.
‘‘ఆ లేఖ నేను రాసిందే… కానీ అంతర్గతంగా ఉండాల్సిన ఆ లేఖను లీక్ చేసిందెవరో మీరే అర్థం చేసుకొండి… కేసీయార్ దేవుడు, కానీ తన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి… కేసీయార్ నాయకత్వంలోనే పనిచేస్తాను, వేరే ఉద్దేశాలు ఏమీ లేవు…
పార్టీలో అంతర్గత విషయాల్ని లేఖల ద్వారా రాయడం నాకు అలవాటే… పర్సనల్ ఎజెండా ఏమీ లేదు, కేడర్ అనుకుంటున్నదే రాశాను… కానీ ఈసారే బయటికి వచ్చింది… కాంగ్రెస్, బీజేపీలు కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా మరీ సంబరపడాల్సిన అక్కర్లేదు’’ అని కేసీయార్ బిడ్డ కవిత క్లారిటీ ఇచ్చింది… అమెరికా నుంచి రాగానే…
Ads
ఎస్, నిన్నటి నుంచీ తెలంగాణ రాజకీయాల్లో ఇంత హంగామా జరుగుతున్నా సరే, కవిత క్యాంపు నుంచి ఖండన రాకపోవడంతోనే ఆ లేఖ ఆమెదే అని అనుకుంటున్నదే… ఇప్పుడు ఆమె నోటి నుంచే క్లారిటీ వచ్చింది… పైగా ఒకరిద్దరు అత్యుత్సాహంతో బీఆర్ఎస్ నాయకులు స్పందించడమే తప్ప బీఆర్ఎస్ అఫిషియల్‌గా లేఖ మీద సైలెంటు…
(ఆ లేఖ ఏదో డ్రామా, అంతా రేవంత్ పైత్యం అన్నట్టుగా తెగ రాసేసిన మౌత్ పీస్ నమస్తే తెలంగాణ మొహం ఎక్కడ పెట్టుకుంటుందో…) సరే, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమె ఆగమనం వేళ కనిపించిన దృశ్యాలు మాత్రం ఆమె ఆలోచనలు, అడుగుల పట్ల కేసీయార్, కేటీయార్ కోపాన్ని కనబరుస్తున్నాయి…
ఎలాగంటే..? అక్కడికి బీఆర్ఎస్ నుంచి ఓ మామూలు కార్యకర్త కూడా రాలేదు… గులాబీ జెండాల్లేవు… కేటీయార్ ఎట్సెట్రా ఫ్యామిలీ లీడర్ల ప్రస్తావన గానీ, పేర్లు గానీ మర్యాదకు కూడా లేవు… జస్ట్, జాగృతి కార్యకర్తలు, బీసీ సంఘాల కార్యకర్తల పేర్లతో కవిత పేరుతో, కవిత ఫోటో మాత్రమే ఉన్న ప్లకార్డులు, టీమ్ కవితక్క పేరుతో కనిపించాయి…. బీఆర్ఎస్ వాసనే లేదు మచ్చుకైనా…
అంటే, పార్టీపరంగా ఆమెకు దూరంగా ఉండాలని కేసీయార్ శిబిరం ఖచ్చితంగా చెప్పినట్టే అనుకోవాలా..? ఐతే కేసీయార్ దేవుడే గానీ తన చుట్టూ దెయ్యాలున్నాయనే కవిత వ్యాఖ్య ఎవరి మీద..? అన్న కేటీయార్ పైనేనా..? కేసీయార్ చుట్టూ ఉండే యాక్టివ్, ఇంపార్టెంట్, కోటరీ ముఖ్యనేతలు హరీష్, కేటీయార్ మాత్రమే కదా…
హరీష్‌తో కవితకు సత్సంబంధాలే ఉన్నాయంటారు… అంటే తన రాజకీయ ఎదుగుదలకు కేటీయారే అడ్డుపడుతున్నాడు, తన క్యాంపే ఈ లేఖను లీక్ చేశాడని చెబుతున్నట్టా కవిత..? అంటే ఇద్దరి నడుమ అగాధం ఇంకా పెరుగుతున్నట్టే అనుకోవాలా..?
లేఖపై ఒక క్లారిటీ మాత్రం వచ్చినట్టే…. ఐతే కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా కేసీయార్ కుటుంబం ఓ నాటకం ఆడుతోందా కుటుంబ అంతర్గత విభేదాల పేరిట..? అదేమిటో కాలం చెబుతుంది గానీ ప్రస్తుతానికి కవిత అడుగులు, ఆలోచనల పట్ల జనంలో, పార్టీ శ్రేణుల్లో ఓ క్లారిటీ మాత్రం వస్తోంది…
ఆమె సామాజిక తెలంగాణ పేరిట విడిగా పొలిటికల్ భవిష్యత్తు వెతుక్కోబోతోంది… కేసీయార్ నీడలో, కేటీయార్ వారసత్వ నీడలో తన పొలిటికల్ యాంబిషన్లు నెరవేరే ప్రసక్తే ఉండదనే క్లారిటీ వచ్చినట్టుంంది ఆమెకు…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సరే సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం అని ఇంతకుముందు ఆమె చేసిన పరుషమైన వ్యాఖ్య పార్టీ పట్ల, నాయకుడి పట్ల అభిశంసనే… పైగా ఈ లేఖ… తరువాత దెయ్యాల ప్రస్తావన… అన్నీ చెబుతున్న నిజం అదే… ఆమె కేసీయార్ నీడ నుంచి బయటపడి, సొంతంగా పొలిటికల్ కెరీర్ నిర్మించుకోబోతోంది..!!
అవునూ… కేసీయార్‌కు రాసిన లేఖ ఆ దేవుడు కేసీయార్ అనుమతి లేకుండా చుట్టూ ఉన్న దెయ్యాలు లీక్ చేస్తాయంటావా దేవన్‌పల్లి కవితక్కా అలియాస్ కల్వకుంట్ల కవితక్కా..! అంటే దేవుడే కోపం మీద ఉన్నట్టే కదా..!!
Share this Article