.
. ( పార్థసారథి పొట్లూరి ) .. …. లారా కూపర్ – Laura Cooper! డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అఫ్ డిఫెన్స్
రష్యా, ఉక్రెయిన్, యురేసియాలకి కో ఆర్డినేటర్ గా పెంటగాన్ లో పనిచేస్తున్నది గత 20 ఏళ్లుగా! ఈ లారా కూపర్ రాజీనామా చేసింది!
Ads
కో ఆర్డినేటర్ అంటే రష్యా, ఉక్రెయిన్, యూరోప్, ఆసియాలతో సంప్రదింపులు జరపడం! మరీ ముఖ్యంగా గత మూడేళ్లలో అంటే రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టినప్పటి నుండి ఉక్రెయిన్ తో మాత్రమే మమేకం అయ్యింది!
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఉండే అత్యున్నత అధికారుల చేత ‘ విశ్వాసించతగ్గ బ్రోకర్ ‘ అనే మంచి పేరు తెచ్చుకుంది! అఫ్కోర్స్! మనకి బ్రోకర్ అనే పదం కొంచెం ఎబ్బెట్టుగా గా ఉంటుంది కానీ వాళ్ళు సంప్రదింపులు అనే అర్ధంలోనే వాడతారు!
రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది? కీవ్ అధికారులు అడిగింది, అడగాలనుకొని అనుకుంటున్నవీ తానే అనుకునేసి పెంటగాన్ తో పాటు జో బిడెన్ మంత్రాంగానికి కూడా రిపోర్ట్ చేసేది!
ఎందుకంత ప్రేమ? ఇదే బయటపడవచ్చు కొద్ది వారాలలో! ఉక్రెయిన్ కి ఎయిడ్ కింద ఎన్ని మిలియన్లు ఇవ్వాలో రిపోర్ట్ చేసింది. ఇక్కడే ఏదో జరిగివుంటుంది అనే అనుమానాలు ఉన్నాయి. అంటే 200 మిలియన్ డాలర్లు అవసరం ఉంటే 600 మిలియన్ డాలర్లుగా సహాయం అందుతూ వచ్చింది ఉక్రెయిన్ కి. మిగతా 400 మిలియన్లు ఎవరి జేబులోకి వెళ్ళి ఉండవచ్చు? ఇదే ప్రశ్న.
ఉక్రెయిన్ కి సహాయం కింద ఇచ్చే డబ్బుకి లెక్క చెప్పాలి ఎలా, ఎక్కడ ఖర్చు పెట్టారో. కానీ యుద్ధం అనే మాటతో సరైన ఆడిటింగ్ లేకుండా అనుమతులు ఇవ్వడం జరిగింది! ఆయుధాలు కొన్నట్లు అవి డిస్పాచ్ అయినట్లు రష్యాతో యుద్ధంలో వాటిని వాడినట్లు చూపించారు. వాడేసిన ఆయుధాలు ఫిజికల్ గా కనపడవు.
మొత్తానికి బిలియన్ల కొద్ది డాలర్ల స్కామ్ జరిగింది!
ట్రంప్ ప్రమాణ స్వీకారం జరిగేదాకా ఎందుకని రాజీనామా చేసింది. కొన్ని నాటో దేశాల పాత్ర కొట్టివేయలేము!
ఇప్పటికి ఏమీ కాకపోవచ్చు. ట్రంప్ అధికారంలోకి రాగానే బయటపడతాయి! ఇది పుతిన్ కి ఊరట! జలెన్ స్కీ కి బాధ!
Share this Article