Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎవరు జర్నలిస్టు..? ఏది పత్రికాస్వేచ్ఛ..? ఓ దిక్కుమాలిన నిరర్థక చర్చ..!!

July 1, 2026 by M S R

.

యాంటీ సెంటిమెంట్ కథనం అనుకునేవాళ్లు కాస్త అవాయిడ్ చేయండి… కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది… సో, నిజాలు మాట్లాడుకుందాం… నిన్న ఎవరో ఇద్దరు జర్నలిస్టులను ఏపీ పోలీసులు మరీ గూండాల్లాగా లిఫ్ట్ చేశారు, నాన్సెన్స్, తెలంగాణ ప్రభుత్వానికి సోయి లేదా, సిగ్గు లేదా… తెలంగాణ జర్నలిస్టులను అరెస్టు చేస్తే సహకరిస్తారా అని చాలామంది… అచ్చం గతంలో నాగేశ్వర్‌కు సపోర్ట్ చేసినట్టే ఇప్పుడూ మాట్లాడుతున్నారు…

అసలు నాగేశ్వర్ ఎప్పుడు తెలంగాణను ఓన్ చేసుకున్నాడు? భౌగోళికంగా తెలంగాణవాడు గనుక తెలంగాణ జర్నలిస్టు అనాలా..? ఇదేం నిర్వచనం? ఇప్పుడు ఎవరో ఇద్దరు యూట్యూబర్లను ఏపీ పోలీసులు అరెస్టు చేసినట్టున్నారు… వాళ్లకూ తెలంగాణ జర్నలిస్టులు అనే ముద్రలు… అసలు జర్నలిస్టు అంటే ఎవరు..? తెలంగాణ జర్నలిస్టు అంటే ఎవరు..?

Ads

సరే, తెలంగాణలో పుట్టినంత మాత్రాన ఇక వాళ్లకు కేసుల నుంచి రక్షణ తెలంగాణ ప్రభుత్వం బాధ్యత అవుతుందా.? తెలంగాణ సమాజం ఓన్ చేసుకోవాలా? ఇదెక్కడి వాదన? చివరకు కల్వకుంట్ల కవిత కూడా ఇదే మాట… ఫాఫం, ఆమె దారితప్పిన పయనం ఎటువైపో ఆమెకు కూడా అర్థమవుతున్నట్టు లేదు…

గతంలో రేవంత్ రెడ్డి చాలాసార్లు తన అసంతృప్తిని వ్యక్తపరిచాడు… ఎవరు జర్నలిస్టో మీరే నిర్వచనం ఇవ్వండి అని అసోసియేషన్లను అడిగాడు, ప్రక్షాళన మీ బాధ్యతే అన్నాడు… ప్రింట్, టీవీ, వెబ్, డిజిటల్, ట్యూబ్ జర్నలిస్టులుగా రకరకాలు… ఈరోజుల్లో యూట్యూబ్ చానెల్ నాలుగు నిమిషాల పని… ఏది తోస్తే అది రాస్తే, కూస్తే, చూపిస్తే … తనను జర్నలిస్టు అందామా..?

ఏదో ఓ రాజకీయ పార్టీ డబ్బులిస్తుంది, వాళ్ల ప్రత్యర్థుల మీద బూతులు, అబద్ధాలు, వెగటు వీడియోలు ప్రసారం చేస్తే దాన్నీ జర్నలిజం అందామా..? అవన్నీ వోకే, ఒక రాష్ట్రంలో వాళ్ల మీద కేసులు పడితే, చట్టపరంగా ఆయా రాష్ట్రాల పోలీసులకు సహకరించడం ఈ రాష్ట్రం బాధ్యతే… పోలీసులకు పరస్పర సమాచారం ఉంటుంది, ఉండాలి…

అబ్బే, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు ఏమైనా శుద్దపూసలా మరి అన్నాడో మిత్రుడు… కాదు, ఏదో ఓ పార్టీకి కొమ్ముకాస్తూ, నానా చెత్తా నింపుతున్నవాళ్లే… కానీ వాళ్ల వెనుక యాజమాన్యాలు ఉంటాయి… అవి చట్టాలకో కట్టుబడి ఉన్నట్టు నటిస్తాయి కనీసం… కానీ యూట్యూబర్లు, వెబ్ జర్నలిస్టులు, డిజిటల్ రిపోర్టర్లు… వీళ్లకు ఏ కట్టుబాట్లు ఉన్నాయి..? బ్లాక్‌మెయిలర్లు, దందారాయుళ్లకు జర్నలిజం ముసుగులా..?

భావప్రకటన స్వేచ్ఛ అనేది అపరిమితమైన స్వేచ్ఛ ఏమీ కాదు… చట్టాలకు అతీతం కూడా కాదు… క్రిమినల్ నేచర్ పరువునష్టం కేసు పెడితే పీక్కోలేక చావాలి… సో, స్వీయ నియంత్రణ అవసరం, కానీ డబ్బులిచ్చే పార్టీలు అలా నియంత్రణలో ఉండనివ్వవు… కేసీయార్ క్యాంపు కోట్లకుకోట్లు ఖర్చు పెడుతోంది, రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బూతులతో విరుచుకుపడటానికి… లీగల్‌గా ఇరుక్కోకుండా దుబయ్‌లో టీమ్స్‌ను పెట్టి (కుటుంబాలతో) పోషిస్తున్నాయి… అదేమంటే జర్నలిజం అంటారు, ఉక్కుపాదం అంటారు…

జాతీయ స్థాయిలో ఏకంగా చానెళ్లనే కొనేస్తున్నాయి పార్టీలు… మోడీ మీడియా అని పేరు పెట్టారు కదా… అంతేకాదు, యాంటీ బీజేపీ, యాంటీ గవర్నమెంట్, యాంటీ నేషన్ ప్రాపగాండా మీడియాకు కూడా కొరత లేదు… యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా మీడియా ముసుగులో దాక్కుంటున్నారు… ఆయా మీడియాల్లో పనిచేసేవాళ్లు మీడియా యాజమాన్యాల పొలిటికల్ లైన్స్‌ను బట్టి పనిచేయాలి, నిష్పాక్షికత, నిజమైన జర్నలిజం అంతా హంబక్… డొల్లు… వాస్తవ స్థితి ఇదే…

ఏపీకి వద్దాం… ఇది చంద్రబాబు జమానా కాదు, లోకేష్ శకం… టీడీపీ మీద ఎవరు ప్రాపగాండాకు దిగినా ఏమాత్రం సహించడు… అంతటి కొమ్మినేని వంటి ‘తమవర్గం జర్నలిస్టు’నే సహించలేదు… అదేమంటే జగన్ ఏమైనా తక్కువ చేశాడా అంటారు… నిజమే, ఏకంగా రామోజీనే లిఫ్ట్ చేయాలని అనుకున్నాడు జగన్… యెల్లో టీవీ చానెళ్ల ముఖ్యులను పిలిపించి కౌన్సిలింగ్ క్లాసులు పీకించాడు…

చంద్రబాబు అయితే తన గత హయాంలో జర్నలిస్టులపై వ్యక్తిగత టార్గెటింగ్ కాదు, ఏకంగా సాక్షినే మూసివేయించాలని అనుకున్నాడు కదా… గతంలో వైఎస్ ఈనాడు మూలాలు పెరికే ప్రయాసలో పడలేదా..? ఎవరూ తక్కువ కాదు… పార్టీలు, నాయకులు ఆడే క్షుద్ర ప్రాపగాండా రాజకీయాల్లో… ప్రచార యజ్ఞాల్లో చాలామంది జర్నలిస్టుల ముసుగులేసుకున్న కార్యకర్తలే అంతిమంగా బలిపశువులు..!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విడాకులు – సెటిల్మెంట్ చిక్కులు ! న్యాయంలో ఏదో తేడా కొడుతోంది !!
  • దృశ్యం: ది కన్‌క్లూజన్ — మాతృకను వదిలి.. మ్యాజిక్‌ పట్టుకున్నారు..
  • తప్పులు చేసి జైలుకు వెళ్లొచ్చినా… ఇంకా దిగినట్టు లేదు ఈ *విలన్‌కు..?!
  • అది చదివితే ‘కాశీయాత్ర’ చేసినంత పుణ్యం- జ్ఞానం- విలువ !!
  • ఉత్త స్క్రాప్! ఈ సంతను యాణ్నుంచి పట్టుకొచ్చావురా బిగ్‌బాస్..!
  • సింగీతంకు తెలుగు సమాజం నుంచి సముచిత గౌరవం దక్కిందా?!
  • అక్షరధామ్! స్వామి నారాయణుడితో నేనెందుకు కనెక్ట్ కాలేకపోయాను?!
  • అమిత్ షా పర్యటనలు రెండుసార్లు రద్దు! ఏదో అడ్డుపడుతోంది, ఏమిటది?!
  • ప్యారడైజ్ … సినిమా కాదు, బిర్యానీ కాదు… ఓ సినిమా టాకీసు !!
  • సింగీతం అంటే ఓ పేరు కాదు… తెలుగు సినిమా ప్రయోగాల జాబితా !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions