.
మొన్నామధ్య నిత్యామేనన్ లిప్‌లాక్ సీన్ వార్తల్లో ఉంది కొన్నాళ్లు… ఇప్పుడు సురభి లక్ష్మి అనే మలయాళ నటి లిప్‌లాక్ సీన్ కూడా..!
ఈమె రైఫిల్ క్లబ్ అనే యాక్షన్ కామెడీ జానర్ సినిమా క్లైమాక్సులో తన భర్త పాత్ర పోషించిన నటుడికి ఘాటు ముద్దు ఇచ్చింది… చిత్రీకరణలో నైపుణ్యం కారణంగా ప్రేక్షకజనం ఆమోదించి చప్పట్లు కొట్టారు… ఆ సీన్ అలా రక్తికట్టించడం ఒకరకంగా సురభి ప్రతిభే…
Ads
బోల్డ్, ఇంటిమేట్, లిప్‌లాకులు వంటి సీన్ల గురించి గతంలో స్టార్లు పెద్ద పెద్ద హిపోక్రసీ మాటలు చెప్పేవాళ్లు… ఆ షూట్ సమయంలో పరిమిత స్టాఫ్ ఉండేలా చూసేవాళ్లు… కానీ ఇప్పటి తారలు అలా కాదు, తన పాత్ర ఏమిటి..? సీన్ ఏమిటి..? అంతే…
ప్రొఫెషనల్‌గా… ఏ టెన్షన్లూ, ఏ అదనపు రిక్వైర్‌మెంట్లూ లేకుండా అలవోకగా సీన్లలో నటించేస్తున్నారు… మీడియా అడిగితే కూడా ఏ భేషజాలూ లేకుండా ఓపెన్‌గా మాట్లాడుతున్నారు… సురభి కూడా అంతే…
నిజానికి ఆమెకు షూటింగ్ స్పాట్‌కు వెళ్లేదాకా ముద్దు సన్నివేశం ఉందని తెలియదు… వెళ్లాక చెప్పారు… సర్లేద, ఏదో ఓ ముద్దు అనుకుంది, తీరా దర్శకుడు కాస్త ఘాటు ముద్దే అని చెప్పాడు… సరే, వోకే అనేసింది… కాకపోతే తన సహనటుడికి సిగరెట్ అలవాటుంది కాబట్టి, కాస్త బ్రష్ చేసుకుని రావయ్యా స్వామీ అని చెప్పింది…
అంతేకాదు, ముద్దు సీన్ ఇద్దరు నటులకూ ఇబ్బందిగా ఉండొద్దు, అప్పుడే ఆ ఫీల్ చూపించగలం అనుకుని యాలకులు తెప్పించుకుని కాసేపు నమిలింది… ఎప్పటిలాగే షూటింగ్ స్టాఫ్ ఉన్నారు… నో దాపరికాలు… షూట్ అయ్యాక, వెండి తెర మీద కోట్లాది మంది ఎలాగూ చూస్తారు కదా… సో, నటించేసింది, మెప్పించింది… సినిమాలో ఆమెదే ప్రధాన పాత్ర కాదు, నటీనటుల్లో ఒకతి… అంతే…
మొన్న ఎక్కడో ఏదో ఇంటర్వ్యూలో ఇదే చెబుతూ… నేనేమీ టెన్షన్ పడలేదు, అదొక పాత్ర, ఆ కథకు తగ్గట్టు నటించాలి కదా, అంతకుమించి ఆలోచించలేదు, సహనటుడు సజీవ్ కుమార్‌నే అడిగాను, నువ్వేమైనా టెన్షన్ పడుతున్నావా అని… లిప్‌లాక్ సీన్‌లో నటించిన అనుభవం ఉన్న దర్శన కూడా అక్కడే ఉంది, ఐనా ఆమెనేమీ సూచనలు, సలహాలు కూడా అడగలేదు… సీన్ రక్తికట్టించింది… పండించింది…
గతంలో లిప్ లాక్స్ వంటి సెన్సార్ కత్తెరకు గురయ్యేవి… కానీ ఇప్పటి పరిణత దర్శకులు కొందరు వెగటు అనిపించకుండా చిత్రీకరిస్తున్నారు… ఓ మంచి మార్పు ఇది… రైఫిల్ క్లబ్ అనే ఆ సినిమా ఖర్చు చిన్న తారాగణంతోనే 10 కోట్లు… అవును, జస్ట్ 10 కోట్లతో తీస్తే 30 కోట్ల వసూళ్లు వచ్చాయి… అసలు ఎవరబ్బా ఈమె అని వివరాలు వెతికితే… ఇంట్రస్టింగు అంశాలున్నాయి… చెప్పుకోదగినవే…
భరతనాట్యంతో గ్రాడ్యుయేషన్… తరువాత థియేటర్ ఆర్ట్స్‌లో ఎంఏ చేసింది… పర్‌ఫామింగ్ ఆర్ట్స్‌లో ఎంఫిల్… ప్రస్తుతం పీహెచ్‌డీ… ఇటు చదువు, అటు నటన… వెండి తెర మాత్రమే కాదు, బుల్లితెర, షార్ట్ ఫిలిమ్స్, థియేటర్ పర్‌ఫామెన్స్… బోలెడు అవార్డ్స్…
చెప్పనే లేదు కదూ… 2016లో జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా కొట్టింది… Minnaminung- The Firefly అనే సినిమాకు..!!
Share this Article