.
ఒక డిజిటల్ పేపర్ అన్వేష్ గురించి ఒక పేజీ పూర్తిగా భజించి తరించిపోయింది… ఆ కథారచయిత ఎవరో గానీ ఒక్కసారి తన వీడియోలను కాస్త పరిశీలనగా చూసి ఉంటే బాగుండేది ఫాఫం…
తనను బెదిరిస్తున్నారని ఏదో తాజా వీడియో రిలీజ్ చేశాడు… ఎందుకు..? తన కారణంగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి సెలబ్రిటీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి కాబట్టి… తనను టార్గెట్ చేశారట…
Ads
నిజానికి సజ్జనార్ తీగ లాగితే డొంక కదులుతోంది… కానీ తను కూడా ఈ అన్వేషుడిని నెత్తికెత్తుకోవడం కాస్త మానేస్తే బెటర్… ఎందుకంటే..? ఓ మిత్రుడు కొన్ని వీడియోలు పంపించాడు తనవి… పరమ రోత వీడియోలు…
సొసైటీ, సంస్కారం, హుందాతనం ఎట్సెట్రా పదాలకు అర్థం తెలియనితనం అది… ఆ వీడియోలను ఇక్కడ పోస్ట్ చేయదలుచుకోలేదు… 50 దేశాల్లో ఆటగాడు అట తను… అర్థమైందా..? కాకపోతే మీరు అదృష్టవంతులు…
ఎస్, బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి ఓ విజల్ బ్లోయర్‌గా తనను అభినందిద్దాం… అంతే… కానీ ప్రపంచమంతా తిరిగాడు, 1400 వీడియోలు చేశాడు, కోట్లల్లో ఫాలోయర్స్, మస్తు సంపాదన… ఇదంతా నాన్సెన్స్…
నాణ్యతకూ, హుందాతనానికీ, సంస్కారానికీ పాపులారిటికీ, సంపాదనకూ పెద్ద లింకేమీ ఉండదు… పరమ చెత్తా జబర్దస్త్ స్కిట్స్‌కు కూడా మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి… దరిద్రగొట్టు యూట్యూబ్ అడ్మినిస్ట్రేషన్‌కు ఏమీ అర్థం కాదు, వాడికి తెలుగు రాదు…
వచ్చినా సరే, వాడికి కావల్సింది వ్యూస్, యాక్టివిటీ, జనమంతా వాడి వీడియోలు చూస్తూ ఉండటమే… ఇక్కడ చెప్పాలనుకున్న ఉద్దేశం ఏమిటంటే..? బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి తనను ఎవరో బెదిరిస్తున్నారనే సాకుతో కూడా ప్రమోషన్… వాడుకోవడం…
ప్రపంచమంతా తిరుగు… ఓకే… కానీ నిజమైన ట్రావెలాగ్ ప్రేమికులకు తెలుసు, అవెంత నాసిరకంగా ఉంటున్నాయో… కానీ ఎవరూ పెద్దగా విమర్శించరు… సరే, ఎవడి కడుపునొప్పి, ఎవడి ఉపాధి మార్గం వాడిది, చూసేవాడు చూస్తాడు, డబ్బులొస్తాయి, అంతే…
ఐనంతమాత్రాన నేను తోపు, ప్రపంచ ప్రసిద్ధ టూరిస్టును, ప్రపంచం మెచ్చిన వాడిని అనే ధోరణితో… బూతు, రోతను ప్రదర్శించినా సరే జనం చూస్తారు అనే భావన సరికాదు…
ఓ మిత్రుడు సరిగ్గా చెప్పాడు… జనానికి ఇప్పుడు మామూలుగా ఉంటే ఏదీ ఎక్కడం లేదు… కామెడీ, బూతు, ఏదైనా సరే, ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటేనే క్లిక్కవుతోంది అని… అవును, నిజమే… కానీ అది గ్రేట్‌నెస్ అనడానికేమీ లేదు…!! వీక్షకుల టేస్టును చూస్తూ నిట్టూర్చడం తప్ప..!!
అనవసరం కాదు, అసందర్భం కూడా కాదు ఇక్కడ… ఒక మిత్రుడున్నాడు… పోలిక, పేరు అక్కర్లేదు… కానీ తన కెమెరా, తను… దేశాలన్నీ తిరుగుతుంటాడు… భావుకుడు… ఎక్కడా వీసమెత్తు అసభ్యత, అశ్లీలం ఉండదు… అందంగా తన అనుభవాల్ని వ్యక్తీకరిస్తాడు కూడా… అవీ ట్రావెలాగ్స్ అంటే… అంతే తప్ప 50 దేశాల్లో ఆటగాడిని, నేనే తోపును అనే ధోరణి కాదు..!!
Share this Article