.
దేవేంద్ర ఫడ్నవీస్… మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు… పుట్టింది నాగపూర్… ఆర్ఎస్ఎస్ మూలాలు… ఈసారి బీజేపీకి మంచి సీట్లు రావడంతో… చిన్నాచితకా అడ్డంకులు తొలగించిన హైకమాండ్ తన సీఎం పదవికి దారి క్లియర్ చేసింది…
తన వివరాలే కాదు, ప్రస్తుతం ఆయన భార్య వివరాల సెర్చింగు సాగుతోంది అధికంగా… ఆమె పేరు అమృత… తనదీ నాగపూరే… ఫడ్నవీస్ రాజకీయాలు, ముఖ్యమంత్రిత్వంతో ఏ సంబంధమూ లేకుండా ఆమెది ఓ సపరేట్ కెరీర్… ఎప్పుడూ వార్తల తెర మీద కనిపించే ఆమెది ఓ సమాంతర ప్రజాజీవితం…
Ads
తండ్రి శరద్ పాపులర్ ఆప్తమాలజిస్టు… తల్లి చారులత గైనకాలజిస్టు… అమృత అక్కడే కామర్స్ గ్రాడ్యుయేట్, తరువాత పూణెలోని సింబయాసిస్‌లో ఎంబీఏ చేసి యాక్సిస్ బ్యాంకులో చేరింది… ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆమె బ్యాంకులో జాబ్ మానలేదు… ఇప్పుడు ఆమె బ్యాంకు వైస్ ప్రెసిడెంటు…
ఆమె చిన్నప్పుడే సంప్రదాయ, శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది… స్కూల్‌లో అండర్ 16 స్టేట్ ప్లేయర్… బ్యాంకు ఉద్యోగం చేస్తూనే పలు కమర్షియల్, సోషల్ సాంగ్స్ పాడేది… సినిమా, ప్రైవేట్ సాంగ్స్ కూడా… పలు అవార్డులు కూడా వచ్చాయి… ఇవే కాదు చురుకైన సోషల్ యాక్టివిస్టు ఆమె…
దివ్యాజ్ ఫౌండేషన్ (బిడ్డ పేరు దివిజ) పెట్టి పలు యాక్టివిటీస్ చేస్తుంటుంది… ఓసారి యాసిడ్ అటాక్స్ బాధతులతో ఓ ఫ్యాషన్ షో నిర్వహించింది… ఇండో- చైనా శాంతి పేరిట మానస సరోవర్ యాత్రను లీడ్ చేసింది… ట్రంపు ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ పీస్ ఇనిషియేటివ్‌కు ఇండియా ప్రతినిధిగా హాజరైంది…
2022 మహాశివరాత్రి సందర్భంగా శివతాండవ స్తోత్రం వీడియో విడుదల చేసింది ఆమె… స్వీయగానం… 15 మిలియన్ల వ్యూస్… టీసీరీస్ కోసం ఆమె చేసిన మొదటి వీడియో ఫిర్ సే అమితాబ్ బచ్చన్ రిలీజ్ చేశాడు… మూడు రోజుల్లో 1.4 మిలియన్ వ్యూస్… ఇప్పటికి 5.1 మిలియన్ వ్యూస్ ఆ వీడియోకు… మహారాష్ట్ర నాలుగు నదుల కోసం ఓ ముంబై రివర్ ఆంథమ్ చేసింది… ఇలా చాలా…
లాన్ టెన్నిస్, ఓపెన్ టెన్నిస్ టోర్నీలకు చీఫ్ పాట్రన్… ఎప్పుడూ ఏదో ఓ యాక్టివిటీతో మీడియా స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటుంది… ఫ్యాషన్ డ్రెస్సులు, షోలు… కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లోనూ మెరిసింది… ఇలా…
ఓసారి నాగపూర్‌లోనే ఓ కామన్ ఫ్రెండ్ ఇంట్లో కలిశారు దేవేంద్ర ఫడ్నవీస్, అమృత… కాజువల్ టాక్ కాస్తా 90 నిమిషాలపాటు సాగింది… లవ్వులో పడిపోయారు… నిజానికి నాకు పొలిటిషియన్స్ మీద నెగెటివ్ ఒపీనియన్ ఉండేది… తనతో మాట్లాడక ఆ అభిప్రాయం మారింది అంటుందామె…
ఫడ్నవీస్ డౌన్ టు ఎర్త్ ఉంటాడు, కానీ పెళ్లికి ముందు, పెళ్లి తరువాత కూడా పెద్ద రొమాంటిక్ కాదు తను… తన పొలిటికల్ యాక్టివిటీస్ మీదే శ్రద్ధ అని ఏదో ఇంటర్వ్యూలో చెప్పింది… దేశంలోని ఇతర ముఖ్యమంత్రుల భార్యలతో పోలిస్తే ఖచ్చితంగా అమృతది డిఫరెంట్ స్టోరీ… ఇద్దరివీ వేర్వేరు కెరీర్లు… ఎవరి విజయాలు వాళ్లవే… ఎవరి క్రెడిట్స్ వాళ్లవే… ఫడ్నవీస్ ఎప్పుడూ ఏమీ అడ్డుచెప్పడు… ఇంట్రస్టింగు కపుల్..!!
Share this Article