.
అస్సోం రాజకీయాల్లో ఎప్పుడూ అక్రమ వలసలు ఓ ముఖ్యాంశం… ఇప్పుడు ఓ కొత్త అంశం రాజకీయ రచ్చకు దారితీస్తోంది… కాంగ్రెస్ పార్టీని కూడా బీజేపీ ఇరుకునపెడుతోంది ఈ అంశంపై…
ఎలిజబెత్… Elizabeth Colburn… జన్మతః ఈమె బ్రిటిషర్… లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎకానమీ సబ్జెక్టులో మాస్టర్స్ చేసింది… 2013లో గౌరవ్ గొగోయ్‌ను పెళ్లి చేసుకుంది…
Ads
ఎవరు ఈ గౌరవ్ గొగోయ్..? అస్సాంకు దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన తరుణ్ గొగోయ్ కొడుకు… న్యూయార్క్ యూనివర్శిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశాడు… ఎలిజబెత్‌కు, గౌరవ్‌కూ నడుమ పరిచయాలు, ప్రణయాలు ఎక్కడ మొదలయ్యాయో తెలియదు…
ప్రస్తుతం గౌరవ్ లోకసభ ప్రతిపక్ష పార్టీ డిప్యూటీ లీడర్… ఇప్పుడు వివాదం ఏమిటంటే..? నేరుగా అస్సోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మే స్వయంగా కొన్ని ఆరోపణలు చేశాడు… ‘‘ఎలిజబెత్‌కు పాకిస్థాన్‌కు చెందిన అలీ తౌకీర్ షేక్‌తో మన దేశవ్యతిరేక సంబంధాలు ఉన్నాయి’’ అని…
ఈ అలీ తౌకీర్ షేక్ ఎవరు..? పాకిస్థాన్ ప్లానింగ్ కమిషన్ సలహాదారు… తను ఐఎస్ఐ కోసం పనిచేస్తాడనీ, తనతో గౌరవ్ భార్య సంబంధాలు సందేహాస్పదంగా ఉన్నాయనీ బీజేపీ ఆరోపణ… అస్సోం బీజేపీ నేతలు పదే పదే వీటిని బలంగా వినిపిస్తున్నారు… గౌరవ్ మాత్రం కొట్టిపారేస్తున్నాడు… బీజేపీ ఆరోపణలు హాస్యాస్పదం అని…
‘‘నా భార్య ఐఎస్ఐ ఏజెంట్ అంటారు, నన్ను రా ఏజెంట్ అనండి… మీకు రాజకీయంగా ఎవరు పడకపోతే వాళ్ల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం మీకు అలవాటైపోయింది’’ అని తోసిపుచ్చాడు… కానీ బీజేపీ వదల్లేదు… ఆమె ఢిల్లీ కేంద్రంగా ఉన్న Climate and Development Knowledge Network (CDKN) (ఎన్జీవో) కోసం వర్క్ చేసిందనీ, చాన్నాళ్లు పాకిస్థాన్‌లో ఉందనీ, అప్పుడే ఐఎస్ఐ ఏజెంట్ అలీ తౌకీర్ షేక్‌తో పరిచయమనీ ఆరోపిస్తోంది…
ఆమెకు US సెనేట్, UN సెక్రటేరియట్ మరియు టాంజానియా మరియు దక్షిణాఫ్రికాలోని NGO లలో పనిచేసిన అనుభవం కూడా ఉంది… ఆమె సందేహాస్పద సంబంధాలపై ఓ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది అస్సోం ప్రభుత్వం ప్రస్తుతం… ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో, విజిలెన్స్ సూపరింటిండెంట్ రోజీ కలితా సారథ్యంలో పనిచేసే ఈ సిట్ ఆమె విదేశీ పౌరసత్వం, వీసా రికార్డులతోపాటు పాకిస్థాన్‌లో గతంలో ఏం చేసేది, అలీ తౌకీర్ షేక్‌తో సంప్రదింపులు, సంభాషణలపై దర్యాప్తు చేస్తోంది…
ఆల్రెడీ ఆ టీమ్ ఢిల్లీలో తిరుగుతోంది ఇదే పనిమీద… వచ్చే ఏడాది అస్సోం అసెంబ్లీ ఎన్నికలున్నాయి కదా… ఇదంతా క్రమేపీ రాజకీయ రచ్చగా మారుతోంది… అలీ తౌకీర్ షేక్ ఢిల్లీలోనూ పర్యటించేవాడు… ఎక్కడ ఉండేవాడు..? తన కార్యకలాపాలేమిటో కూడా ఈ సిట్ విచారిస్తుంది…
నేషనల్ సెక్యూరిటీ అంశం కాబట్టి, ఈ కేసు విచారణకు ఈ సిట్ స్థాయి సరిపోకపోతే ఎన్ఐఏకు అప్పగించాలని అస్సోం ప్రభుత్వ ఆలోచన… ఆల్రెడీ రా కూడా ఈ వివరాల సేకరణలో ఉందనే వార్తలూ వస్తున్నాయి…
Share this Article