.
Mohammed Rafee ……. భగవాన్ శ్రీరామ్ సర్!
భగవాన్ శ్రీరామ్ సార్ గురించి పరిచయం చేయండి అని అడుగుతున్నారు చాలామంది!
అందెశ్రీని కదిలిస్తే ఆయన శ్రీరామ్ సార్ గురించి ఎన్నో చెబుతారు! ఆయనే కాదు, సార్ ను ఫాలో అయ్యే ఎందరో పారిశ్రామికవేత్తలు, సినీ స్టార్స్, బ్యూరోక్రాట్స్ నుంచి సామాన్యుల వరకు శ్రీరామ్ సార్ ను శ్రీరాముడి వారసుడే అనుకుంటారు! అంతే అభిమానం ప్రేమతో ఆరాధిస్తుంటారు!
Ads
శ్రీరామ్ ను అందరూ గౌరవంగా శ్రీరామ్ సార్ అని పిలుస్తారు! ఆయన నిజంగానే సార్! ఇంగ్లీష్ అధ్యాపకులుగా ఉద్యోగం చేసి పదవీ విరమణ పొంది పదేళ్లు అయ్యింది! ఆయన వయసు 68 సంవత్సరాలు.
గద్వాల్ దగ్గరలో మల్డకల్ గ్రామంలో జన్మించారు. వారి ఇంటిపేరు గాజుల! తలిదండ్రులు శ్రీరాములు అని పేరు పెట్టారు! ఆయన భగవంతుడి కృపతో శ్రీరామ్ సర్ గా ప్రసిద్ధి పొందారు!
ఆయన చాలా సింపుల్ గా ఉంటారు! ప్రచారాలు ఇష్టం ఉండదు! పొగడ్తలు నచ్చవు! అంతా దైవలీల అంటుంటారు! ఆయన నుంచి ఎన్నో అద్భుతాలు జరిగినా ఒకే ఒక్క విషయం ప్రస్తావిస్తాను! ఉస్మానియా యూనివర్సిటీలో పిజి చేస్తున్నప్పుడు వారి గురువు గారు ఆంగ్ల అధ్యాపకులు ఆచార్య బి.శివరామకృష్ణ గారు! కట్ చేస్తే ఆ గురువుకే గురువర్యులు అయ్యారు శ్రీరామ్ సర్! అలా ఆ స్థాయికి చేరుకోవడం అంత సులభం కాదు! గురువుకే గురువు కావడం ఎంతో పూర్వ జన్మ సుకృతం!
శ్రీరామ్ సర్ ను కలిసి రెండు నిముషాలు వారితో మాట్లాడటమే అదృష్టభాగ్యంగా ఎందరో భావిస్తారు! అది వారి ఆధ్యాత్మిక సుగుణాభరణం! విశ్వంతో ఆయనకు వున్న అనుబంధం ఆశ్చర్యం! ఆయన మాటకు వున్న సంకల్ప బలం అనన్య అసామాన్యం!
అసలు శ్రీరామ్ సార్ గురించి నేను రాయకూడదు! నాకు ఆయన గురించి రాసే అర్హత లేదు! ఆయన్ని విశ్లేషించే శక్తి లేదు! ఆయన లోతైన అంతరంగాన్ని పట్టుకోవడం ఎవరి తరం కాదు! అది ఆయనకు భగవంతుడికి మధ్య వున్న బంధం!
శ్రీరామ్ సార్ ను నేను ఒక్కసారే చూశాను! ఆయనలో ఆ క్షణమే దైవత్వం కనిపించింది! ఆయన రచించిన అద్భుతం వివేక స్రవంతి! ఏ జర్నీ ఇన్ టు జాయ్! జస్ట్ ఆయన తన శిష్యులకు రాసిన లేఖలు అవి! అదొక్కటి చదివితే చాలు ఆయన్ని విశ్వ గురువుగా కొండొకచో మనిషి రూపంలో వున్న దేవుడిగా భావించి తీరాల్సిందే!
ఆయన పండితుడే కానీ జ్యోతిష్య పండితులు కారు! జరగబోయే జోస్యం చెప్పరు! గాలిలో దీపం పెట్టే మాటలు చెప్పరు! జరిగేది చెబుతారు! కాస్మిక్ బ్లూ ప్రింట్ కళ్ళ ముందుంచుతారు! అది జరిగి తీరాల్సిందే! అదే ఆయన విశ్వంతో సాధించిన అనుబంధం! అదే ఆయన సంకల్ప బలం! అదే ఆయన మహత్తు!
ఆయన రచించిన ఫ్రాగ్రన్స్ ఆఫ్ లవ్! ఇది నన్ను కట్టి పడేసిన పుస్తకం! ఆయన తన గదిలో ఉండి భూగోళాన్ని సందర్శించే శక్తిని సాధించారు! ఆయన జీవితాలను మార్చేస్తారు! ప్రజలకు స్ఫూర్తినిస్తారు! బాధితులను ఓదారుస్తారు! విరిగిన హృదయాలను కలుపుతారు! కానీ, అది తన గొప్పతనం కాదని ఎంతో ఒదిగి ఉంటారు! తాను నిమిత్తమాత్రుడిని అంటుంటారు! ఆశ్చర్యం అనిపిస్తుంది! మనుషుల్లో ఇలాంటి వారు కూడా వుంటారా అనిపిస్తుంది!
శ్రీరామ్ సార్ ప్రకృతిని ప్రేమిస్తారు! శాంతిని కోరుకుంటారు! ప్రేమను పంచుతారు! చిన్న పిల్లాడిలా అనిపిస్తారు! ఈ ప్రపంచంలో ఏది స్వేచ్ఛ గా ఏర్పడింది కాదు! ముందుగా నిర్ణయించబడిందే అని ఆయన చెబుతారు! ఆయన చెప్పినట్లే జరగడం యాదృచ్చికమో ఏమో తెలియదు కానీ, జరిగి తీరుతోంది! అందుకే అందెశ్రీ ఆరోజు శ్రీరామ్ సార్ వర్షం ఆపేశారు అని అనేశారు! అందులో నిజం వుంది! అలా జరిగింది! అది నమ్మకం! మూఢ నమ్మకం అయితే కాదు!
ఇలాంటి మిరాకిల్స్ ఎందరికో ఎన్నో జరిగాయి కాబట్టి శ్రీరామ్ సార్ మనుషుల్లో దేవుడు అయ్యారు! గూగుల్ సెర్చ్ చేసి ఆధ్యాత్మికవేత్త భగవాన్ శ్రీరామ్ సర్ వీడియోలు చూడండి! Sriramam, tirumalesa వెబ్ సైట్స్ చూడండి! హైదరాబాద్ లో నివసించే వారిని కలిసేందుకు ప్రయత్నించి చూడండి! మీలో మార్పు మీకే తెలుస్తుంది! – డా. మహ్మద్ రఫీ
Share this Article