నిన్నటి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఫోటోల్లో చాలామందిని ఆకర్షించింది చిరాగ్ పాశ్వాన్… తను ప్రమాణం చేస్తున్నప్పుడు కూడా చప్పట్లు, కేకలు… మొన్న ఎన్డీయే మీటింగులో మోడీ తనను ఆప్యాయంగా హత్తుకుని అభినందిస్తున్నప్పుడే అర్థమైపోయింది ఈసారి చిరాగ్ పాశ్వాన్‌కు ప్రయారిటీ దక్కబోతున్నదని…
అంతకుముందే ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది… కంగనా రనౌత్‌తో చిరాగ్ 2011లో ఓ సినిమా చేశాడు… అప్పట్లో వాళ్లిద్దరూ కేవలం సినిమా నటులే… ఆ సినిమా ఫోటోయే ఇప్పుడు వైరల్… ఇప్పుడు కంగనా రనౌత్ మండీ నుంచి ఎంపీగా గెలిచింది… తనూ డైనమిక్… ముంబైలో శివసేన గ్యాంగులు, బాలీవుడ్ మాఫియా, ప్రభుత్వంతో ఓ పోరాటమే చేసింది…
ఆ సినిమా పేరు మిలే నా మిలే హమ్… సినిమా ఫ్లాప్… ఈ ఫీల్డ్ నాకు అచ్చిరాదని అర్థమైంది చిరాగ్‌కు… అప్పటికే తను ఇంజనీరింగ్ కాలేజీ డ్రాపవుట్… ఇక తర్వాత కాలంలో రాజకీయాల్లోకి ఎంట్రీ, తండ్రి అడుగుజాడల్లో వారసత్వం కొనసాగింపు అనివార్యమయ్యాయి… తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ బీహార్ రాజకీయాల్లో ఏళ్లుకేళ్లుగా ప్రముఖ దళిత నాయకుడు… హజిపూర్‌లో వరుసగా అనేకసార్లు ఎంపీ… అదే సీటు నుంచి ఇప్పుడు చిరాగ్ ఎంపీ…
Ads
పోటీచేసిన అయిదు సీట్లలోనూ గెలిచింది తన పార్టీ… పార్టీ పేరు ఎల్‌జేపీఆర్వీ… అంటే లోకజనశక్తి (రాంవిలాస్)… పాలిటిక్సులోకి వచ్చాక బాగా తడబడ్డాడు… కొన్నాళ్లు అండదండగా ఉండి నడిపించాల్సిన అంకుల్ పశుపతి కుమార్ పరస్ చిరాగ్‌కు వెన్నుపోటు పొడిచాడు… పార్టీని పూర్తిగా హైజాక్ చేశాడు… దాదాపు పార్టీ మొత్తం తన వైపు వెళ్లిపోయిన స్థితిలో చిరాగ్ కళ్లు తెరిచి, పార్టీ పేరుకు తన తండ్రి పేరు కూడా జోడించి, కొత్త ఇంటికి ఒక్కొక్క కొత్త ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాడు…
ఇప్పుడు ఐదు స్థానాలూ గెలవడం, తనకు ద్రోహం చేసినవాళ్లంతా దుమ్ముకొట్టుకుపోవడం, తను కేంద్ర మంత్రి కావడం, ఎన్డీయేలో మోడీ నుంచి ఆదరణ ఖచ్చితంగా తనకు బూస్టప్… అసలే బీహార్ పాలిటిక్స్ సంక్లిష్టంగా ఉన్నయ్… లాలూ వారసుడు తేజస్వి ఈసారి కూడా పెద్దగా క్లిక్ కాలేదు… అంటే, అఖిలేష్ బాగా పుంజుకున్నాడు యూపీలో… ఆ రేంజ్‌లో తను ఎదగలేకపోయాడు…
మరోవైపు బీజేపీ కూడా సొంతంగా అధికారాన్ని కైవసం చేసుకునే స్థాయికి పెరగలేకపోయింది… ఇదంతా జేడీయూ నితిశ్‌కు లాభిస్తోంది… కానీ తను చంచల మనస్కుడు… అధికారం కోసం అటూఇటూ జంపుతాడు… అది తన విశ్వసనీయతను దెబ్బతీసింది… తన మీద ప్రజల్లో కూడా వ్యతిరేకత స్టార్టయింది… ఈ స్థితిలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ మరిన్ని మంచి ఫలితాల్ని ఆశిస్తున్నాడు… బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నాడు… గుడ్, బెస్టాఫ్ లక్ చిరాగ్…
Share this Article