సీ, సీ ప్లస్ అనబడే ఐటీ భాషలకు ఆ పేర్లు పెట్టిందే సీ ఫర్ చంద్రబాబు అనే భావనతో… ఇదుగో ఈ పోస్టులు చూశాక… హఠాత్తుగా మిత్రుడు Jagannadh Goud… రాసిన ఓ వివరణాత్మక కథనం యాదికొచ్చింది… ఐటీకి ఆద్యుడిగా, హైదరాబాద్‌ను ఐటీ సెంటర్‌గా డెవలప్ చేసింది చంద్రబాబే అనే ప్రచారాన్ని, ఐటీ ఎంప్లాయీస్ దాన్ని నమ్ముతున్న విచిత్రాన్ని బ్రేక్ చేసే కథనం ఇది… నిజాలు ఏమిటో చెప్పే ప్రయత్నమిది… కంప్యూటర్లు నేనే కనిపెట్టాను, మొబైల్ నా పుణ్యమే వంటి మాటలతో చంద్రబాబు ఎంతగా ప్రచారం చేసుకున్నాడో, చదువుకున్న వాళ్ల మనస్సుల్లో అంత పలుచన కూడా అయ్యాడు… జగన్ పోస్టు చదవండి ఓసారి యథాతథంగా…
హైదరాబాద్/ఇండియా – ఐటీ (ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ)
P V నరసింహా రావు ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 1991 లో మన దేశంలో ఆర్ధిక సంస్కరణలు తెచ్చింది. అంతకముందే 1990 లో “మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఐటీ”, భారత ప్రభుత్వం – సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) ని ప్రవేశ పెట్టింది. 1990-91 లో బెంగళూరు, పూణే, భువనేశ్వర్ లల్లో ఐటీ పార్క్స్ కి, 1991-92 లో ప్రధానంగా హైదరాబాద్ మరియూ నోయిడా (తిరువనంతపురం, గాంధీనగర్ లకి కూడా) ప్లేస్ లని కేటాయించి సాఫ్ట్ వేర్ ఐటీ పార్క్స్ (STP) లని నెలకొల్పింది. హైదరాబాద్ లోని మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఐటీ పార్క్ ని అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు శంఖుస్థాపన (1992) చేశారు…
Ads
సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ (STP) మొదటి డైరక్టర్ బీ వీ నాయుడు (బెంగళూరు/ హైదరాబాద్). మన దేశంలో ప్రస్తుతం ఉన్న ఐదు ప్రధానమైన ఐటీ కంపనీలు 1 TCS. 2. ఇన్ ఫోసిస్ 3. విప్రో 4. టెక్ మహేంద్ర (సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్) 5. HCL.
రామలింగ రాజు గారు సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ అనే కంపనీ ని 1987 లో హైదరాబాద్ లో స్థాపించారు. 1992 లోనే బొంబాయి స్టాక్ మార్కెట్ లో నమోదు అయ్యింది సత్యం కంప్యూటర్స్. ఆ తర్వాత టెక్ మహేంద్రతో విలీనం అయ్యింది (ఐటీలో టెక్ మహేంద్ర అంటే ఆనాటి సత్యం కంప్యూర్స్ కంపనీనే ). సత్యం కంప్యూటర్స్ కంపనీ బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ లో నమోదు అయ్యేనాటికి కూడా బాబుకి సాఫ్ట్ వేర్ స్పెల్లింగ్ తెలుసో లేదో తెలియదు కానీ అతను ముఖ్యమంత్రి కాదు.
విప్రో ఎప్పట్నుంచో ఉంది కానీ 1982 -85 ఆ ప్రాంతంలో ఐటీ ఎగుమతులు ప్రారంభించింది. ఇన్ఫోసిస్ కూడా 1981 లోనే ప్రారంభమయి 1983 నుంచే ఐటీ ఎగుమతులు ప్రారంభించి 1992 లో స్టాక్ మార్కెట్ లో నమోదు అయ్యింది. TCS కూడా ఎప్పుడో ప్రారంభమయినా 1980 లోనే మొదటి సాఫ్ట్ వేర్ డెవలమెంట్ సెంటర్ ప్రారంభించింది. HCL ఎప్పుడో ప్రారంభమయినా 1991 లోనే సాఫ్ట్ వేర్ ఎగుమతులని ప్రారంభించింది.
ప్రస్తుతం ఇండియాలోని సాఫ్ట్ వేర్ రంగంలో టాప్ 5 కంపనీలు 1995 ముందు నుంచే ఉన్నై మరియూ 1995 ముందు నుంచే సాఫ్ట్ వేర్ ఎగుమతులు ప్రారంభించాయి. హైదరాబాద్ లో సత్యం (ఇప్పటి పేరు టెక్ మహేంద్ర), బెంగళూరులో ఇన్ఫోసిస్, బొంబాయిలో TCS , చెన్నైలో HCL.
నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11 ఇంజనీరింగ్ కళాశాలలు, 8 మెడికల్, 3 డెంటల్, అగ్రికల్చరల్ కళాశాలకి అనుమతి తెస్తే బాబు ముఖ్యమంత్రి అయ్యాక కోర్ట్ కి వెళ్ళి, వాటిని రద్దు చేయించి, ఆ తర్వాత కాలంలో 30 ఇంజనీరింగ్ కాలేజ్ లకి అనుమతి తెచ్చుకున్నాడు ( ఆ కాలేజ్ లు ఎవరివో, ఏ పార్టీకి కొమ్ము కాసేవో, ఎవరి చెప్పు చేతల్లో ఉండేవో ఆ 30 లిస్ట్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది అంటారు ఆనాటి పెద్దలు). సో కాలేజీల సంఖ్య పెంచింది, అనుమతులు తెచ్చింది కూడా ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు.
సాఫ్ట్ వేర్ రంగాన్ని హైదరాబాద్ కి తేవటంలో అసలు బాబు పాత్ర 1% ఉన్నా… అంతా నేనే చేశా అని చెప్పుకు తిరిగినా… ఆ విషయాలని కొద్దిగా అయినా నమ్మేవాడిని, అసలు 0% కూడా లేకుండా అంతా “నేనే” చేశా అని చెప్పుకు తిరిగెటోడ్ని, వాటిని నమ్మే జనాలని ఏమి అనాలో ఆనాటి ఈనాడు, ఆంధ్ర జ్యోతి మిగతా యెల్లో మీడియాకే తెలియాలి..!
65 ఎకరాల శిల్పారామం మాదాపూర్ లో 1992 లోనే ప్రారంభమయింది. దానిపక్కన 5 ఎకరాల సైబర్ టవర్ కి ప్లేస్ ఇచ్చింది, శంకుస్థాపన చేసింది 1995 కు ముందే… సైబర్ టవర్ వచ్చాక శిల్పారామం రాలేదు హైటెక్ సిటీలో, శిల్పారామం వచ్చాక సైబర్ టవర్ వచ్చింది. సైబర్ టవర్ కి కొంచెం ముందుకు వెళ్తే దక్కన్ ఐటీ పార్క్ TCS వాళ్ళు ప్రారంభించారు. అది కూడా 1995 కి ముందే కేటాయించారు. కానీ 2000 లో మొదలయింది.
అసలు మొదటి ఐటీ టవర్ 1986 లోనే బేగం పేట (హైదరాబాద్) లో ప్రారంభమయింది. 1980-90 లల్లో నారాయణ గూడ, హిమాయత్ నగర్, బేగంపేటలల్లో సాఫ్ట్ వేర్ ట్రయినింగ్ సెంటర్స్ ఉండేవి.
ఇండియా నుంచి అమెరికాకి కానీ మిగతా దేశాలకి కానీ ఐటీ ఎక్స ఫర్ట్స్ వెళ్ళారు మరియూ వెళ్తున్నారు అంటే ప్రధాన కారణం 1990 లో మన దేశంలో ప్రారంభమయిన సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ (STP) లు. మరియూ TCS, ఇన్ ఫోసిస్, విప్రో, టెక్ మహేంద్ర (సత్యం), HCL . ప్రధానంగా బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, నోయిడా, పూణే, బొంబాయి, గురుగ్రాంలల్లో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ లది ప్రముఖ పాత్ర. దీనిలో ఏ లోకల్ పుల్లయ్య, సుబ్బారావు పాత్ర లేదు. ఒకవేళ ఉంది అనుకుంటే పీవీ నరసింహారావు గారికి మేజర్ క్రెడిట్ వెళ్తుంది, అ తర్వాత సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ మొదటి డైరక్టర్ BV నాయుడుకి వెళ్తుంది.
1995 లో ముఖ్యమంత్రి అయి తన చెప్పు చేతల్లోని పేపర్ల రాతలతో నేనే అంతా తెచ్చా అంటే 100% తప్పు, అసలు అతని పాత్ర 0% కూడా లేదు. 1995 ముందే ప్రస్తుత టాప్ 5 కంపనీలు సాఫ్ట్ వేర్ ఎగుమతులు ప్రారంభించాయి. హైదరాబాద్ లో అయితే 1992 లోనే అతి పెద్ద కంపనీ ఉండేది మరియూ 1986 లోనే ఇంటర్ గ్రాఫ్ అనే మొదటి ఐటీ టవర్ బేగం పేటలో ఉంది. సైబర్ టవర్ రాటానికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన STP లు (సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ లు)
P V నరసింహారావు గారి లాంటి దార్శనికుడి వల్ల హైదరాబాద్ & మనదేశం ఐటీలో అగ్రగామి గా ఉంది. దానికి తోడు TCS, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర (సత్యం), విఫ్రో మరియూ HCL కంపనీల యాజమాన్యం & వాటి ఫౌండర్స్…. – జగన్ (పూర్తి వ్యక్తిగత అభిప్రాయం)
Share this Article