- ఓపియం… నల్లమందు… ఆ పువ్వు అప్ఘన్ జాతీయ పుష్పం…
- ఓపియం… జాతీయ పంట… వీలైతే అధికారిక సేద్యంగా ప్రకటన…
- ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అప్థనిస్థాన్… ప్రభుత్వ వ్యవసాయ విధానం ప్రకటన… ఓపియం నూతన వంగడాలకు ప్రోత్సాహం… అధిక దిగుబడుల మీద దృష్టి… సస్యరక్షణకు కొత్త పథకాలు… కొత్త బీమా పథకాలు… ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖ… అధిక గిట్టుబాటు ధరలకు ప్రత్యేక పథకాలు…
- ఓపియం వైపు మళ్లే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు… రైతుబంధు, రైతుబీమా, తదితర పథకాలకు శ్రీకారం… వీలైతే ఓపియం బంధు పేరుతో కొత్త పథకం…
- హాశ్చర్యంగా ఉందా..? మరీ కిందపడి కొట్టుకోకండి… రియలిస్టిక్ విశ్లేషణల్లో తేలే అసలు నిజం ఇదే… అప్ఘన్ తాలిబన్ల ఆలోచనవిధానం, ఆచరణ, విశ్వాసం ఇదే…
- మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అనేది ఇస్తామిక్ తత్వబోధ… కానీ తాలిబన్లు అక్షరాలా… మనసా, వాచా, కర్మణా ఆచరించేది మాత్రం వేరు…
ఈరోజు అమెరికా, నాటో దళాల్ని ఓడించి, ఉనికిని నిలుపుకుని, బలం పెంచుకుని, సమయం రాగానే అప్ఘన్ అనే దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్ల ఆలోచన ధోరణి అచ్చంగా అదే… గంజాయి, ఓపియం, డ్రగ్స్… ఇస్లామ్ చెప్పిన నైతిక సూత్రాలకు పూర్తి భిన్నంగా… ఆ స్పూర్తికి భిన్నంగా… ఆ ఇస్లామిక్ సైనికుల ఆచరణ, అడుగులు….. అసలు కాబూల్ ప్రత్యర్థుల చేతుల్లో ఉన్నప్పుడు…. అమెరికా, నాటో బలగాలు ఆ దేశాన్ని శాసిస్తున్న రోజుల్లో కూడా…. తాలిబన్ల కార్యాచరణ మారలేదు… వాళ్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఈ ఓపియం రాజ్యం సన్నగిల్లిందీ లేదు… ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు రష్యా, చైనా ఇక్కటి కావచ్చుగాక… అమెరికా వెన్నుచూపి పారిపోవచ్చుగాక… ఒక సమాజం మళ్లీ మధ్యరాతి యుగాలవైపు వెళ్తుండవచ్చుగాక… తన సొంత వ్యూహాలతో ఇండియా వేల కోట్లు అక్కడ గుమ్మరించి, అభివృద్ధికి తోడ్పడవచ్చుగాక… కానీ గెలిచింది ఓపియం మాత్రమే… ఎందుకంటే..?
Ads
ఆ ఓపియం, హెరాయిన్ డబ్బే వేలాది మంది తాలిబన్లను పోషించింది…. ప్రపంచ నల్లమందు మార్కెట్‌లో 90 శాతం అప్ఘనిస్థానే… ఆ డబ్బే అత్యాధునిక ఆయుధాల్ని అందించింది… ఆ సొమ్మే ఇప్పుడు ఒక దేశాన్ని హస్తగతం చేసుకుంది… పిచ్చి నాటో దేశాలు, పిచ్చి యుద్ధ ప్రణాళికలు… ఉగ్రవాదం అణిచివేతలో తాలిబన్లపై దాడులు అంటూ వెంపర్లాడాయి గానీ… అసలు తాలిబన్ ఆర్థిక బలాన్ని నిర్వీర్యం చేసిందెక్కడ..? ఆ డ్రగ్స్, ఆ నల్ల మందు ఏ దేశాలకు చేరుతున్నయ్..? వాటిని కంట్రోల్ చేసే అసలైన యాక్షన్ ప్లాన్ లేక…. తాలిబన్ల ఆర్థికవెన్ను విరిచే ప్రణాళికలు లేక… కేవలం మిలిటరీ ప్లానింగుతో ఏదో సాధిద్దాం అనుకున్నయ్… చివరకు దిక్కూదివాణం లేక ఇప్పుడు దేశం విడిచి పారిపోతున్నయ్… అగ్రరాజ్యమని బీరాలు పలికే అమెరికా వియాత్నం పరాజయం తరహాలో ఓడిపోయింది… రష్యా, చైనా వ్యూహాలకు తలవంచి… అప్ఘన్ విడిచి పారిపోయింది… ఒక దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది… అమెరికా ఇప్పుడు అగ్రరాజ్యమూ కాదు, దాని పాత వ్యూహాలకు ఇప్పుడు పదునూ లేదు, ఫలితమూ లేదు… ఇప్పుడు మరో రౌడీ ప్రపంచాన్ని హైజాక్ చేస్తున్నాడు… దాని పేరు… చైనా…!!
ఇప్పుడు చైనాకు అప్ఘన్ కావాలి… ప్రపంచ రాజకీయాల్లో అగ్రరాజ్యంగా ఎదగాలనుకుంటున్న క్రమంలో… వ్యూహాత్మకంగా కీలకమైన ఆ పాయింటు మీద తన ఆధిపత్యం పెరగాలి… అందుకు పాకిస్థాన్‌ను వాడుకుంటుంది… వెరసి అమెరికా కంట్లో పొడిచి, తాలిబన్లకు మద్దతు పలుకుతుంది… రష్యా సరేసరి… వెరసి ఏం జరిగింది… మానవ నాగరికతకు మరో థ్రెట్… లక్షల మంది పారిపోతున్నారు దేశం విడిచి… ఉన్మాదం, మూర్ఖత్వం మూర్తీభవించిన తాలిబన్లు మానవ చరిత్రలో మరో నల్లమరకను లిఖించడానికి రెడీ అయిపోయారు… అసలు తాలిబన్లను అణిచివేసిందెక్కడ… పాకిస్థాన్ అనే రౌడీ దేశం అమెరికా కళ్లుగప్పి… ఒకవైపు తాలిబన్లకు మద్దతు… అప్ఘన్ గిరిజన ప్రాంతాల్లో ఆ తాలిబన్ల ప్రాబల్యం తగ్గిందెప్పుడు..? ఏమీ లేదు… తాత్కాలికంగా అణిగిమణిగి ఉన్నట్టు నటించారు… అంతే… ఏటా 12 వేల కోట్ల టర్నోవర్ వాళ్లది… దాదాపు లక్ష మంది తాలిబన్ల ఉపాధి… ఊళ్లపై ఆధిపత్యం… తాలిబన్ల కోరలు పీకాలంటే ఓపియం, హెరాయిన్, డ్రగ్స్ మీద యుద్ధం చేయాల్సింది అమెరికా, నాటో… అసలు ఆ మార్కెట్‌కు వెన్నెముకే యూరప్ దేశాలు, అమెరికా… దాని నడ్డివిరచకుండా అఫ్ఘన్ మీద విజయం ఎలా..?
Share this Article