Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జనం నవ్వుతారనే సోయి కూడా ఉండదా శ్రీమాన్ కులీ బాబూజీకి..!?

January 25, 2025 by M S R

.

ఒక ఫోటో… కవర్ ఫోటో చూశారు కదా… మీకు చరిత్ర తెలిస్తే ఏమంటారు..? అరె, ఈయన కులీ కుతుబ్ షా కదా… హైదరాబాద్ నిర్మించింది ఈయనే కదా అంటారు…

తప్పు… మీరు తప్పులో కాలేశారు… ఆయన కాదు, హైదరాబాద్ నిర్మించింది శ్రీమాన్ కులీ చంద్రబాబు తానీషా గారు… అంటే కులీనుడు అని అర్థం… ఎప్పుడో తెలుసా,..? 1591లో… అంటే, 430 ఏళ్ల చరిత్ర హైదరాబాద్ నగరానిది…

Ads

ఏమో… మరి తను నిర్మించినట్టు చెబుతాడేమిటి పదే పదే..? ఈరోజు కూడా అదే… ఇదుగో ఇలా…

https://muchata.com/wp-content/uploads/2025/01/WhatsApp-Video-2025-01-25-at-17.51.57.mp4

జనం నవ్వుతారనే సోయి అస్సలు ఉండదు… పదే పదే అవే పిచ్చి వ్యాఖ్యలు… తెలుగు కమ్యూనిటీ కోసం కట్టాడట హైదరాబాద్‌ను… ఔనేమో… అప్పటి కులీ కుతుబ్ షాహీయే మళ్లీ తనే పుట్టాడేమో అన్నట్టుగా…

గతంలోనూ ఇదే మాట పదే పదే… హైదరాబాద్ చరిత్ర ఘనం… ఒక చంద్రబాబు గొప్పగా పదే పదే చెప్పుకుంటుంటే అది తనకు కాదు, ప్రస్తుత పాలకుడు రేవంత్‌రెడ్డికే మైనస్… చంద్రబాబు ఏం చేసినా రేవంత్ రెడ్డి మీద ప్రభావం ఉంటుంది… తన శిష్యుడో, తన సహచరుడో… అది కాంగ్రెస్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది…

చంద్రబాబు తెలంగాణకు ఎంత దగ్గరగా వస్తే అంత ఏవగింపు పెరుగుతుంది తెలంగాణ సమాజంలో… తెలంగాణ వాళ్లకు పొద్దున్నే నిద్ర లేవడం నేర్పించాం, ఎన్టీయార్ వచ్చాకే వీళ్లు అన్నం తింటున్నారు… — కడుక్కోవడం నేర్చుకున్నారు వంటి పిచ్చి వ్యాఖ్యలు తనే కాదు, తన వియ్యంకులవారు, ది గ్రేట్ బ్లడ్డు అండ్ బ్రీడు అఖండ బాలయ్య కూడా పేలినవే కదా…

ఆత్మగౌరవ పోరాటంతో తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంది… ఐనా అవే కూతలు… ఈరోజుకూ మళ్లీ తెలంగాణను హస్తగతం చేసుకోవాలనే కుటిల ఆలోచనలు… చంద్రబాబును అపారంగా, అపరిమితంగా ఆరాధించే రేవంత్ రెడ్డి ఏమంటాడో తెలియదు గానీ… చంద్రబాబు ఏం పేలినా అది అంతిమంగా రేవంత్ రెడ్డికే నష్టం… తనకు సమజైందో లేదో తెలియదు…!!

ఔనూ… శ్రీశ్రీశ్రీ చంద్రబాబు స్వామీజీ గారూ… దావోస్‌లో రిక్తహస్తాలు… అసలే జగన్ దివాలా తీయించిన ఏపీ ఖజానాకు ఈ దావోస్ ఖర్చు మరింత చిల్లు… ఫాఫం, మా పవన్ కల్యాణ్‌ను తీసుకుపోలేదు మీరు… ఆయన కూడా భలే సెటైర్లు వేశాడు దావోస్ షోల మీద… అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ తెలంగాణ మీద పడ్డారా స్వామీజీ..!! మరోసారి చెబుతున్నది తెలంగాణ సమాజం… హైదరాబాద్‌ వయస్సు 430 ఏళ్లు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వై నాట్..? జూనియర్ ఎన్టీఆర్ భిన్న పాత్రల్ని ఎందుకు చేయకూడదు…?!
  • ‘ఇంకేదో కావాలనే’ మోజు, ఆకర్షణల ముందు పాతివ్రత్యాలు బలాదూర్…
  • ఒక తమిళ కణ్ణదాసన్…. ఒక తెలుగు వేటూరి… వేరే పోల్చలేను సారీ…
  • ఇడ్లీ నూడుల్స్ కాదు… అసలు ఇడ్లీ రకమే కాదు…. పక్కా ఇడియప్పం…
  • ఎక్కడిదో ఈ దుఃఖ మేఘం, ఆగకుండా వెక్కి వెక్కి కురుస్తోంది… కానీ..?
  • పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?
  • పెను విధ్వంసం సృష్టించగల ఓ భారీ విపత్తు వేగంగా సమీపిస్తోంది..!!
  • ఆ కేన్సర్ స్పెషలిస్టు… రిటైరయ్యాక సిద్ధవైద్యంలోకి..! ఎందుకు, ఎవరు..?!
  • ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…
  • పురూలియా…! అదొక పెద్ద మిస్టరీ… జవాబుల్లేవు… ఆశించడమూ వేస్ట్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions