ఎవరు ఈ బిపిన్ రావత్..? దేశమంతా జనం సెర్చ్ చేస్తున్న ప్రశ్న..! ఆయన తన కుటుంబసభ్యులతో, వ్యక్తిగత సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ కూనూరు అడవుల్లో కూలిపోవడం, ప్రమాదతీవ్రత దృష్ట్యా అందులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది… కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమై ఈ ప్రమాదంపై సమీక్షించింది… బిపిన్ సతీమణి మధూలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది… రావత్‌ను మరింత మెరుగైన చికిత్స కోసం తరలించారు… ఈ వార్త రాసే సమయానికి ఛాపర్‌లో ఉన్న పద్నాలుగు మందిలో 11 మంది మరణించారని ఇండియాటుడే వార్త… రావత్ వెల్లింగ్‌టన్ మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడనీ సమాచారం… ఇందులో కుట్ర కోణం ఏమీ లేకపోవచ్చునని, సాంకేతిక వైఫల్యం, అననుకూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందనీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్టు చెబుతున్నా… వాయుసేన దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది… మరో 10 నిమిషాల్లో గమ్యం చేరే పరిస్థితిలో హఠాత్తుగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది… అసలు ఎవరీయన..?
ఈ దేశపు మొట్టమొదటి త్రివిధ దళాధిపతి… చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్… మీకు తెలుసు కదా… మన దేశంలో ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వేర్వేరు… కంబైన్డ్ చీఫ్ ఎవరూ ఉండేవాళ్లు కాదు… ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన రావత్‌ను మోడీ ప్రభుత్వం కొత్తగా త్రివిధ దళాధిపతి పోస్ట్ క్రియేట్ చేసి మరీ బాధ్యతలు అప్పగించింది… అంటే మన దేశ రక్షణకు అల్టిమేట్ ఫీల్డ్ బాస్ ఆయన… ఇండియన్ మిలిటరీలో హయ్యెస్ట్ పోస్ట్… మూడు విభాగాల నడుమ సరైన సమన్వయం, మార్గదర్శనం, ప్లానింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు… పలు సందర్భాల్లో ప్రత్యర్థి దేశాలకు బలమైన కౌంటర్లు ఇస్తూ, సరిహద్దుల్లో జవాన్లను కలుస్తూ, రావత్ తనదైన ముద్ర వేస్తున్నాడు కొన్నాళ్లుగా… కానీ బ్యాడ్ లక్… 63 ఏళ్ల వయస్సులో ఈ అనుకోని ప్రమాదానికి గురయ్యాడు…
Ads
1978లో గూర్ఖా రైఫిల్స్ విభాగం సర్వీసులో చేరిన ఆయన పొందని మెడల్స్ లేవు… పరమ విశిష్ట సేవా మెడల్ దాకా అందుకున్నాడు… డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ చేసిన ఆయన మేనేజ్‌మెంట్, కంప్యూటర్ స్టడీస్‌లో డిప్లొమాలు కూడా పొందాడు… తరువాత మీరట్ యూనివర్శిటీ నుంచి మిలిటరీ-మీడియా స్ట్రాటజిక్ స్టడీస్‌లో రీసెర్చ్‌కు గాను డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ తీసుకున్నాడు… ఉత్తరాఖండ్ ఘర్‌వాలీ రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన ఆయన పూర్వీకులు కూడా చాలా తరాలుగా సైన్యానికి సేవలు అందిస్తున్నవారే… ఈయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ కూడా ఓ లెఫ్టినెంట్ జనరల్… ఆయన ప్రయాణిస్తున్నది ఎంఐ సీరీస్ హెలికాప్టర్… ఎంఐ-17 వీ-5… రష్యన్ మేడ్… అత్యంతాధునిక మిలిటరీ ఛాపర్… వీవీఐపీల ప్రయాణాలకు కూడా దీన్నే ఉపయోగిస్తుంటారు ఎక్కువగా… ఎక్కువ ఎత్తులో వెళ్లడానికి, భద్రతకు ఈ ఛాపర్లు నమ్మదగినవి అని మిలిటరీ ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు… ఇండియా ఇలాంటివి 80 చాపర్స్ కొనుగోలు చేసింది… జంట ఇంజన్లతోపాటు ఆయుధవ్యవస్థను కూడా కలిగి ఉంటాయి… 2015లో ఆయన లెఫ్టినెంట్ జనరల్‌గా ఉన్నప్పుడు నాగాలాండ్‌లో చీతా ఛాపర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు… అప్పుడు ఇంజన్ ఫెయిల్యూరే సమస్య… నలభై ఏళ్లుగా ఈ దేశరక్షణలో ఉన్న మన సైన్యాధిపతి క్షేమంగా బయటపడాలని కోరుకుందాం…
Sorry sir… We miss you…. Last update confirms that he is no more … His wife Madhulika also lost her life…
Share this Article