.
ఎస్, ఖచ్చితంగా సమస్య లెన్స్‌కార్ట్ ఫౌండర్ కమ్ సీఈవో దగ్గరే ఉంది… హిందూ మత విశ్వాసాల్ని, సంప్రదాయాల్ని, పద్దతుల్ని కించపరిచేట్టుగా తన యాడ్స్, తన రూల్స్, తన డ్రెస్ కోడ్స్ అన్నీ తనకు తెలుసు… కానీ కవర్ చేస్తున్నాడు… వేల కోట్ల రూపాయల్ని పబ్లిక్ ఆఫర్ ద్వారా… అడ్డగోలు మార్జిన్లను తన చెయిన్ ఆఫ్ స్టోర్స్ ద్వారా సంపాదిస్తున్న తనకు హిందువులంటే ఎందుకు అంత చులకనభావం ఏర్పడిందో అర్థం కాదు…
5.6 బిలియన్ డాలర్ల కంపెనీ…. ఒక లిఖితపూర్వక విధానం (Policy)… ఇద్దరు తొలగించబడిన ఉద్యోగులు… మాట మారుస్తూ వచ్చిన ఒక CEO… అది భారతదేశపు అతిపెద్ద ఐవేర్ రిటైలర్, ఐపీఓకి వెళ్లి భారీగా సబ్‌స్క్రయిబ్ అయిపోయి, అడ్డగోలుగా నిధులు సమకూరిన కంపెనీ అది… అప్పటికే 5.6 బిలియన్ డాలర్ల విలువ కలిగిన లెన్స్‌కార్ట్ (Lenskart), స్టోర్ సిబ్బంది కోసం ఒక ‘స్టైల్ గైడ్’ను రూపొందించింది… ఇది ఏప్రిల్ 15న వెలుగులోకి వచ్చింది…
Ads
నియమాలు…: బిందీ (బొట్టు) పెట్టుకోకూడదు…. తిలకం ధరించకూడదు… చేతి పట్టీ, దారం కట్టకూడదు… సింధూరం చాలా తక్కువగా ఉండాలి, అది కూడా నుదుటిపై కనిపించకూడదు… మరి హిజాబ్? దీనికి స్పష్టమైన అనుమతి ఇచ్చాడు… రంగుల విషయంలో సూచనలు ఇచ్చాడు… సిబ్బంది కోసం ట్యుటోరియల్ వీడియోలు కూడా ఇస్తామని వాగ్దానం చేశాడు…
ఈ విధాన పత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, CEO పీయూష్ బన్సల్ దీనిని “నిజం కాదు (inaccurate)” అని కొట్టిపారేశాడు మొదట్లో… అయితే, X (గతంలో ట్విట్టర్) కమ్యూనిటీ నోట్ తన వివరణ తప్పు అని పేర్కొంది… ఎందుకంటే ఆ డాక్యుమెంట్ కంపెనీ బ్రాండింగ్‌తో ఉంది, ఫిబ్రవరి 2026 నాటి తేదీతో ఉంది…
ఇది బయట పడగానే తను వెంటనే మాట మార్చాడు… అది ఒక “పాత ట్రైనింగ్ డాక్యుమెంట్” అని, అందులో ఒక “తప్పుడు లైన్” ఉందని, అది బహిరంగం కావడానికి ముందే అంటే ఫిబ్రవరి 17న గుర్తించి తొలగించామని చెప్పాడు… కానీ, ఆ కథ 24 గంటల్లోనే కుప్పకూలింది… పీయూష్ అనే అబద్ధాల కోరు పదే పదే కవర్ చేస్తున్నాడు తన తప్పును అని తేలిపోయింది…
పుణెలోని లెన్స్‌కార్ట్ స్టోర్ మేనేజర్ ఆకాష్ ఫలకే దగ్గర ఇందుకు సంబంధించిన ఈమెయిల్స్ ఉన్నాయి… నవంబర్ 25, 2025 నాడే ఆయన సరిగ్గా ఇదే పాలసీ గురించి లెన్స్‌కార్ట్ HRకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు… డిసెంబర్ 8న సీనియర్ HRకి మరోసారి సమాచారం ఇచ్చాడు… జనవరి- ఫిబ్రవరి 2026 మధ్య కాలంలో, స్టోర్ ఆడిట్‌ల ద్వారా బొట్టు లేదా తిలకం ధరించిన ఉద్యోగుల జీతాల్లో కోతలు కూడా విధించారు…
ఫలకే ఈ విషయాన్ని లీగల్ టీమ్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు… ఫిబ్రవరి 20న ఆయన మహారాష్ట్ర ప్రభుత్వ గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు… అదే రోజు ఆయన్ను ఉద్యోగం నుండి తొలగించారు…
ఆ తర్వాత సూరత్‌కు చెందిన జీల్ సోఘాసియా కథ బయటకు వచ్చింది… ఆయనకు లెన్స్‌కార్ట్‌లో ఉద్యోగం వచ్చింది… శిక్షణ కోసం నవీ ముంబైకి వెళ్లాడు… మొదటి రోజే ఆయనకు ఒక షరతు పెట్టారు… “నీ శిఖను కత్తిరించుకోవాలి, తిలకాన్ని, మతపరమైన ట్యాటూలను తొలగించాలి, లేకపోతే ఉద్యోగం ఉండదు…”
ఆయన నిరాకరించాడు… మరుసటి రోజే ఆయన్ను తీసేశారు… ఇది జరిగింది ఏప్రిల్ 18, 2026న… అంటే ఆ పాలసీని ఎప్పుడో తొలగించామని బన్సల్ చెప్పిన 60 రోజుల తర్వాత… ఐదు నెలల కాలంలో ఇద్దరు ఉద్యోగులు అంతర్గతంగా ఈ విషయాన్ని లేవనెత్తారు… ఇద్దరినీ పట్టించుకోలేదు… ఒకరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన రోజున, మరొకరు తన మతపరమైన గుర్తులను మార్చుకోవడానికి నిరాకరించినందుకు తొలగించబడ్డారు…
CEO తన వెర్షన్‌ను మూడుసార్లు మార్చాడు… ప్రతిసారీ కొత్త సాక్ష్యాలు బయటకు రావడంతో ఆయన మాట మార్చాల్సి వచ్చింది… ఆధునిక భారతీయ కార్పొరేట్ కార్యాలయాల్లో సంస్థాగత మతవివక్ష ఇలాగే పనిచేస్తుంది – ఉపన్యాసాల ద్వారా కాదు, ఆడిట్ కోతలు, గ్రూమింగ్ గైడ్‌లు, టెర్మినేషన్ లెటర్ల ద్వారా… ఇవన్నీ ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా జరిగిపోవాలని రూపొందించిన వ్యవస్థలు… (సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న సమాచారం ఆధారంగా)…
Share this Article