Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆదానీ- హిండెన్‌బర్గ్… అమెరికాలో ప్రకంపనలు… హౌజ్ ఆఫ్ ప్యానెల్‌లో కదలిక…

February 16, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ……….  హిండెన్బర్గ్ Vs ఆదాని – అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ ! హిండెన్బర్గ్ ఆదానీ గ్రూపు మీద రిపోర్ట్ విడుదల చేసిన కొద్ది రోజులకే ఇల్హాన్ ఒమర్ మీద అమెరికా చర్య తీసుకోవడం వెనక హిండెన్బర్గ్ కి ఇల్హాన్ ఒమర్ కి ఏదన్నా సంబంధం ఉందా ? ఎప్పుడూ మోడీని విమర్శిస్తూ ఉండే ఇల్హాన్ ఒమర్ అవుట్ !

యాంటీ ఇండియా ఇస్లామిస్ట్ అమెరికన్ కాంగ్రెస్ మహిళ మరియు అమెరికన్ విదేశీ విధానాల కీలక కమిటీలో[US House Panel ] కీలక సభ్య హోదా కలిగిన ఇల్హాన్ ఒమర్ ని తొలగించారు డెమోక్రాట్లు ! The Squad గా పిలవబడే బృందంలో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారు. వీళ్లలో 4 గురు డెమొక్రాట్ పార్టీ ద్వారా అమెరికన్ కాంగ్రెస్ కి ఎన్నిక అయ్యారు 2018 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో…
1. అలెక్జాండ్రియా ఒకసియో కోర్టేజ్ [Alexandria Ocasio-Cortez of New York]
2. ఇల్హాన్ ఒమర్ [Ilhan Omar of Minnesota]

3. అయన్న ప్రెస్లీ [Ayanna Pressley of Massachusetts]

4. రషీదా త్లైబ్ [Rashida Tlaib of Michigan]

Ads

వీళ్ళు నలుగురు డెమొక్రాట్ పార్టీ తరుపున అమెరికా హౌస్ ఆఫ్ కామన్స్ కి ఎన్నిక అయ్యారు.

************************************
ఎవరీ ఇల్హాన్ ఒమర్ ?

సోమాలియా దేశపు రాజధాని మొగదిషులో పుట్టింది. తండ్రి, తల్లితో సహా అందరూ ఉన్నత విద్యావంతులు మరియు సోమాలియా ప్రభుత్వంలో ఉన్నత పదవులలో ఉన్నవాళ్లే ! సోమాలియాలో అంతర్యుద్ధం కారణంగా సోమాలియాని వదిలి, పక్కనే ఉన్న కెన్యా దేశంలో శరణార్థి శిబిరంలో 4 ఏళ్లు తల దాచుకుంది బిక్కు బిక్కు మంటూ !

1995 లో శరణార్ధుల హోదాలో అమెరికా ఆశ్రయం ఇచ్చింది ఇల్హాన్ ఒమర్ కుటుంబ సభ్యులకి. ఇల్హాన్ ఒమర్ తండ్రి అమెరికాకి వచ్చిన కొత్తల్లో టాక్సీ డ్రైవర్ గా పనిచేశాడు. ఇల్హాన్ ఒమర్ కి 20 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం వచ్చింది. చదువు పూర్తి చేసుకున్న తరువాత చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ చివరకి అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి ఎన్నిక అయ్యింది. ఆఫ్ కోర్స్ డెమోక్రాట్స్ మద్దతు పుష్కలంగా మరీ ముఖ్యంగా మహిళల మద్దతు సంపాదించగలిగింది.

రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుండి ఇల్హాన్ ఒమర్ వివాదాస్పదంగా ఉంటూ వచ్చింది ఇప్పటివరకు.

1. యూదులు ప్రపంచాన్ని హిప్నటైజ్ చేసి మోసగిస్తున్నారు అంటూ వివాదాస్పద వ్యాఖ్య చేసింది. అల్లా దయతలిచి యూదుల హిప్నటైజేషన్ నుండి గాజా ప్రజలని రక్షిస్తాడు అంటూ వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపింది. అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహూ ఇల్హాన్ ఒమర్ ని ఇజ్రాయెల్ దేశంలోకి రాకుండా నిషేధం విధించాడు. ఇల్హాన్ ఒమర్ చేసిన వ్యాఖ్యలని డెమొక్రాట్లలోని ఒక వర్గం సభ్యులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు.

2. ఇల్హాన్ ఒమర్ చివరికి సౌదీ, UAE లని కూడా వదలలేదు. మానవ హక్కులు, మహిళల హక్కులని ఈ రెండు దేశాలు కాలరాస్తున్నాయి అంటూ తీవ్రంగా విమర్శలు చేసింది.

3. డొనాల్డ్ ట్రంప్ మీద తీవ్ర విమర్శలు చేసేది. చివరకి ట్రంప్ సహనం కోల్పోయి ‘Go Back to their Countries ‘ అంటూ ట్వీట్ చేసేదాకా వెళ్ళాడు. అంటే దీనర్ధం ఎవరయితే అమెరికాకి శరణార్ధులుగా వచ్చి అమెరికన్ పౌరసత్వం తీసుకున్నారో వాళ్ళని వాళ్ళ వాళ్ళ దేశాలకి వెళ్లిపోమని. ఆఫ్ కోర్స్ నల్లజాతి వాళ్ళ మీద తెల్లజాతి వాళ్ళ అహంకారం అంటూ ఇల్హాన్ ఒమర్ బాగానే ప్రచారం చేసింది. ఇల్హాన్ ఒమర్ టెక్నిక్ గ్రహించలేని ట్రంప్ ఆ ఉచ్చులో పడేలా చేసింది ఇల్హాన్ ఒమర్.

4. ఇక మోడీ మీద నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటుంది. నిజానికి బిడెన్ అధికారంలోకి రాగానే అప్పట్లో మోడీ వ్యతిరేకతని ప్రోత్సహించాడు… కానీ రోజులు గడిచే కొద్దీ తన విదేశాంగ విధానం వలన ఆసియాలో అమెరికా పట్టు కోల్పోతున్న తరుణంలో, మళ్ళీ భారత్ అవసరం ఏర్పడిన దరిమిలా భారత్ లేదా మోడీ వ్యతిరేక చర్యలకి స్వస్తి పలకాల్సి వచ్చింది… కానీ బిడెన్ మంత్రాంగం ఆలోచనలకి వ్యతిరేకంగా మోడీ మీద విమర్శలు చేయడం మాత్రం ఆపలేదు ఇల్హాన్ ఒమర్.

5. మోడీ – ట్రంప్ ఫ్యాక్టర్ ? ఇల్హాన్ ఒమర్ ఏప్రిల్ 20 నుండి 24 వరకు [2022] నాలుగు రోజుల పాకిస్థాన్ పర్యటనకి వెళ్ళింది US హౌస్ ఆఫ్ ప్యానెల్ సభ్యురాలి హోదాలో… పాకిస్థాన్ పర్యటనకి వెళ్లకూడదు అని ఎవరూ అనలేరు కానీ నాలుగు రోజుల పాకిస్థాన్ పర్యటనలో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ వెళ్ళి అక్కడ భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. దాంతో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మరియు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా మీద తీవ్ర ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ఇల్హాన్ ఒమర్ POK పర్యటనలో చేసిన వ్యాఖ్యలు బిడెన్ కూడా తలనెప్పిని తెప్పించాయి… ఇల్హాన్ ఒమర్ POK పర్యటనకి వెళ్తున్నట్లు ఎవరికీ చెప్పలేదు.

6. ఇల్హాన్ ఒమర్ ద్వంద ప్రమాణాలు… చైనాలోని వుయ్ఘర్ ముస్లిమ్స్ మీద చైనా అణిచివేత ధోరణిని అవలంబిస్తున్నది అంటూ విమర్శలు చేస్తుంది… మరోవైపు రహస్యంగా చైనాతో చేతులు కలిపి భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది.

7. స్వలింగ సంపర్కులకి [Lesbian,gay,bisexual and Transgender – LGBT] మద్దతు ప్రకటించి, వాళ్ళు కూడా మానవహక్కుల జాబితాలోకి వస్తారు అంటూ మద్దతు పలుకుతూ చేసిన వ్యాఖ్యల మీద ఆఫ్ఘన్ తాలిబన్లు విరుచకుపడ్డారు. అవకాశం దొరికితే ఇల్హాన్ ఒమర్‌ని చంపేస్తాము అంటూ బహిరంగంగానే హెచ్చరించారు తాలిబన్లు.

8. 2022 ఏప్రిల్‌లో పాకిస్థాన్ పర్యటన ముగించుకొని అమెరికా వెళ్ళిన తరువాత ఇల్హాన్ ఒమర్ అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కి ఒక రిజల్యూషన్ ఇచ్చింది భారత దేశాన్ని అమెరికన్ చట్టం ప్రకారం శిక్షించాలి అంటూ… ఇంతకీ ఏమిటా చట్టం ? అమెరికన్ చట్టం 1998 ప్రకారం అంతర్జాతీయ మత స్వేచ్చ మరియు సాంస్కృతిక వర్గాల పట్ల వివక్ష మరియు అణచివేతని నిరోధిస్తుంది [Country of Particular Concern’ under the US International Religious Freedom Act of 1998]… ఆఫ్ కోర్స్ భారత్ లో ఇతర మతస్తుల పట్ల ఎలాంటి వివక్ష ఉన్నదో చెప్పే రిపోర్ట్ పాకిస్థాన్ ఇచ్చింది ఏప్రిల్ నెలలో… దానినే జూన్ నెలలో ఒక రిజల్యూషన్‌గా మార్చి భారత్ మీద ఆంక్షలు విధించమని అడిగింది… దీనిమీద మళ్ళీ జై శంకర్, అజిత్ దోవల్ నిరసన వ్యక్తం చేసేసరికి బిడెన్ ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది : ఇల్హాన్ ఒమర్ పాకిస్థాన్ పర్యటన ఆమె వ్యక్తిగత పర్యటన తప్పితే అమెరికా తరుపున అధికారిక పర్యటన కాదు అంటూ !

9. ఇల్హాన్ ఒమర్ తరుచూ జో బిడెన్ ని ప్రశ్నిస్తూ ఉంటుంది: మనం ఎందుకు భారత్‌లోని బిజేపి ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోడీ మీద చర్య తీసుకోవడానికి వెనకాడుతున్నాం?… అవునా ? చర్య భారత్ మీద కాదు, ఏకంగా నీ మీదే తీసుకున్నారు ఇప్పుడు… సోమాలియాలో పుట్టి అమెరికాలో చదివిన ఇల్హాన్ ఒమర్‌కి భారత దేశం గురించి ఏం తెలుసు ?

10. అసలు కీలకమయిన హౌస్ ఆఫ్ ప్యానెల్ [విదేశాంగ విధానం ] లో కీలక సభ్యురాలిగా నియమించడం… అదీ ఒక వైపు కమ్యూనిస్టు భావజాలం మరోవైపు ముస్లిం మత ఛాందసవాదం మాత్రమే వంట బట్టించుకున్న ఇల్హాన్ ఒమర్‌కి అవకాశం ఇవ్వడం బిడెన్ చుట్టూ చేరిన కమ్యూనిస్టులు చేసిన అతి పెద్ద తప్పు.

11. జులై 2020 లో అమెరికన్ కాంగ్రెస్ భారత్‌కి కాట్సా [Countering America’s Adversaries Through Sanctions Act (CAATSA) చట్టం నుండి మినహాయింపు ఇచ్చే బిల్లుని అమెరికన్ చట్ట సభలలో ప్రవేశపెట్టినప్పుడు ఇల్హాన్ ఒమర్ భారత్‌కి వ్యతిరేకంగా వోటు వేసింది. ఆఫ్ కోర్స్ ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదనుకోండి…

12. చివరికి ఇల్హాన్ ఒమర్ చేష్టలతో విసిగిపోయిన బిడెన్ ఇల్హాన్ ఒమర్‌ని హౌస్ ఆఫ్ ప్యానెల్ నుండి తొలగించే తీర్మానం మీద మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇల్హాన్ ఒమర్‌ని హౌస్ ఆఫ్ ప్యానెల్ నుండి తొలగించే తీర్మానానికి మద్దతుగా 218 మంది వోటు వేస్తే వ్యతిరేకంగా 211 మంది వోటు వేశారు. అయితే ఇల్హాన్ ఒమర్‌కి వ్యతిరేకంగా వోటు వేసిన వారిలో డెమో క్రాట్లు కూడా ఉన్నారు.

ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం ! హిండెన్బర్గ్ రిపోర్ట్ విడుదల అయిన వారం రోజులలోనే ఇల్హాన్ ఒమర్‌ని తొలగించడం మీద అనుమానాలు ఉన్నాయి. నిజానికి హిండెన్ బర్గ్ రిపోర్ట్‌కి ఇల్హాన్ ఒమర్‌ని తొలగించడం అనేవి వేరు వేరు అంశాలుగా బయటికి కనిపిస్తున్నా ఏదో లింకు ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2022లోనే భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడే తొలగించాల్సి ఉండాల్సింది కదా ? కేవలం హిండెన్ బర్గ్ రిపోర్ట్ విడుదల అయిన వారానికే ఇల్హాన్ ఒమర్‌ని తొలగించడం‌లో ఏదయినా రహస్యం ఉందా ? ఇక్కడ ఇల్హాన్ ఒమర్‌ని తొలగించిన సమయం మీదనే అనుమానాలు ఉన్నాయి….. (ఈ కథనంలోని అంశాలు రచయిత సొంత అభిప్రాయాలు…)


Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions