.
ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ బ్యానర్ చూసి ఏపీ ప్రజలు మొదట హడలిపోయారు… ఇది బోగస్ రేషన్ కార్డుల మీద స్టోరీ… రేషన్ బియ్యం దుర్వినియోగం మీద స్టోరీ… ఏటా వేల కోట్ల ప్రజాధనం ఆవిరవుతున్నదనే స్టోరీ…
అప్పట్లో చంద్రబాబు మద్యనిషేధం ఎత్తివేయడానికి తన అనుకూల పత్రికల్లో ఇలాంటివే రకరకాల కథనాలు రాయించి, ఎత్తివేతకు ఓ బేస్ ప్రిపేర్ చేసి… (కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్రవేయాలి కదా, అలా అన్నమాట) తరువాత మద్యనిషేధానికి మంగళం పాడాడు తెలుసు కదా…
Ads
కొంపదీసి అదే రీతిలో రేషన్ బియ్యం మీదో, తెల్ల రేషన్ కార్డుల మీదో ఇంకేదో ప్లాన్ వేస్తున్నాడా చంద్రబాబు అనే సందేహాలు తలెత్తాయి పాఠకుల్లో… కానీ తెలంగాణ ఎడిషన్, హైదరాబాద్ ఎడిషన్‌లోె అదేతరహా స్టోరీ తెలంగాణ తెల్ల కార్డులు, రేషన్ బియ్యం మీద కుమ్మేశాడు…
హమ్మయ్య… ఇటు రేవంత్ రెడ్డికి, అటు చంద్రబాబుకు తనే కథనసూచనలు జారీ చేస్తున్నాడు తప్ప ఈ ప్రభుత్వాల ఎత్తివేతల కుట్రలు ఏమీ లేవన్నమాట…
నిజానికి ఇది అవసరమైన వార్తే… యాంటీ పీపుల్ అనే భావనతో ఏ మీడియా ఈ కార్డుల మీద వ్యతిరేకంగా ఏమీ రాయడం లేదు… ఎంత సీరియస్ వార్త అంటే… తెలంగాణలో ఇప్పుడు తెల్లకార్డుల పరిధిలోకి వచ్చే జనాభా 3.25 కోట్లు… కోటిపైచిలుకు కార్డులు… మరో 2.5 లక్షల కార్డులు ఇవ్వబోతున్నారు, అంటే మొత్తం 3.35 కోట్ల మంది కవర్ కాబోతున్నారన్నమాట…
అంటే జస్ట్ 15 లక్షల మంది మాత్రమే ధనికులు అన్నమాట… మిగతా జనాభా మొత్తం పేదలే… మరి అలాంటప్పుడు ఇన్ని దశాబ్దాల స్వాతంత్ర్యం, దారిద్ర్య నిర్మూలన పథకాలు ఉద్దరించింది ఏమిటి..? అసలు 10 లక్షల మంది ఉద్యోగులే ఉంటారు కదా, వాళ్లు గాకుండా ఐటీ పేయర్లు, కార్ల ఓనర్లు, ఎగువ మధ్యతరగతి, సంపన్నవర్గాలు ఇక 5 లక్షలేనా..? ఎంత తప్పులతడక యవ్వారం ఇది..?
ఎవరూ సరిదిద్దరు… బ్రహ్మాండమైన మెజారిటీ ఉన్నా సరే, ఇంకా ఇంకా విపక్షాల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, ఇతర పార్టీలను నిర్వీర్యం చేయడానికే తప్ప ఇలాంటి వ్యవస్థ తప్పిదాలను సరిదిద్దే సోయి బీఆర్ఎస్ పార్టీకి లేకుండా పోయింది… చేస్తే గీస్తే కేసీయారే చేసి ఉండాల్సింది… కానీ చేయలేదు… అరకొర మెజారిటీ, అంతర్గత విభేదాలతో సతమతమయ్యే కాంగ్రెస్ ఏం చేయగలదు..?
ఒకవేళ ఏమైనా చేయాలని అనుకున్నా ఇదే బీఆర్ఎస్ గాయిగత్తర చేస్తుంది… (అఫ్‌కోర్స్, ఏపీలోనూ ఇదే స్థితి)… పొలిటికల్ సెన్సిటివ్ ఇష్యూ… ఎవరూ కార్డుల ఏరివేతకు వెళ్లరు… ఈ అరాచకం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది…
దీనికితోడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రేషన్ బియ్యానికే కాదు, ఈ తెల్ల కార్డును ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, సీఎంఆర్ఎఫ్, గ్యాస్ సబ్సిడీ, రకరకాల సామాజిక పెన్షన్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి… ఏ పథకం తీసుకున్నా తెల్ల కార్డే ప్రామాణికం… అంటే తెల్ల కార్డు విలువను బాగా పెంచేసింది… పైగా సన్నబియ్యం ఇస్తోంది…
అంటే, గతంలో రేషన్ బియ్యం తీసుకోని వాళ్లు కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు… ఇక ఎవరు వదులుకుంటారు కార్డులు… అనర్హుల పేర్లతో ఉన్న కార్డుల బాపతు బియ్యం బ్లాక్ మార్కెట్… నిజానికి ఈ కార్డులను కేవలం రేషన్‌కే పరిమితం చేస్తే బాగుండేది… రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని తప్పుచేసింది…
200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 రూపాాయల సిలిండర్ దగ్గర్నుంచి ప్రతి పథకానికి అర్హులను విడిగా ఖరారు చేసి, ఈ తెల్ల కార్డుల నుంచి డీలింక్ చేయాల్సింది… ఇప్పుడిక బోగస్ కార్డులను ఏరివేయలేదు, కొనసాగిస్తే ఖజానాకు తలనొప్పి… కూరుకుపోతోంది… అస్థిరమైన రాజకీయ వాతావరణంతో వచ్చే ఉపద్రవం ఇదే…
అసలే జగన్ ఫ్రీ ఫ్రీ అంటూ చంద్రబాబును వెక్కిరిస్తూనే తనను మించి అనేకరెట్లు ఫ్రీ జగన్ అయ్యాడు… సో, చంద్రబాబు కూడా ధైర్యంగా బోగస్ కార్డుల ఏరివేతకు ధైర్యం చేయలేడు… ఐనా ఇది రెండు తెలుగు రాష్ట్రాల సమస్య కాదు… అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే… బీహార్ బోగస్ వోట్ల ఏరివేతకు ఎన్నికల సంఘం SIR ప్రక్రియ చేపట్టినట్టు, జాతీయ స్థాయిలో ఈ ఏరివేత ప్రక్రియ మొదలైతే మేలు…
అబ్బో, వద్దు, వద్దు, సుప్రీమే నడవనివ్వదు, రాహుల్ గాంధీ అస్సలు పడనివ్వడు… దీనిపై ఓ జాతీయ విధానం రూపకల్పనకు ది గ్రేట్ మోడీ కూడా ధైర్యం చేయలేడు… వ్యవస్థ ఇలా నడవాల్సిందే… వీలైతే మరింత దిగజారాల్సిందే..! ఇలా చేస్తే బాగుంటుందని కూడా ఎవడూ చెప్పడానికి సాహసించడు…!! కనీసం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను మెచ్చుకుందాం, ప్రజోపయోగ కథనం ఇది..!!
Share this Article