్ దళాలు అమెరికా నుండి వచ్చిన హిమార్స్ మల్టిపుల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్స్ [HIMARS-multiple rocket-launching systems] తో రష్యన్ ఆయిల్ డిపోల మీద వరుసగా దాడులు చేస్తూ తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తూ వచ్చాయి… కొద్దో గొప్పో రష్యా హిమార్స్‌ని ధ్వంసం చేయగలిగినా అమెరికా వీటిని పెద్ద సంఖ్యలో సరఫరా చేస్తూ రావడం వలన ఉక్రెయిన్ బలంగా పోరాడగలుగుతున్నది. రష్యా బలహీన పడుతున్నది అని చెప్పడానికి కారణాలు అనేకం ఉన్నా ఒకే ఒక్క ఉదాహరణ : రష్యన్ సరిహద్దుల దగ్గరికి వెళ్ళి [15 km] ఉక్రెయిన్ దళాలు హిమార్స్‌తో దాడి చేసి వెనక్కి వచ్చేస్తున్నాయి తరుచూ !
హిమార్స్ ప్రయోగించే రాకెట్ రష్యన్ సరిహద్దులు దాటి, 30 కిలోమీటర్లు లోపలి వెళ్ళి మరీ అక్కడ ఉన్న కీలమయిన రష్యన్ ఆయుధ డిపోలు,ఆయిల్ డిపోలని ధ్వంసం చేస్తున్నాయి. అయితే ఈ వ్యూహం బాగా ఫలితాలని ఇవ్వడంతో, అమెరికా తన దగ్గర ఉన్న లాంగ్ రేంజ్ హిమార్స్ రాకెట్స్ [60 km] ని ఉక్రెయిన్‌కి ఇవ్వడం మొదలుపెట్టింది. మొదట ఇచ్చిన హిమార్స్ రాకెట్స్ 37 km దూరం వెళ్లగలవు కాబట్టి రష్యన్ సరిహద్దుల దగ్గర 15 km [ఉక్రెయిన్ వైపు ] ఉండి, రాకెట్స్ ప్రయోగిస్తూ వచ్చాయి, అంటే రష్యాలోకి 30 km వెళ్ళగలవు మొదట ఇచ్చిన రాకెట్లు…
*************
అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ [60 km ] హిమార్స్ రాకెట్స్ వల్ల గత రెండు వారాలుగా రష్యాలోని 45 km దూరంలో ఉన్న లక్ష్యాలని ధ్వంసం చేయగలుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ ప్రయోగిస్తున్న హిమార్స్ రాకెట్స్ నుండి తప్పించుకోవడానికి తన సరిహద్దుల నుండి 30 km దూరంలో కొత్తగా ఆయుధ, మందులు, ఆయిల్, స్పేర్ పార్టులు, ఆహార పదార్ధాలని నిల్వ ఉంచే డిపోలని నిర్మించింది.
అయితే దీనికి కారణం ఉంది. రష్యా నుండి ఉక్రెయిన్‌లోకి త్వరగా ఇవి సరఫరా చేయాలి అంటే దగ్గరలో ఉంచక తప్పనిసరి పరిస్థితి ఉంది… కానీ కొత్తగా నిర్మించిన డిపోలని లక్ష్యంగా చేసుకొని హిమార్స్ రాకెట్స్‌ని ఉక్రెయిన్ ప్రయోగించడంతో అవి కూడా ధ్వంసం అయ్యాయి. సో, కీవ్, ఖారకీవ్‌ల నుండి తన దళాలని వెనక్కి రప్పిస్తున్నది రష్యా ! HIMARS-multiple rocket-launching systems వల్ల రష్యా బాగా నష్టపోయింది గత రెండు నెలలో… తాజాగా ఇజియం మీద కూడా హిమార్స్ ప్రయోగించి రష్యన్ ట్రూపులని పెద్ద సంఖ్యలో నష్టపరిచింది ఉక్రెయిన్… (మిగతాది సెకండ్ పార్ట్‌లో… ఇదీ లింకు… ((రష్యా ఎక్కడ తప్పు చేసింది..? ఉక్రెయిన్ యుద్ధం ఓ గుణపాఠం… (పార్ట్-2)
**************
Share this Article