https://twitter.com/ANI/status/766515213315170304
…… పైన ట్వీటు 2016 ఆగస్టులో కరిమా పోస్ట్ చేసింది.,. ప్రధాని మోడీకి రక్షాబంధన్ శుభాకాంక్షలు చెబుతూ ‘‘అన్నయ్యా, బెలూచిస్థాన్లో పాకిస్థాన్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై మాట్లాడండి… ప్రతి బెలూచ్ పౌరుడూ నిన్ను సోదరుడిగా భావిస్తున్నారు… మాకు అండగా నిలబడండి అన్నయ్యా…’’ అని వేడుకొంది… కారణాలనేకం, ప్రధాని మోడీ నోటి నుంచి బెలూచిస్థాన్ అనుకూల వ్యాఖ్య ఒక్కటీ రాలేదు ఇన్నేళ్లూ… పరోక్షంగా బెలూచిస్థాన్ పోరాటవీరులకు భారతప్రభుత్వం అండగా నిలబడవచ్చుగాక… కానీ అంతర్జాతీయంగా చర్చ జరిగేలా, రాజకీయంగా కెలికే ప్రయత్నం ఏమీ లేదు…
Ads
సీన్ కట్ చేస్తే… ఆ కరిమా బెలూచ్ (Ex-Chairperson @BSO__Azad, and BNF #Balochistan) అకస్మాత్తుగా ఇప్పుడు శవమై కనిపించింది… 2016లోనే పాకిస్థాన్ నుంచి తప్పించుకుని, కెనడాలో ఆశ్రయం పొందింది… అక్కడి నుంచే తన పోరాటాన్ని కొనసాగిస్తోంది… బెలూచిస్థాన్లో మానవహక్కుల ఉల్లంఘన, వేలాది మందిని పాకిస్థానీ సైన్యం మాయం చేయడం, అక్కడి స్ట్రీల దుస్థితి… వాట్ నాట్… తను పుట్టిన గడ్డ కన్నీళ్లను అంతర్జాతీయ సమాజానికి చెబుతూనే ఉంది…
ఆమె అసలు పేరు బానుక్ కరిమా… కానీ తన పేరులోనే బెలూచ్ చేర్చుకుని ఓ మానవ హక్కుల కార్యకర్తలా శ్రమిస్తూనే ఉంది… బెలూచిస్థాన్ పోరాటవాదులకు మోడీ అధికారంలోకి వచ్చాక ఓ నైతిక ధైర్యం వచ్చింది… చాలామంది విముక్తివాదులు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు… వాళ్లందరినీ ఐఎస్ఐ వేటాడుతోంది…
ఈ సంవత్సరం మార్చిలో ది బెలూచిస్థాన్ పోస్ట్ ఫౌండర్, ఎడిటర్ సాజిద్ హుసేన్ స్వీడెన్‌లో ఇలాగే శవమై తేలాడు… ఆయన 2017 నుంచి స్వీడెన్ ఆశ్రయంలో ఉన్నాడు… ఇలా వేటాడబడిన వాళ్లు బోలెడు మంది… అసలు బెలూచిస్థాన్లో ఎంత మందిని పాకిస్థాన్ మాయం చేసిందో లెక్కలే లేవు… అక్కడ పాకిస్థాన్ ఆర్మీ చేసే ఘాతుకాలు అంతాఇంతా కాదు…
మొన్నటి ఆదివారం కనిపించకుండా పోయిన కరిమా ఈరోజు శవంగా కనిపించింది… అక్కడి ఖలిస్థాన్ అనుకూలవాదుల మద్దతుతో ఐఎస్ఐ ఆమెను చంపించి ఉంటుందనేది ఓ సందేహం… కెనడా, బ్రిటన్ కేంద్రాలుగా మళ్లీ ఖలిస్థాన్ వేర్పాటువాదం ఊపిరి పోసుకుంటోంది… రైతుల హక్కుల పేరిట ఆర్గనైజ్ అవుతోంది… ఇతర రాజకీయ పక్షాలనూ సమీకరిస్తోంది… అసలు నేపథ్యాలు తెలియని కుహనా లౌకిక రాజకీయ పార్టీలు వంత పాడుతుంటే… దేశంలో లెఫ్ట్, ఐఎస్ఐ అనుకూల శక్తులు సైతం గుడ్డి బీజేపీ వ్యతిరేకతతో సై అంటున్నాయి… నిజాలు నిష్ఠురంగానే ఉంటయ్… బ్రిటన్, కెనడా భారత వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారుతున్నాయి… అంతరించింది అనుకున్న తల్నొప్పి మళ్లీ బలం పుంజుకుంటోంది… పాకిస్థానీ అనుకూల శక్తులు, ఖలిస్థాన్ విముక్తివాదులు కలిస్తే… అది కాశ్మీర్కన్నా ప్రమాదకరం… కరిమా హత్య చెబుతున్న నిజం ఇదే…
Share this Article