.
ఏదో తెలుగు పత్రికలో… బహుశా మన తెలంగాణ కావచ్చు… ఫస్ట్ పేజీలోనే ఓ ఆశ్చర్యకరమైన వార్త కనిపించింది… ఇప్పటిదాకా 25 దాకా కేసులు పెట్టారు కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ బాపతు…
ఐతే తెలంగాణ పోలీసులు తన రూట్ అర్జెంటుగా మార్చేసి, ప్రస్తుత నిందితులందరినీ సాక్షుల్ని చేసేసి, ఇక బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను వేటాడతారట… హవ్… బెట్టింగ్ నిర్వాహకుల పని పట్టాల్సిందే నిజమే… కానీ వాటిని ప్రమోట్ చేసేవాళ్ల నేరాలు ఒక్కసారిగా బారా ఖూన్ మాఫ్ అయిపోతాయా..? సాక్షులు అయిపోతారా..?
Ads
19 వరకూ బెట్టింగ్ యాప్స్ మీద కేసులు పెట్టారు, సరే… ఇక కొత్త కొత్త కథలు పుట్టుకొస్తున్నాయి… ప్రభాస్, గోపీచంద్, బాలయ్య మీద కూడా కేసులు పెట్టాలి కదా, మెట్రోలో కూడా యాడ్స్ వేశారు, దాని సీఎండీని కూడా బుక్ చేయాలి కదా… అంతేకాదు, సచిన్, షారూక్ ఖాన్, కోహ్లీలను కూడా బుక్ చేయాలని మరో డిమాండ్…
ఇక వీళ్లను గోకడం తన వల్ల కాదు, ఇప్పటికే సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నట్టు విమర్శలున్నాయి, అందుకని ఇంకా దూకుడుగా పోవడానికి రేవంత్ రెడ్డి విముఖంగా ఉన్నాడా..? ఏమో, ఆ వార్త మర్మం, ఉద్దేశం ఏమో తెలియదు గానీ…
కేసులు పెట్టి విచారిస్తున్న పోలీసులే చెప్పాలి నిజానిజాలేమిటో… ఐతే ఈ కేసులు నడుస్తూనే ఉన్నాయి, మరోవైపు రీల్స్‌లో ఓ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కనిపిస్తూనే ఉన్నాయి, అదేమిటో మరి… వీళ్లు కేసులు పెట్టిన జాబితాలో ఆ బెటింగ్ యాప్ పేరు మాత్రం లేదు… (బహుశా గోవింద365 కావచ్చు దాని పేరు…)
ఫేస్‌బుక్‌లో మిత్రుడు Sumanth Patel పోస్టు ఒకటి ఆసక్తికరం అనిపించింది… అది యథాతథంగా…
బెట్టింగ్, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, బిజినెస్… ఇవన్నీ నా ఉద్దేశంలో ఒకటే…
భూమి రేట్ పెంచుతూ పోతూ ఉంటారు కానీ చివరికి overprice అయ్యి downfall అయ్యి మోసపోయేది చివరికి కొన్నవాడే.. max అత్యాశ మధ్య తరగతి వాడే..
అలాగే షేర్ మార్కెట్.. అసలు ఎందుకు పడుతుందో ఎందుకు లేస్తుందో తెలీదు.. నువ్వు ఎంత మేధావి అయినా కాండిల్స్ ని, ఇన్ఫర్మేషన్ ని, టిప్స్‌ని, అనుభవాన్ని ఎంత తెచ్చుకున్నా next ఏం జరుగుతుందో తెలీదు.. తెలిస్తే భగవంతుడు అవుతాడు కదా..
బిజినెస్ పెడితే నెలకు లక్షలు లక్షలు మిగులుతాయి అని అనుకుంటారు.. 10 లో ఒక్కడికే తగులుతుంది, మిగతా అందరూ ఎత్తెయ్యాల్సిందే.. అది అంతే ఇవన్నీ అదృష్టాల మీద ఆధారపడ్డాయి..
—————————————–
ఆన్లైన్ బెట్టింగ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. భారత్ లో ఆ చట్టం లేదు బెట్టింగ్ నిర్వహించొద్దు అని ఉంది కానీ ప్రమోషన్ గురించి చట్టం ఏం చెప్పలేదు.
దాని మీద చట్టాలు తెచ్చే అధికారం కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చింది.
తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే ఆన్లైన్ బెట్టింగ్ నిషేధించాయి.. నాగాలాండ్ లాంటి రాష్ట్రాలలో బెట్టింగ్ హౌస్ నిర్వహించే వెసులుబాటు కూడా ఉంది.
గోవా లో క్యాసినో బ్యాన్.. సో క్యాసినో వాడు ఏం చేశాడు, BIG DADDY అని ఒక షిప్ (క్రూయిజ్) తయారు చేసి అందులో క్యాసినో నిర్వహిస్తున్నాడు. అది భూమి మీద లేదు కాబట్టి గోవా రాష్ట్ర పరిధిలోకి రాదు. గోవా చర్య తీసుకోలేదు.
—————————————–
ఇలా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి.
ఈ ప్రపంచంలో..
సిగరెట్, మందు, మాదకద్రవ్యాలు, బెట్టింగ్, బ్లాక్ మనీ, వ్యభిచారం, లంచాలు, తుమ్మ చెట్లు లాంటివి పూర్తిగా నిర్మూలించడం ఎవరి వల్లా కాదు.. అవగాహన తెప్పిస్తే కొంతవరకు ఆపగలం అంతే.
వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు, వేరే రాష్ట్రాలలో నిషేధం లేదు కాబట్టి మేము చేశాను. మేము చేసిన వీడియోలు దేశంలో ఎక్కడైనా add play చేసుకోవచ్చు. తెలంగాణ కోసం ఆంధ్ర కోసం చేయలేదు. మరి తెలుగులో ఎందుకు చేశారు అంటే పక్క దేశాలలో పక్క రాష్ట్రాలలో ఉన్న తెలుగు వాళ్ళ కోసం చేశాము అంటారు.
చేసి ఇవ్వడం మా బాధ్యత, వాళ్ళు ఎక్కడ play చేశారు అనేది నిర్వాహకుల బాధ్యత. Online కాబట్టి ఈ ప్రాంతానికి మాత్రమే అని ఉండదు, ప్రపంచంలో ఎవరూ చూసినా ఆ ads వస్తాయి.
So బెట్టింగ్ నిర్వహించడంలేదు, వేరే రాష్ట్రాల కోసం ప్రమోషన్ చేశాము అని చెప్పుకుంటారు బయట పడతారు..
There are big loop holes in act…
—————————————–
ఇంకో గమ్మత్తైన విషయం తెలుసా
రేస్ గుర్రాల మీద, పత్తాల మీద బెట్టింగ్లు చట్టప్రకారం ok అవి స్కిల్ based…
కానీ స్పోర్ట్స్ మీద not ok..
ఇప్పుడు అరెస్టయిన వాళ్ళ ప్రమోషన్ వీడియోస్ ఇంకా వస్తున్నాయి మరి.. ముందు పోలీసులు ప్రభుత్వం అవి ఆపాలి..
ప్రదీప్ యాంకర్‌గా ఆహాలో, zee తెలుగులో బెట్టింగ్స్ మీద ప్రోగ్రాంలు కూడా చేశారు ప్రమోట్ చేస్తూ.. ముందు ఆ ఛానెల్స్ కి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు పోలీసులు..
నిన్న ఒకడు కలర్ గ్రేడింగ్ చైనీస్ గేమ్ ఆప్ తో trap చేస్తున్నాడు. కంప్లైంట్ చేస్తా అని చెప్తే చేసుకో నాకు ఎందుకు చెప్తున్నావ్ అని అన్నాడు …
ప్రభుత్వం దీని మీద కఠిన చట్టాలు తేవాలి కానీ చట్టంలో లేకుండా వాళ్ళని వీళ్ళని అరెస్టు చేయడం అంటే political diversion కోసమే. స్థానిక ఎన్నికల దాకా ఇవి చేస్తాడు. తర్వాత పథకాలు ఆపుతాడు అంతే.
—————————————–
మహదేవ్ బుక్ … అని ఒక బెట్టింగ్ సంస్థ ఉండేది.. మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు 6000 కోట్లు సీజ్ చేసింది. దానికి వెనుక ఉండి నడిపించిన వ్యక్తి 2018 – 2023 దాకా ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా చేసిన మన ప్రియతమ కాంగ్రెస్ సిఎం బుపేష్ భగెల్..
బెట్టింగ్ నడిపించిన సౌరబ్ అనే వాడు.. వాడి పెళ్లి దుబాయ్ లో చేసుకున్నాడు, 30 ఏళ్లు కూడా ఉండవు. వాడి పెళ్లికి కేవలం 200 కోట్లు ఖర్చు, అదీ అతిథులకు ప్రైవేటు జెట్ లో తీసుకువెళ్ళి తీసుకురావడానికి మాత్రమే ఆ ఖర్చు పెట్టాడు. అప్పుడు బయటపడింది. అనుమానం వచ్చి ఎవడు వీడు అని తీగ లాగితే మొత్తం కాంగ్రెస్ యవ్వారం డొంక అంతా బయటపడింది.
ఈయన ఇంట్లో సోదాలు చేయడానికి పోతే కాంగ్రెస్ ధర్నా, బంద్ కి పిలుపునిచ్చింది. మొన్న టికెట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి ఈ బెట్టింగ్ లు నడిపే వాళ్ళ వెనుక ఉండే అసలు దోషులు ఎవరో? ఈ మొత్తం డొంకను తెలంగాణ ప్రభుత్వం నిర్మూలించగలదా..?!
ఫేస్‌బుక్‌లో స్పాన్సర్డ్, అంటే వాడు డబ్బు తీసుకుని ఇచ్చే యాడ్స్‌లో… రాష్ట్రపతి, ఆర్థికమంత్రి ఎట్సెట్రా కేంద్ర బాధ్యుల పేర్లను, ఫేక్ వీడియోలను, ఆడియోలను కూడా పెట్టేశాడు వాడెవడో… పక్కా ఫేక్, ఫ్రాడ్… ఈరోజుకూ దాని మీద కేంద్ర ప్రభుత్వం యాక్షన్ లేదు…!! మన సిస్టం ఎంత నిర్లిప్తంగా, నిస్తేజంగా, స్తబ్దంగా ఉండిపోయిందో చెప్పడానికి ఈ ఉదాహరణ… అంతే…
Share this Article