.
భారత రాజకీయాల్లో… కాదు, అంతర్జాతీయంగా కూడా మతం తప్పకుండా ఓ టాపిక్… ప్రభావం చూపించగల అంశం… మతమే కాదు, మన రాజకీయాల్లో కులం కూడా ఇంపార్టెంటే… దురదృష్టవశాత్తూ ఇది రియాలిటీ…
ఇందిర కుటుంబం… నెహ్రూ కుటుంబం కానీ గాంధీ పేరుతో చెలామణీ… వరుసగా మూడు తరాలుగా… గాంధీ పేరు కలిసొస్తున్నది కాబట్టి…! ఇందిర పెళ్లి చేసుకుంది ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుంది… తనకూ గాంధీకి ఏ సంబంధమూ లేదు, తను పార్శీ…
Ads
తరువాత ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ఓ ఇటాలియన్ కేథలిక్ సోనియా గాంధీని పెళ్లి చేసుకున్నాడు… ఆమె కూతురు ప్రియాంక వాద్రా (గాంధీ కాదు) రాబర్ట్ వాద్రా (పంజాబీ హిందూ తండ్రి, క్రిస్టియన్ తల్లి)ని వివాహం చేసుకుంది…
కుటుంబ వారసత్వంలో మూడు ప్రధాని పదవులు… ఇప్పుడు రాహుల్ వైఫల్యాల కారణంగా… (తన వ్యక్తిగత, కుటుంబ జీవితంపై అనేక కథలున్నా, అధికారిక ధ్రువీకరణ లేదు…) ప్రియాంక పేరు మళ్లీ బలంగా తెర మీదకు వస్తోంది…
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే…. ప్రియాంకకు రాబోయే కోడలు, అంటే తన కొడుకు రైహాన్ వాద్రా కాబోయే భార్య ఓ ముస్లిం… మొత్తం కుటుంబం మిశ్రమ సంస్కృతి… (హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్శీ)… ఆ కుటుంబంలోకి వచ్చే అమ్మాయి పేరు అవీవా బేగ్… (Aviva Baig)…
అవివా బేగ్ 2026 జనవరి ప్రారంభంలో రాజస్థాన్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో పెళ్లి చేసుకోనున్నట్లు చెబుతున్నారు…

ఎవరు అవీవా బేగ్..?
-
వృత్తి….: అవీవా బేగ్ ఒక వృత్తిపరమైన ఫోటోగ్రాఫర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్… ఆమె ‘అటెలియర్ 11’ (Atelier 11) అనే ఫోటోగ్రఫీ స్టూడియో, ప్రొడక్షన్ కంపెనీకి సహ వ్యవస్థాపకురాలు…
-
చదువు…: ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె, తర్వాత ఓ.పి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుండి మీడియా కమ్యూనికేషన్, జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందింది…
-
ఆసక్తులు…: ఆమెకు ఆర్ట్, ఫోటోగ్రఫీ అంటే చాలా మక్కువ… గతంలో ఆమె జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి కూడా…
-
కుటుంబం…: ఆమె తండ్రి ఇమ్రాన్ బేగ్ ఒక వ్యాపారవేత్త, తల్లి నందిత బేగ్ ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్…. వీరి కుటుంబం దశాబ్దాలుగా వాద్రా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంది…
రైహాన్ – అవీవా ప్రేమ కథ:
-
వీరిద్దరూ గత 7 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు… రైహాన్ కూడా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావడంతో, కళలు, ఫోటోగ్రఫీ పట్ల ఉన్న సమాన ఆసక్తి వీరిద్దరినీ కలిపింది…
-
రీసెంటుగా రైహాన్ ఆమెకు ప్రపోజ్ చేయగా, ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం జరిగింది…
నిశ్చితార్థం వివరాలు:
ఈ నిశ్చితార్థ వేడుక చాలా ప్రైవేట్‌గా జరిగింది…. ప్రస్తుతం గాంధీ, వాద్రా కుటుంబ సభ్యులు రాజస్థాన్‌లోని రణతంబోర్‌లో ఉన్నారని, అక్కడ మరిన్ని వేడుకలు జరగవచ్చని వార్తలు… వివాహం వచ్చే ఏడాది (2026)లో జరిగే అవకాశం ఉంది…
గాంధీ-నెహ్రూ కుటుంబంలోని వైవాహిక సంబంధాలు ఎప్పుడూ భారతదేశంలో పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తూనే ఉంటాయి… ఈ “మిశ్రమ సంస్కృతుల” పరంపరను గమనిస్తే, అది ఒక ప్రత్యేకమైన మతాతీత క్రమాన్ని సూచిస్తుంది….

1. “ఈ కుటుంబం భారతీయ మూలాలకు లేదా హిందూ సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వదు” అనే విమర్శ ఎంతోకాలంగా చర్చల్లో ఉన్నదే… ఎన్నికలు రాగానే ప్రియాంక గంగాస్నానాలు, రాహుల్ గోత్ర- జంధ్య ప్రదర్శన ఎప్పుడూ చర్చనీయాంశమే…
2. మరోవైపు, కాంగ్రెస్ మద్దతుదారులు దీనిని ‘అసలైన భారతదేశం’ (Mini India)గా అభివర్ణిస్తారు… అన్ని మతాలు, కులాలు, సంస్కృతులను కలుపుకుపోయే “వసుధైక కుటుంబం” అని, ఇది గాంధీ కుటుంబం (నెహ్రూ కుటుంబం) లౌకిక (Secular) తత్వానికి నిదర్శనమని వారు వాదిస్తారు…
3. ప్రస్తుత కాలంలో వాట్సాప్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి… ముఖ్యంగా ‘అవీవా బేగ్’ పేరు బయటకు రాగానే, భవిష్యత్తులో గాంధీ వారసత్వం ఏ మతం వైపు వెళ్తుంది అనే చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి… అవీవా బేగ్ పేరు కాస్తా అవీవా గాంధీ అవుతుందా..? లేక అవీవా బేగ్ వాద్రా గాంధీ అని మారుస్తారా అనే జోకులు కూడా..!
వ్యక్తిగత కోణం: రాజకీయాలు పక్కన పెడితే, రైహాన్- అవీవా ఇద్దరూ కూడా ఆధునిక భావాలు గల ఆర్టిస్టులు… కళలు, ఫోటోగ్రఫీ వంటి ఉమ్మడి ఆసక్తుల వల్ల వారు ఒక్కటయ్యారు… ప్రియాంక కూడా కొడుకును రాజకీయ తెరపై ఉంచదు… తనకూ రాజకీయాలపై ఆసక్తి లేనట్టుంది… కానీ గాంధీ – నెహ్రూ కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా దేశవ్యాప్త చర్చకు దారితీయడం సహజం కదా… అందుకే అవీవా బేగ్ కూడా వార్తల్లో వ్యక్తే..!!
Share this Article