Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆయన అక్షర యోధుడట… మరి ఈయన్ని ఏమని పిలుద్దాం…!?

June 23, 2024 by M S R

గోరా శాస్త్రి తెలుగు స్వతంత్రకు సంపాదకులు … ఆరుద్రతో త్వమేవాహం రాయించారు ( తెలుగు స్వతంత్రలో )… బైరాగితో నూతిలో గొంతుకలు రాయించారు … డాక్టర్ సి నారాయణ రెడ్డిని ప్రోత్సహించింది వారే … శ్రీశ్రీ ప్రాస క్రీడలు , చలంతో మ్యూజింగ్స్ ఆయనే రాయించారు … కొడవటి గంటితో సినిమా రివ్యూలు , శ్రీదేవితో కాలాతీత వ్యక్తులు ఆయనే స్వతంత్రలో రాయించారు .

ఆంధ్రభూమి, డక్కన్ క్రానికల్ రెండింటికి ఇంగ్లీష్ తెలుగు సంపాదకీయాలు రాశారు . భూమికి నేరుగా, క్రానికల్ కు పరోక్షంగా సంపాదకులు … కథలు, కవిత్వం, రేడియో ప్రసంగాలు ఎన్నో చేశారు … ఐతే ?

ఈయన్ని అక్షర యోధుడు అని పిలుద్దామా ? గోరాశాస్త్రి ఏ పార్టీ ? అన్ని పార్టీలను చీల్చి చెండాడాడు .. ఏ పార్టీని గెలిపించాడు ? ఏ పార్టీని గెలిపించలేదు … అన్ని పార్టీలను విమర్శించాడు .

Ads

పోనీ ఆయన వ్యాపార సామ్రాజ్యపు నెట్ వర్త్ ఎంత ? రైల్వేలో ఉద్యోగం వదులుకొని జర్నలిజంలోకి వచ్చారు . వ్యాపార సామ్రాజ్యం మాట దేవుడెరుగు .. సొంత ఇల్లు కూడా లేదు …
,
ఏం మాట్లాడుతున్నావ్, సొంత ఇల్లు కూడా లేని వారిని అక్షర యోధుడు అంటావా ? సృష్టించిన సాహిత్యం ఎవడికి కావాలి, అబిడ్స్ లో ఆదివారం రోడ్డు మీద అమ్మకాలకు ఆ సాహిత్యం పనికి వస్తుందేమో కానీ వ్యాపార సామ్రాజ్యం సృష్టికి పనికి రాదు . ఏం రాశారు అని కాదు … ఈ కాలంలో ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం సృష్టించారు అనేది ముఖ్యం

( అనుకోకుండా ఈ రోజు చిక్కడపల్లి గ్రంధాలయంలో కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురించిన గోరాశాస్త్రి చదివాను )!

పత్రికా స్వేచ్ఛ అంటే నిజంగానే పత్రికా స్వేచ్ఛ ఉన్న కాలం అది … ఇప్పటిలా పత్రికా స్వేచ్ఛ అంటే పత్రికా యజమాని స్వేచ్ఛ కాలం కాదు … పండితారాధ్యుల నాగేశ్వరరావు ఏడాది పాటు ఆంధ్రభూమి సంపాదకునిగా ఉంటాను అని చెప్పి ఏడాది కాగానే ఎవరూ గుర్తు చేయక పోయినా రాజీనామా చేశారు .

అప్పుడు 1960 లో … ఆంధ్రభూమికి సంపాదకులుగా గోరాశాస్త్రి వచ్చారు .. చివరి వరకు రాస్తూనే జీవితాన్ని ముగించారు . 82లో ఆంధ్రభూమి సంపాదకులుగానే మరణించారు … సంపాదకీయాల కోసం ఆ రోజుల్లో ఆంధ్రభూమిని చదివిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవారు … అప్పుడు తెలుగులో ఆంధ్రభూమి , ఇంగ్లీష్ లో డక్కన్ క్రానికల్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రికలు … ఈనాడు మార్కెటింగ్ ముందు నిలువ లేక పోయింది కానీ అప్పటివరకు భూమికి తిరుగులేదు ..

1969 లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలం ఎడిటర్ గోరాశాస్త్రి సమైక్య వాది . యాజమాన్యం తమిళులు . జర్నలిస్ట్ లు ఎక్కువగా తెలంగాణ వారు . ఎడిటర్ సమైక్యాంధ్ర కోసం సంపాదకీయాలు రాస్తుంటే తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకులు రాకముందు ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నది భూమి క్రానికల్ జర్నలిస్ట్ లే … ఎవరి అభిప్రాయం వారిది అని ఎవరిని ఎవరూ అడ్డుకునేవారు కాదు … నిజంగానే పత్రికా స్వేచ్ఛ ఉండేది .

ఇప్పుడు ఈనాడులో ఉండి బాబును దైవంగా , జగన్ ను ఓ భూతంగా చూసే , రాసే జర్నలిస్ట్ సాక్షిలో చేరితే బాబును భూతంగా , జగన్ ను దైవంగా చూడాలి … ఇప్పటి పత్రికా స్వేచ్ఛ ఇది … కానీ ఆ రోజుల్లో పత్రికల్లో వ్యాపార ధోరణులు పెద్దగా పెరగని కారణంగా పత్రికా స్వేచ్ఛ కనిపించేది … గోరా శాస్త్రి సంపాదకీయాన్ని ఓసారి rss వాళ్ళు మనవాడే అనుకోని కరపత్రంగా ముద్రించి పంచి పెట్టారు … మరోసారి ఇతను లెఫ్టిస్ట్ ఉద్యోగం నుంచి తీసేయండి అని ఫిర్యాదు చేశారట …

సికింద్రాబాద్ జీరాలోని తన నివాసంలో రోజూ సాహిత్య గోష్టులు జరిగేవి … గోరాశాస్త్రి మరణించినప్పుడు ఆంధ్రప్రభలో జీరాలో గోరాశాస్త్రి అని సంపాదకీయం రాశారు … ఖాసా సుబ్బారావు సంపాదకులుగా ఉన్న ఇంగ్లీష్ పత్రికకు గోరాశాస్త్రి రోజూ వివిధ అంశాల పై ఇంగ్లీష్ లో ఉత్తరాలు రాసేవారు … అవి చదివి శాస్త్రి ఇంగ్లీష్ కు ముచ్చటపడి ఖాసా సుబ్బారావు శాస్త్రిని పిలిపించి జర్నలిజంలోకి రమ్మన్నారు … ప్రభుత్వ ఉద్యోగం వదిలి జర్నలిజంలోకి వచ్చి గోరాశాస్త్రి చివరివరకు జర్నలిస్ట్ గానే ఉన్నారు….  – బుద్ధా మురళి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions