Sai Vamshi…. ఆమె ఒక మామూలు లేడీయా?!
… “పవన్ కల్యాణ్‌కి ఎదురుగా మాములు లేడీ ఎలా గెలుస్తుంది బ్రో? జనం వైసీపీని, జగన్‌ని చూసి ఆమెకు ఎన్ని ఓట్లు వేస్తారు? పిఠాపురంలో ఇంకా గట్టి క్యాండిడేట్‌ని పెడితే ఏమన్నా వర్క్‌వుట్ అయ్యేదేమో? పక్కా పవనే గెలుస్తాడు చూడు!” అన్నాడో మిత్రుడు. ఆంధ్ర రాజకీయాల మీద అతనికి పెద్దగా అవగాహన లేదు.
‘పక్కా పవనే గెలుస్తాడు’ వరకూ నాకు అభ్యంతరం లేదు. అది అతని ఆశ, అభిప్రాయం. రేపు ఎవరు గెలిచినా కూడా నాకేం అభ్యంతరం లేదు. అది జనాల ఇష్టం. కానీ వంగా గీతను ‘మామూలు లేడీ’ అనడం తీవ్ర అభ్యంతరకరం. ఓ చీర, నుదిటిపై బొట్టు, మెళ్లో ఓ నగ.. ఇవి ఉంటే మామూలు లేడీ అన్నమాట వీళ్ల దృష్టిలో!
“ఆమె ఏం చదువుకున్నారో తెలుసా!” అన్నాను.
“ఊహూ..” అన్నాడు.
వికీపీడియా తెరిచి చూపించాను. దిమ్మ తిరిగింది అతనికి. ‘ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎల్, నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి లాలో మాస్టర్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీలో మాస్టర్ డిగ్రీ, మద్రాసు యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ సైకాలజీ డిగ్రీ.
ఆమె రాజకీయ జీవితం? తూర్పు గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా పని చేశారు. 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ ఎంపీ, 2009-14 దాకా ఎమ్మెల్యే, 2019-2024 దాకా ఎంపీ. రాజ్యసభ ఎంపీగా అనేక ప్రతిష్టాత్మక కమిటీల్లో ఆమె సభ్యురాలు. ఆమె కమిటీలో ఉంటే చాలా మంచి సలహాలు ఇస్తారనే పేరుంది. కేంద్ర మంత్రులు తమ ప్రమాణాల రూపకల్పనలో ఆమెను సంప్రదించారన్న గుర్తింపు ఉంది.
One Lady.. అతని మాటల్లో మామూలు లేడీ. చీర, నుదిటిపై బొట్టు, మెళ్లో ఓ నగ వేసుకున్న సామాన్య స్త్రీ వెనకాల ఇంత చరిత్ర ఉంది.
.. మొత్తం విన్నాక నా మిత్రుడి ముఖంలో రంగులు మారాయి. ‘అందరూ ఆమె పపన్ కల్యాణ్‌కి ఆపోజిట్ క్యాండిడేట్ అన్నారు కానీ, ఆమెకు ఇంత హిస్టరీ ఉందని ఎవరూ ఎక్కడా చెప్పలేదేంటి?’ అనే ఫీలింగ్ కనిపించింది.
ఆడవాళ్లు ఎంత సాధించినా సరే, వాళ్లని ‘ఆడవాళ్లు’ అనే జోన్లో పెట్టి చూడటం అలవాటయ్యాక ఎవరు మాత్రం ఏం చెప్తారు? అసలెంతమందికి తమ ఎమ్మెల్యే, ఎంపీల చదువు, అనుభవం గురించి తెలుసు? – విశీ
.
(ఏపీలో ఎవరు గెలుస్తారో, ఎవరు గెలవాలో, ఎవరేమిటో, ఎవరితో ప్రజలకేమిటనేవి ఇక్కడ అంశం కాదు… జస్ట్, మహిళల్ని తేలికగా తీసిపారేయవద్దనేదే ఈ సంక్షిప్త కథన ఉద్దేశం…)
Share this Article