.
దేవుడు ఉన్నాడా? లేడా? అనేది చాలా పెద్ద చర్చ
ఎందుకంటే దేవుడు అందరికీ కనిపిస్తే అసలు ఈ చర్చే లేదు
దేవుడ్ని నమ్మే వాళ్ళ అనుభవాలు ఒకరకంగా ఉంటాయి
నమ్మని వాళ్ళ అనుభవాలు ఇంకో రకంగా ఉంటాయి
అందరికీ ఒకే రకమైన అనుభవాలు ఉండాలని రూలేమి లేదు
నన్ను గిల్లితే నొప్పి నాకే తెలుస్తుంది
పక్కోడికి తెలీదు
అంతమాత్రం చేత నా నొప్పి అబద్ధం అని కాదు కదా
అలాగే భగవంతుడి విషయం కూడా
Ads
నావరకు నాకు ఈ విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి ఏదో ఉందని నమ్మకం
ఆ శక్తి కే దేవుడు అని పేరు పెట్టారని అనుకుంటా
కనిపిస్తేనే దేవుడు ఉన్నట్టు లేకపోతే దేవుడు లేనట్టు అనే వాదన కూడా అంగీకార యోగ్యంగా లేదు
తన బిడ్డ ఎక్కడ ఉన్నా తల్లి బిడ్డ క్షేమమే కోరుకుంటుంది
అలాగే దేవుడు కూడా బిడ్డ క్షేమమే కోరుకుంటాడు
చిన్నప్పుడు చూడండి మనం కిందపడి దెబ్బలు తగిలితే ‘ అమ్మా ‘ అని బాధగా అరుస్తాం
వెంటనే అమ్మ ఎత్తుకుని తారంగం తారంగం తాండవ కృష్ణ అని జోల పాడగానే నొప్పిని మర్చిపోయి అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోతాం
అంటే ఏంటన్నమాట అమ్మ అనేది మనకు ఓ భరోసా
అలాగే భగవంతుడు కూడా మనకు ఓ భరోసా
నా దృష్టిలో కనిపించే దైవాలు అమ్మానాన్నలు కనిపించని దైవం ఈ విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి
అంతరిక్షంలో తొమ్మిది నెలలు ఇరుక్కుపోయి భూమి మీదకు సురక్షితంగా వచ్చిన సునీతా విలియమ్స్ సంగతి అందరికీ తెలిసిందే కదా
ఆమె తనతో పాటు అంతరిక్షానికి వినాయకుడి బొమ్మ.. భగవద్గీత తీసుకెళ్ళిందనే విషయం అందరికీ తెలిసిందే
కానీ చాలా తక్కువమందికి మాత్రమే అంతరిక్షంలో ఆమెకు ఎదురైన విచిత్ర అనుభవాలు తెలుసు
అంతరిక్షంలో ఇరుక్కుపోయామని భూమికి తిరిగి వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిసిన క్షణాన సునీతా చేసిన మొదటి పని రామాయణం చదవడం
రామాయణం పది పేజీలు చదవగానే ఆమెకు ఒంట్లో ఏదో తెలియని శక్తి వచ్చినట్టు అయ్యిందట
ఆమెకు చాలా ఆశర్యం వేసిందట
ఇంకా ఆశర్యం ఏంటంటే ఆకాశంలోంచి సంస్కృత శ్లోకాలు వినిపించేవట
ఇదే విషయం తన సహచర వ్యోమగామి విల్మోర్ కి చెప్తే ‘ నువ్వు రామాయణం చదవడం మొదలు పెట్టాక చాలా మార్పులు కనిపిస్తున్నాయి.. ఇది ఖచ్చితంగా అధ్యయనం చెయ్యవలసిన సబ్జెక్ట్ ‘ అన్నాడట
నాసాకు ఈ విషయం చెప్పినా పట్టించుకోరు కాబట్టి
ఇదే విషయాన్ని ఎలాన్ మస్క్ కు కూడా చెప్తే ‘వేదాలు భాగవత రామాయణాల మీద ఖచ్చితంగా రీసెర్చ్ చేద్దామని ‘ సునీతా విలియమ్స్ కి చెప్పాడట
అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి చెప్పింది సునీత
భూమికి మరికొద్ది రోజుల్లో తిరిగి వస్తామనగా పైనుంచి త్రిశూలం ధరించి సింహం మీద కూర్చుని మాతాజీ భూ ఉపరితలం వరకు కనిపించి మయం అయ్యిందట
ఆకాశంలో కంటికి కనిపించని పొరలు చాలా ఉన్నాయనే విషయం కూడా ఈ సందర్భంగా వాళ్ళు తెలుసుకున్నారు
ఇదంతా సైన్స్ ను నమ్మే ఓ వ్యోమగామి అనుభవాలు
ఈ విషయం మీద మరింత లోతుగా పరిశోధిస్తే విశ్వ రహస్యాలు మరిన్ని బయటికి వస్తాయి
2050 తర్వాత ఇతర గ్రహాల్లో ఉన్న ఏలియన్స్ భూమ్మీద ఉన్న మానవులకు మధ్య కమ్యూనికేషన్ వ్యవస్త ఏర్పడుతుందని ఓ ఆస్ట్రోనాట్ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్లో వైరల్ అవుతుంది
సరే ఇప్పుడు అంతరిక్షం నుంచి భూమ్మీద జరిగే అద్భుత శక్తుల విశేషాల గురించి కూడా చెప్పుకుందాం
సాధారణంగా డాక్టర్లు సైంటిస్టులు శాస్త్రాన్ని నమ్మరు
సైన్స్ ఆధారంగానే పనిచేస్తారు
అలాంటి డాక్టర్లు కూడా ఓంకారం శబ్దం ద్వారా శరీరంలోని నాడులు వైబ్రేట్ అవుతున్నాయని పరిశోధనల్లో గుర్తించారు
ఇలాంటి అనుభవమే సీనియర్ జర్నలిస్ట్ Patri Vasudevan గారు ఈ ఉదయం నాకు చెప్పారు
2020 లో కోవిడ్ బారిన పడి హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఆయనకు రోజు రోజుకూ ఒంట్లో శక్తి హరించుకుపోతున్న సంగతి తెలుస్తూనే ఉందట
ఆ క్షణంలో ఆయనకు భగవంతుడే గుర్తుకు వచ్చాడు
దైవనామ స్మరణ చేస్తూనే రామాయణం కావ్యం పుస్తకం చదవడం మొదలు పెట్టారట
ఆశ్చర్యకరంగా ఆయన ఒంట్లో శక్తి పుంజుకుంది
ఒక్కసారిగా వెయ్యేనుగుల బలం వచ్చిందట
కొద్దిరోజుల్లోనే ఆయన పూర్తిగా కోలుకుని ఇంటికి క్షేమంగా చేరారట
రామ నామ శబ్దంలో మహత్తరమైన మంత్ర శక్తి ఉంది అని ఇది తనకు అక్షరాలా అనుభవంలోకి వచ్చిందని ఆయన చెప్పారు
మన క్షేమానికి భరోసాగా నిలిచినంతకాలం దేవుడనే వాడు మనకి కనిపించకపోయినా పర్లేదు
స్మరించినంత మాత్రము చేత అన్న పద్యం గుర్తుకొచ్చింది
తక్కువేమి మనకు రాముడొక్కండు మనపక్కనుండగా ….. పరేష్ తుర్లపాటి
Share this Article