.
పొట్లూరి పార్థసారథి… మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా దేవేంద్ర సరిత గంగాధర్ రావు ఫడ్నవిస్ (Devendra Sarita Gangadharrao Fadnavis ) ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తెర వెనుక పనిచేసిన ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవడం అవసరం!
అతుల్ లిమాయే – Atul Limaye! …. అతుల్ లిమాయే ఇంజినీరింగ్ చదివి ఒక బహుళ జాతి సంస్థలో పనిచేస్తూ రాజీనామా చేసి, RSS ప్రచారక్ గా పనిచేయడం మొదలుపెట్టారు మూడు దశబ్దాల క్రితం! RSS ప్రచారక్ గా పనిచేయడం మొదలు పెట్టినప్పుడు లిమాయే వయసు 24 ఏళ్ళు!
Ads
మహారాష్టలోని నాశిక్ కి చెందిన లిమాయే ప్రాంత్ ప్రచారక్ గా పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతానికి పనిచేసి చాలా వేగంగా క్షేత్ర ప్రచారక్ స్థాయికి ఎదిగారు! RSS క్షేత్ర ప్రచారక్ పరిధిలో మహారాష్ట్ర, గోవా, గుజరాత్ ఉంటాయి!
అతుల్ లిమాయే మొదటి నుండి సంక్లిష్టమైన సాంఘిక – రాజకీయ అంశాల మీద దృష్టి పెట్టి పనిచేస్తూ వచ్చారు! హిందువులని సంఘటిత పరచడం, కులాల వారీగా విడిపోకుండా, హిందువుల ఓట్లు చీలకుండా చూడడమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు! ఇదేమి అంత తేలికగా అయ్యే పనికాదు!
ముఖ్యంగా ఆయా ప్రాంతాల కుల పెద్దలని కలిసి, వాళ్ళ సమస్యలని తెలుసుకొని, వాటికి పరిష్కార మార్గాలు చూపించి, బీజేపీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని బీజేపీ తరుపున తాను హామీ ఇస్తాను అని వాళ్ళని ఒప్పించి, ఓట్లు చీలకుండా చేశారు అతుల్ లిమాయే! ఈ కార్యక్రమం నెలల తరబడి సాగింది!
ఇక ట్రైబల్ ప్రాంతాలలో పర్యటించి, వాళ్ళ సమస్యలని గుర్తించి, వాళ్ళ పెద్దలతో మాట్లాడి, సమస్య పరిష్కారానికి అమలు చేయ తగ్గ హామీలు మాత్రమే ఇచ్చి, వాటిని అమలు చేయించే బాధ్యత తీసుకుంటాను అని వాగ్దానం చేశారు అతుల్ లిమాయే !
ఇలాంటి హామీలు ఇవ్వాలంటే మహారాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీద అవగాహన ఉండాలి లేకపోతే ఎదురు తన్నే అవకాశం ఉంటుంది! అతుల్ లిమాయేకి అవగాహన ఉంది!
క్షేత్ర స్థాయిలో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ అతుల్ లిమాయే గత 30 ఏళ్లుగా మారుమూల ప్రాంతాలలో పనిచేయడమే ధ్యేయంగా ఉంటూ వచ్చారు!
सजग रहो – Sajag Raho – సజగ్ రహో!
హిందూ వోటర్లని జాగృతం చేయడానికి ప్రతీ ఇంటికీ తిరుగుతూ, ఓటు ఎవరికి వేస్తే ఏమవుతుంది అనే స్పృహని కలిగిస్తూ, RSS కార్యకర్తలను పంపి ఓటింగ్ శాతం పెరిగేలా చూడడం వెనుక అతుల్ లిమాయే కృషి ఉంది! అయితే ఇది ఇప్పటికిప్పుడు చేస్తే అయే పని కాదు!
నిత్యం తనతో పాటు కార్యకర్తలను కూడా ప్రజలతో మమేకమై ఉండేట్లుగా చేశారు అతుల్ లిమాయె గత పదేళ్లుగా! కాబట్టి డోర్ TO డోర్ ప్రచారం, RSS కార్యకర్తలు తమతో తరచూ కలుస్తున్నవారే అవడం వలన ఓటర్లలో చైతన్యం వచ్చి ఓటింగ్ శాతం పెరిగింది!
2016-17 శివశక్తి సంగం!
2016 జనవరి 3 న మారున్జి గ్రామం, హింజే వాడి ( IT HUB) పూణె దగ్గర శివశక్తి సంగం పేరుతో RSS నిర్వహించిన కార్య్రమంలో లక్షా యాభైవేల మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. ఇతర రంగాల నుండి మరో 30 వేల మంది ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు! అతుల్ లిమాయే అప్పటి కార్యక్రమాన్ని నిర్వహించారు!
పశ్చిమ మహారాష్ట్రతో పాటు మరాట్వాడ ప్రాంతం నుండి స్వయం సేవకులు ఆనాటి కార్యక్రమానికి హాజరు కావడానికి క్షేత్ర ప్రచారక్ గా ఉన్న అతుల్ లిమాయే కృషి ఉంది! గత మూడు దశాబ్దాలుగా ఎన్నికల కోసం కాకుండా నిరంతరం గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో పని చేస్తూ వస్తున్నారు లిమాయే . అతుల్ లిమయేలాగా వేరే ఏ రాజకీయపార్టీ కూడా పని చేయలేదు. కష్టం ఒకరిది! లాభపడింది శివసేన – NCP !
Share this Article