మీకు మరో ఇన్‌స్పయిరింగ్ పర్సనాలిటీని పరిచయం చేస్తాను… సోషల్ మీడియాలో, తద్వారా సొసైటీలో పాజిటివిటీ స్ప్రెడ్ చేసే పోస్టులు అవసరం కాబట్టి… ఇలాంటి వ్యక్తుల గురించి ప్రపంచానికి తెలియాలి కాబట్టి…
పరిచయం అంటే… జస్ట్, క్లుప్తంగా ఆయనెవరో చెప్పేస్తాను… కానీ ఆయన సొంత ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబు ఖాతాలను సందర్శించి తను స్వయంగా చేసిన వీడియోలు, పెట్టిన పోస్టులు, అనేక వైద్యపరమైన అంశాలపై తన అభిప్రాయాలు, సూచనల్ని…. ప్రత్యేకించి పిల్లలతో ఉన్న తన వీడియోలు చూడాలి… కడుపు నిండిపోతుంది…
సాధారణంగా ఇంజక్షన్ అంటేనే చాలామందికి వణుకు… భుజంపై దూదితో స్పిరిట్ కూడా రాయకముందే కళ్లు గట్టిగా మూసుకుని, చేతులు బిగపట్టుకుని, మొహం ముడుచుకుని ఠారెత్తిపోతారు… మరి పసిపిల్లలు..? వాళ్లకే కాదు, వాళ్లను హాస్పిటల్‌కు వేక్సినేషన్ కోసమే, ఇతరత్రా వైద్య అవసరాల కోసమే ఇంజక్షన్ తీసుకెళ్లే పెద్దలకూ నొప్పే… పిల్లల ఏడుపు చూసి…!
Ads
ఇంజక్షన్ చేశాక వాళ్లను సముదాయించేసరికి తలప్రాణం తోకకొస్తుంది… పిల్లలు కదా…! కానీ ఈ డాక్టర్ వాళ్లను లాలిస్తాడు, పాటలు పడతాడు, ఆడుకుంటాడు, నవ్విస్తాడు, పిల్లలు ఆనందంగా తన దారిలోకి రాగానే సూది తెలియకుండా పొడిచేస్తాడు… పాప అలా నవ్వుతూనే ఉంటుంది… రేర్ వీడియోస్… రేర్ డాక్టర్… రేర్ స్టయిల్… నిజం చెప్పొద్దూ, కొన్ని వీడియోలు చూశాక ఈ డాక్టర్ మనకు కూడా తెలియకుండా ఏదో ఫన్ అండ్ జాయ్ ఇంజక్షన్ గుచ్చేశాడని అనిపిస్తుంది…
తన పేరు డాక్టర్ ఇమ్రాన్ పటేల్… గుజరాత్, అహ్మదాబాద్… మొదట్లో ప్రభుత్వ హాస్పిటల్స్‌లో చేశాడుట… మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పాఠాలు కూడా చెప్పాడట… ప్రస్తుతం తనే ఆసియన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పెట్టేసుకున్నాడు… ఈయన ప్రత్యేకించి చిన్న పిల్లలు, శిశువుల వైద్యుడు… వాళ్లకు సంబంధించి అన్ని సమస్యల్నీ డీల్ చేస్తుంటాడు…
https://www.facebook.com/imran.patel.12139862
దిగువన లింక్ తన ఇన్‌స్టా ఖాతా…
ఈ లింక్ మాత్రమే కాదు, తన ఇన్‌స్టా, యూట్యూబ్ ఓసారి లుక్కేయండి… రీల్స్, షార్ట్స్ కూడా బోలెడు… పెద్ద ఉపోద్ఘాతాలు, కథనాలు అవసరం లేదు… ఫీల్ దట్ పాజిటివిటీ… అబ్బే, కసుక్కున ఓ సూది పొడిచేస్తే సరిపోయేదానికి ఇంత అవసరమా అని తేలికగా తీసిపడేయకండి… అదెంత కష్టమో శిశువుల్ని హాస్పిటల్స్‌కు ఇంజక్షన్ల కోసం తీసుకెళ్లే పేరెంట్స్‌ను అడగండి చెబుతారు…
డాక్టర్ కొత్త మొహమైనా సరే, ఎంత వేగంగా శిశువులు, పిల్లలు తనకు అంతగా ఎలా మాలిమి అయిపోయి నవ్వేస్తారో ఆశ్చర్యం వేస్తుంది… నీకు అభినందనలు భయ్యా… అన్నట్టు చెప్పడం మరిచిపోయాను… ఫేస్ బుక్‌లో తన ఫాలోయర్ల సంఖ్య జస్ట్, 26 లక్షలు..!! ఇన్‌స్టాలో 57 లక్షలు… వేల మాటలేల, ఈ అంకెలు అన్నీ చెప్పేస్తున్నాయి కదా..!!
Share this Article