Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సిక్సర్ల అభిషేకుడిని పడేసిన లైలా..! పాత ట్రాజెడీ మరిచి కొత్త బంధం…!

April 22, 2026 by M S R

.

క్రికెట్ పిచ్‌పై సిక్సర్ల వర్షం కురిపించే యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ వ్యక్తిగత జీవితం సినిమాని తలపించే మలుపులతో సాగింది… ఒకవైపు కెరీర్‌లో అద్భుతమైన ఎదుగుదల, మరోవైపు ఊహించని విషాదం… ఈ రెండింటి మధ్య సాగిన ఆయన ప్రయాణం ఇప్పుడు కొత్త వెలుగులోకి వచ్చింది…

చీకటి నీడలు: తానియా సింగ్ మరణం …. అభిషేక్ శర్మ జీవితంలో 2024 ఆరంభం తీవ్ర విషాదాన్ని నింపింది… మోడల్ తానియా సింగ్‌తో ఆయనకున్న అనుబంధం అందరికీ తెలిసిందే… అయితే, ఫిబ్రవరి 2024లో ఆమె ఆత్మహత్య చేసుకోవడం క్రీడా లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది…

Ads

ఈ కేసులో పోలీసులు అభిషేక్‌ను విచారించడం, ఆయన మానసిక ఒత్తిడికి లోనవ్వడం వంటి ఘటనలు ఆయన వ్యక్తిగత జీవితంపై మాయని మచ్చలా మిగిలాయి… ఆ సమయంలో అభిషేక్ తీవ్రమైన విషాదంలో మునిగిపోయారు…

కొత్త ఆశలు: లైలా ఫైసల్ పరిచయం… ఆ చీకటి రోజుల నుండి కోలుకుంటున్న సమయంలో, అభిషేక్ జీవితంలోకి లైలా ఫైసల్ ప్రవేశించింది… ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయిన లైలాతో అభిషేక్ స్నేహం నెమ్మదిగా బలపడింది…

కుటుంబంతో సాన్నిహిత్యం….: అభిషేక్ సోదరి కోమల్ శర్మ వివాహ వేడుకల్లో లైలా సందడి చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది… కుటుంబ సభ్యులతో ఆమె కలిసిపోయిన తీరు చూసి, వీరిద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందని అభిమానులు ఫిక్స్ అయ్యారు…

ప్రోత్సాహం…: మైదానంలో అభిషేక్ సెంచరీ బాదినప్పుడు లైలా సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లు, వీరిద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్లడం వంటివి అభిషేక్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని సూచిస్తున్నాయి. గతంలోని చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టి, లైలా అండతో అభిషేక్ మళ్ళీ కెరీర్‌పై దృష్టి సారించాడు…

ప్రస్తుతం వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా, వీరి ‘సోషల్ కెమిస్ట్రీ’ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్…. నో, నో, కావ్యా మారన్… వదిలెయ్, ఆశలు పెంచుకోకు… తను ఆల్రెడీ కమిటెడ్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘యాంటీ హిందూ’ లెన్స్‌కార్ట్‌… స్టాక్‌మార్కెట్ బాగానే శిక్షిస్తోంది…
  • సిక్సర్ల అభిషేకుడిని పడేసిన లైలా..! పాత ట్రాజెడీ మరిచి కొత్త బంధం…!
  • పూసల పిల్ల మోనాలిసా కేసులో మరో ట్విస్టు… పోలీసులతో గేమ్స్…
  • ఏమైంది ఈ గ్రూపుకి..? రతన్ టాటా గనుక బతికి ఉంటే ఏమైపోయేవాడో…!
  • నిన్ను అమ్మమ్మా అనడమేంటి..? ఓ కేరక్టర్ సోయి లేని వ్యాఖ్యలు…!
  • అర్ధరాత్రి దాటింది… ఆమె బస్సు దిగింది… అక్కడెవరూ లేరు…
  • అణుదాడికి అమెరికా రెడీ..! న్యూక్లియర్ అలర్ట్ జారీ..!!
  • చాణక్య నీతి..! బాబుకన్నా పదాకులు మోదీ ఎక్కువే చదివాడు..!!
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • అసలు ఖరీదు లక్షన్నర… ఖాళీ సీసాల్లో వంద రూపాయల మందు నింపి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions