.
సినిమాలు జనాన్ని మారుస్తాయా..? ఎస్, మార్చేంత శక్తి ఆ మాస్ కమ్యూనికేషన్ మీడియాకు ఉంది… నిజానికి వర్తమాన ప్రపంచంలో అత్యంత బలమైన ప్రభావశీల మీడియా సినిమాయే…
కాకపోతే మన దిక్కుమాలిన నిర్మాతలు, దర్శకులు… ప్రత్యేకించి చెత్తా స్టార్ హీరోలు, వాళ్ల ధనదాహం పుణ్యమాని సినిమా మీడియా భ్రష్టుపట్టిపోయింది… ఇదేం కథరా అనడిగితే సమాజాన్ని బట్టే కథలు అంటారు… దీన్నే భట్టేభాజ్ కథలు అంటారు… దరిద్రపు జస్టిఫికేషన్లు అంటారు…
Ads
ఎస్, మంచి చెబితే సొసైటీ వింటుంది, ఆచరించడానికి ప్రయత్నిస్తుంది… అనుకరిస్తుంది… సొసైటీ అంత చెడ్డదేమీ కాదురా అబ్బాయ్… కాకపోతే గంధపు చెక్కల స్మగ్లర్ల చిల్లర పోకడల్నీ హీరోయిజంగా ప్రొజెక్ట్ చేయడం వల్లే వస్తున్నది సమస్య… ఇది ఓ ఉదాహరణ…
సరే, మస్తు నీతి చెబుతాం, మంచి క్రియేటివ్ ఐడియాలు చెబుతాం, ఈ సొసైటీ పాటిస్తుందా అంటారా..? ఎస్, తప్పకుండా… ఈ కథనం అదే… సంక్షిప్తంగా చెప్పుకుందాం…
శనార్థి శ్రీకుట్టన్ అనే ఓ మలయాళ సినిమా… మాలీవుడ్ అంటే గతంలో చెత్తా అసభ్యపు, నాసిరకం రెడ్ లైట్ కహానీలు… కానీ ఇప్పుడు ప్రయోగాలు, క్రియేటివిటీ… అదరగొడుతున్నాయి… తక్కువ ఖర్చుతో ఓ మంచి ప్రయోగం చేయాలి… ఇదీ దాని స్టయిల్…
అఫ్‌కోర్స్, తలకుమాసిన తెలుగు సినిమా ఏరోజూ ఇలాంటి ప్రయోగాలు చేయలేదు, అంతకుమించిన దిక్కుమాలిన తెలంగాణ ప్రేక్షకజనం దాన్ని ఆదరించదు… కానీ అది కేరళ కదా… అడాప్ట్ చేసుకుంది… కొన్ని స్కూళ్లలో బ్యాక్ బెంచులు మాయమయ్యాయి… ఓ ఫోటో చూడండి… ఇలా మారిపోయాయ్ కొన్ని స్కూళ్లు…
ఆహా… ఇన్నాళ్లూ బ్యాక్ బెంచర్స్ అంటే వెధవల్లాగా… బ్రెయిన్‌లెస్ స్టూడెంట్ల బ్యాచుల్లాగా… నానారకాలుగా చిత్రీకరించారు కదరా… హఠాత్తుగా కొన్ని స్కూళ్లు ఆ సినిమా చూసి, ఇదుగో, ఇలా సీటింగ్ అరేంజ్‌మెంట్లు మార్చేశాయి… అవును, తరగతి గదుల్లో స్టూడెంట్లు అందరూ సమానమే ఐనప్పుడు ఫ్రంట్, బ్యాక్ బెంచెస్ ఎందుకు విడివిడిగా ఉండాలి..?
ఇక్కడ నో బ్యాక్ బెంచెస్… అందరూ ఫ్రంట్, ఫస్ట్ రో బెంచ్ స్టూడెంట్లే… నో వివక్ష… పర్‌ఫెక్ట్ మార్పు… ఐతే ఇక్కడ నేను ఆ సినిమా సమీక్షకు పోవడం లేదు, ఓ ఇన్‌స్పిరేషనల్ కంటెంట్ గురించే ప్రస్తావన… ఎస్, స్కూల్ గదుల్లో వివక్ష ఎందుకు ఉండాలి..? నిజంగానే ఎవడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్..? ఎవడు ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్..?
- స్టూడెంట్ తెలివిని… అంటే, జస్ట్ పుస్తక జ్ఞానాన్ని ప్రదర్శించేవాడు ఫ్రంట్ బెంచ్, లేకపోతే బ్యాక్ బెంచా..? కాదు… అసలు బ్యాక్ బెంచ్‌లోనే క్రియేటివిటీ ఉందేమో… మన దిక్కుమాలిన భట్టీయం సిలబస్‌ను సహించక దూరదూరంగా ఉంటుందేమో… ఎస్, ఆలోచించాల్సింది ఇదే… ఇదే…
ఒక టీచర్ పాఠాలు చెబుతుంటే… వీడు ఫ్రంట్ బెంచ్, వీడు బ్యాక్ బెంచ్ అనే వివక్ష ఉండకూడదు… సో క్లాస్ రూం సీటింగ్ మారింది… ఇది అన్నిచోట్లా అమలవుతుందా.,.? అసలే తిక్క సంప్రదాయ పోకడల్లో ఉండే స్కూలింగ్ మారుతుందా..? మారాలి, మారితేనే మంచిది, కానీ ఎప్పుడు..? కాలం బదులు చెప్పాల్సిన ప్రశ్న..!!
- ఒరే ఒరే కమర్షియల్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు కాస్త సొసైటీ గురించీ ఆలోచించడర్రా… మీ దుంపతెగ… రోమియోలు, స్మగ్లర్లు, దిక్కుమాలిన లక్షణాల కథానాయకులేమిట్రా..!!
Share this Article