బహుశా ఈ స్టోరీ రాయడం పూర్తయ్యేసరికి రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరో తేలిపోవచ్చు… వరుసగా పలు సామాజిక ప్రయోగాలు చేస్తున్న బీజేపీ హైకమాండ్ ఈ రాష్ట్రంలోనూ బలహీనవర్గాల నుంచి ఓ కొత్త మొహాన్ని తీసుకురావచ్చు… మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో చేసినట్టే రాజస్థాన్‌లో కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఈరోజు… మంచిదే కానీ… ఈ అందమైన మొహం కథ కాస్త ఆసక్తికరం…
ఈమె పేరు దియాకుమారి… జైపూర్ రాజసంస్థానం వారసురాలు… రాచకుటుంబం… లోకసభ సభ్యురాలు… అంతులేని సంపదను కాపాడుకుంటోంది… తనే స్వయంగా మేనేజ్ చేస్తుంటుంది ఆస్తులన్నీ… జైపూర్ సంస్థానపు చివరి మహారాజు మాన్ సింగ్ -2 మనమరాలు ఈమె… ఇప్పుడు ఈమె రాజస్థాన్ ముఖ్యమంత్రి పోటీదారుల తెర మీదకు వచ్చింది…
Ads
ఆ రాష్ట్రంలో వసుంధర రాజె సింధియా అనబడే ఓ టెంపర్ మహారాణి ఉంది… ఆమెకు బీజేపీలో ఓ వర్గం… అసలు రాజస్థాన్ బీజేపీ చేజారడమే ఆమె వల్ల అనే విమర్శ కూడా ఉంది… ఇప్పుడు కూడా కొంతమందితో ఓ వర్గాన్ని కూడగట్టి హైకమాండ్‌కు చిరాకెత్తిస్తోంది… పార్టీని నష్టపరిచింది… ఈ స్థితిలో ఆ మెంటల్ రాణికి చెక్ పెట్టాలంటే ఈ దియాకుమారి అనే రాణిని సీఎం చేస్తారా అనేది ఓ ప్రశ్న… పైగా రాజస్థాన్ రాజకీయాల్లో ఈరోజుకూ రాజుల ప్రాబల్యం ఎక్కువ…
కాకపోతే రాణివాసపు ఆడంబరాలు, అట్టహాసాలు ఎక్కువ ఈ దియాకుమారి దగ్గర… ఈరోజుకు ఆ రాచవైభోగాన్ని ఎంజాయ్ చేస్తుంటుంది… ఆమె నివాసం చూస్తారా ఓసారి… సిటీ ప్యాలెస్… ఇదుగో…
ఆమె ప్రదర్శన ఇదుగో ఇలా ఉంటుంది…
అప్పట్లో వరల్డ్ ఫేమస్, టాప్ టెన్ అందగత్తెల్లో గాయత్రిదేవి ఉండేది… ఇందిరాగాంధీకి ఆమె అందం చూసి కుళ్లు… జైలులో వేయించింది, సతాయించింది… ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చింది… ఆమె ఈ దియాకుమారికి సవతి మామ్మ… సరే, ఆ కథ వేరు… ఇంకెప్పుడైనా చెప్పుకోవచ్చు… కానీ ప్రస్తుతం బీజేపీలో సీఎం రేసులో గజేంద్ర సింగ్ షెకావత్, సీపీ జోషి, అశ్విని వైష్ణవ్, మహంత్ బాలక్‌నాథ్, దియా కుమారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి…
వీరిలో బాలక‌్‌నాథ్ గురించి మనం చెప్పుకున్నాం, ఆయన రాజస్థాన్‌లో మరో యోగి టైపు… అదే నాథ్ సంప్రదాయపు గురుపరంపర, సచ్చీలుడు… తను సీఎం రేసులో ప్రస్తుతం లేడని అంటున్నారు… షెకావత్, జోషి, దియా… ఇలా అందరూ అగ్రవర్ణాలే… వసుంధర సరేసరి… ఆమెను గనుక మళ్లీ సీఎంను చేస్తే బీజేపీ చేజేతులా పార్టీకి నష్టం చేసినట్టే అవుతుంది… అందుకని ఓ కొత్త మొహం అవసరం… అది దియాకుమారి కావచ్చు, కాకపోవచ్చు కూడా… కానీ బీజేపీలో వసుంధరలు వెళ్లిపోతే పోవచ్చు గాక… దియాకుమారి మంచి పొజిషన్‌లోనే ఉంటుంది…
Share this Article